Poorna In Balakrishna’s Film : బాలకృష్ణ సినిమా కోసం విలన్ గా మారనున్న యంగ్ బ్యూటీ..

నందమూరి నటసింహం బాలకృష్ణ సినిమాకోసం అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక బోయపాటి దర్శకత్వంలో బాలయ్య హ్యాట్రిక్ సినిమా చేస్తున్న విషయం తెల్సిందే.

Poorna In Balakrishna's Film : బాలకృష్ణ సినిమా కోసం విలన్ గా మారనున్న యంగ్ బ్యూటీ..
ఈ సినిమాలో బాలకృష్ణ భార్యగా పూర్ణ నటిస్తుందని వార్తలు వినిపిస్తున్నాయి.  ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో బాలయ్యకు భార్యగా కనిపించనుందట పూర్ణ. 
Follow us
Rajeev Rayala

|

Updated on: Jan 03, 2021 | 5:54 PM

Poorna In Balakrishna’s Film : నందమూరి నటసింహం బాలకృష్ణ సినిమాకోసం అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక బోయపాటి దర్శకత్వంలో బాలయ్య హ్యాట్రిక్ సినిమా చేస్తున్న విషయం తెల్సిందే. ‘సింహా’ ‘లెజెండ్’ సినిమాలు సూపర్ హిట్ అవ్వడంతో ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో బాలకృష్ణ డ్యూయెల్ రోల్ లో కనిపించనున్నారని తెలుస్తుంది. ‘బిబి3’ అనే వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది.

ఈ సినిమాలో యంగ్ బ్యూటీ సయాషా సైగల్ హీరోయిన్ గా నటిస్తోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ వార్త ఫిలిం నగర్లో చక్కర్లు కొడుతుంది. ఈ మూవీలో హీరోయిన్ పూర్ణ కూడా నటిస్తున్నారు. అయితే ఆమె ఈ సినిమాలో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించనున్నారని అంటున్నారు. ఇక పూర్ణను బోయపాటి ఓ పవర్ ఫుల్ లేడీ విలన్ గా చూపించబోతున్నారట. ఈ సినిమాలో పూర్ణ నటన క్లిక్ అయితే అమ్మడికి ఆఫర్లు వెల్లువెత్తుతాయని అంటున్నారు విశ్లేషకులు. మరి ఈ విలన్ గా ఈ అమ్మడు ఎలా మెప్పిస్తుందో చూడాలి.

also read : Bellamkonda Sreenivas : బెల్లంకొండ శ్రీనివాస్‌తో జతకట్టేందుకు అతిలోక సుందరి కూతురు ఓకే చెప్పిందా..?