Pawan Kalyan-Rana Movie : పవన్ కళ్యాణ్- రానా సినిమా షూటింగ్ మొదలైయేది అప్పుడేనా.?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి హీరో రానా కలిసి నటిస్తున్న సినిమా అయ్యప్పన్ కోషియమ్ రీమేక్.ప్రస్తుతం వకీల్ సాబ్ సినిమా పూర్తి చేసిన పవన్ త్వరలోనే ఈ సినిమా షూటింగ్ లో జాయిన్ అవ్వబోతున్నాడట.
Pawan Kalyan-Rana Movie : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి హీరో రానా కలిసి నటిస్తున్న సినిమా ‘అయ్యప్పన్ కోషియమ్’ రీమేక్. ప్రస్తుతం ‘వకీల్ సాబ్’ సినిమా పూర్తి చేసిన పవన్ త్వరలోనే ఈ సినిమా షూటింగ్ లో జాయిన్ అవ్వబోతున్నాడట. నిజానికి ఈ సినిమా తర్వాత క్రిష్ తో సినిమా తెరకెక్కించాలి. అయితే ‘వకీల్ సాబ్’ సినిమా షూటింగ్ లేట్ అవ్వడంతో క్రిష్ ఈ గ్యాప్ లో వైష్ణవ్ తేజ్ తో ఓ సినిమాను చేసేసాడు. అయితే ‘అయ్యప్పన్ కోషియమ్’ రీమేక్ తర్వాత క్రిష్ సినిమా ఉంటుందని తెలుస్తుంది. ఇక ఈ రీమేక్ కు సాగర్ చంద్ర దర్శకత్వం వహిస్తున్నాడు.
‘అయ్యప్పన్ కోషియం’ తెలుగు హక్కులను సితార ఎంటర్టైన్మెంట్స్ వారు దక్కించుకున్న విషయం తెలిసిందే. ఇక ఈ సినిమా షూటింగ్ ను త్వరలోనే ప్రారంభించనున్నారని తెలుస్తుంది. సంక్రాంతి తర్వాత అంటే జనవరి మూడో వారంలో షూటింగ్ మొదలు పెట్టనున్నారని తెలుస్తుంది. ఇక ఇప్పుడిప్పుడే థియేటర్స్ కు ప్రేక్షకులు వస్తున్న నేపథ్యంలో వకీల్ సాబ్ త్వరలో థియేటర్స్ లో విడుదల చేయాలనీ మేకర్స్ భావిస్తున్నారు. శ్రుతిహాసన్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమా థమన్ సంగీతం అందించారు. ఇక ‘అయ్యప్పన్ కోషియం’ రీమేక్ కూడా థమన్ సంగీతం అందిస్తున్నారు. ఈ రీమేక్ లో పవన్ కు జోడీగా సాయిపల్లవిని అనుకుంటుంన్నారట. ఇక రానా సరసన ఐశ్వర్య రాజేష్ దాదాపు ఫిక్స్ అయిపోయినట్టు ప్రచారం జరుగుతుంది.