Singer Vani Jayaram Death: వాణీ జయరాం మృతిపై అనుమానాలు ?.. ముఖం పై బలమైన గాయాలతో రక్తపు మడుగులో ..

పని మనిషి చెప్పిన వివరాల ఆధారంగా అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Singer Vani Jayaram Death: వాణీ జయరాం మృతిపై అనుమానాలు ?.. ముఖం పై బలమైన గాయాలతో రక్తపు మడుగులో ..
Vani Jayaram Death

Updated on: Feb 04, 2023 | 4:16 PM

లెజండరీ సింగర్ వాణీ జయరామ్ మరణవార్తతో ఇండస్ట్రీ షాకయ్యింది. శనివారం మధ్యాహ్నం ఆమె తుదిశ్వాస విడిచినట్లు సమాచారం. అయితే తాజాగా ఆమె మృతిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆమె ముఖంపై గాయాలున్నట్లు పనిమనిషి చెప్పడంతో పోలీసులు రంగంలోకి దిగారు. పని మనిషి చెప్పిన వివరాల ఆధారంగా అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. గాయని ఇంటిని తమ అధీనంలోకి తీసుకున్నారు. అంతేకాకుండా.. ఆమె ఇంటి సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తున్నారు.

ఈరోజు ఉదయం 11 గంటలకు వాణీ జయరామ్ ఎంతసేపటికి డోర్ తీయకపోవడంతో ఆమె పనిమనిషి చెన్నై మైలాపూర్ లో ఉన్న కుటుంబసభ్యులకు సమాచారం ఇచ్చిందని.. కొద్ది సేపటి తర్వాత వచ్చిన బంధువులు డోర్ ని పగలకొట్టి చూడగా.. తీవ్ర గాయాలతో గ్లాస్ టేబుల్‌పై రక్తమడుగులో వాణీజయరాం పడి ఉన్నారని తెలిపారు. ఆమె ముఖానికి బలమైనగాయాలున్నాయి.. నుదురు, ముఖంపై ఎవరో కొట్టినట్లుగా తీవ్రగాయాలున్నాయని.. అప్పటికే ఆమె స్పృహలో లేరని వివరించారు.

ఘటన జరిగిన సమయంలో ఇంట్లో ఎవరు లేరని.. వెంటనే ఆమెను బంధువులు హుటా హుటిన ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ వాణీ జయరామ్ మధ్యాహ్నం తుదిశ్వాస విడిచినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం వాణీ జయరామ్ మృతిపట్ల దర్యాప్తు జరుగుతోంది. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.