Ram RED movie : ‘రెడ్’ సినిమా రీమేక్ కాదు అసలు విషయం చెప్పిన దర్శకుడు.. రామ్ లుక్ ఎవరు డిజైన్ చేసారో తెలుసా.?

యంగ్ హీరో రామ్ ఇస్మార్ట్ శంకర్ సినిమాతో సాలిడ్ హిట్ అందుకున్న విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు అదే జోష్ తో 'రెడ్' అనే సినిమా చేస్తున్నాడు. కిషోర్ తిరుమల దర్శకత్వం వహించిన...

Ram RED movie : 'రెడ్' సినిమా రీమేక్ కాదు అసలు విషయం చెప్పిన దర్శకుడు.. రామ్ లుక్ ఎవరు డిజైన్ చేసారో తెలుసా.?
Follow us
Rajeev Rayala

|

Updated on: Jan 03, 2021 | 7:04 PM

ram red movie : యంగ్ హీరో రామ్ ఇటీవల ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాతో సాలిడ్ హిట్ అందుకున్న విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు అదే జోష్ తో ‘రెడ్’ అనే సినిమా చేస్తున్నాడు. కిషోర్ తిరుమల దర్శకత్వం వహించిన ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. సంక్రాంతి కానుకగా సినిమాను జనవరి 14న విడుదల చేయనున్నారు మేకర్స్. గతంలో కిషోర్ తిరుమల-రామ్ కాంబినేషన్లో ‘నేను శైలజ’, ‘ఉన్నది ఒకటే జిందగీ’ వచ్చిన హిట్ సినిమాలు వచ్చాయి. ఇక ఈ సినిమాలో రామ్ మొదటి సారి డ్యూయల్ రోల్ లో కనిపించనున్నాడు.

ఇటీవల విడుదలైన రెడ్ ట్రైలర్ సినిమా పై అంచనాలను పెంచేసింది. మణిశర్మ అందించిన సంగీతం కూడా ఆకట్టుకుంటుంది. అయితే ఈ సినిమా ‘తడమ్’ అనే సినిమాకు రీమేక్ గా వస్తుంది. తాజాగా తిరులమా కిషోర్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..ఈ సినిమా ‘తడమ్’ సినిమాకు రీమేక్ గా తెరకెక్కించలేదు. ఆ సినిమా నుంచి కేవలం లైన్ మాత్రమే తీసుకున్నామని, కథ- కథనం- స్క్రీన్ ప్లే అన్నీ కొత్తగా రాసుకున్నామని అన్నారు. ఈ సినిమాలో రామ్ లుక్ ఎవ్వరు డిజైన్ చేయలేదని రామ్ సొంతంగా ట్రై చేస్తుండని అన్నారు. ఇక తన నెక్స్ట్ సినిమా శర్వానంద్ తో ఉంటుందని తెలిపారు కిషోర్. ఆ సినిమాకు ‘ఆడాళ్ళు మీకు జోహార్లు’ అనే టైటిల్ అనుకుంటున్నట్టు తెలిపారు.

also read : Drugs Case : అడ్డంగా దొరికిపోయిన టాలీవుడ్ నటి.. ముంబైలో రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న ఎన్.సీ.బీ అధికారులు..