Mahesh Babu: ఈ ఫోటోలో మహేష్ బాబుతో ఉన్న చిన్నోడు.. ఇప్పుడు యంగ్ హీరోగా రాణిస్తున్నాడు.. ఎవరో గుర్తుపట్టారా..

తాజాగా ఓ యంగ్ హీరో ఫోటో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. పై ఫొటోలో సూపర్ స్టార్ మహేష్ బాబు పక్కన ఉన్న చిన్నాడు ఎవరో గుర్తుపట్టారా..?

Mahesh Babu: ఈ ఫోటోలో మహేష్ బాబుతో ఉన్న చిన్నోడు.. ఇప్పుడు యంగ్ హీరోగా రాణిస్తున్నాడు.. ఎవరో గుర్తుపట్టారా..
Mahesh Babu
Follow us
Rajeev Rayala

|

Updated on: Apr 01, 2023 | 11:30 AM

చైల్డ్ హుడ్ ఫోటోలు ఈ మధ్య సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోన్న విషయం తెలిసిందే. హీరోయిన్స్ కు సంబంధించిన ఫోటోలు ఎక్కువగా వైరల్ అవుతూ ఉంటాయి. తాజాగా ఓ యంగ్ హీరో ఫోటో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. పై ఫొటోలో సూపర్ స్టార్ మహేష్ బాబు పక్కన ఉన్న చిన్నాడు ఎవరో గుర్తుపట్టారా..? ఆ బుడ్డోడు ఇప్పుడు టాలీవుడ్ లో యంగ్ హీరో ఎవరో కనిపెట్టరా..? ఆ యంగ్ హీరో చేసింది తక్కువ సినిమాలే అయినా మంచి క్రేజ్ సొంతం చేసుకున్నాడు. ఇంతకు అతను ఎవరంటే..

పై ఫొటోలో మహేష్ బాబుతో ఉన్న చిన్నోడు ఎవరో కాదు సీనియర్ హీరో శ్రీకాంత్ తనయుడు రోషన్. నిర్మల కాన్వెంట్ అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చిన రోషన్.. పెళ్లిసందడి సినిమాతో హీరో గా పరిచయం అయ్యాడు. తొలి సినిమాతోనే ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు రోషన్.

ఇక ఇప్పుడు రోషన్ తన సినిమాల విషయంలో ఆచి తూచి అడుగులు వేస్తున్నాడు. వచ్చిన సినిమాలన్నీ ఒప్పుకోకుండా కథలో బలమున్న సినిమాలను ఎంపిక చేసుకుంటున్నాడు. త్వరలోనే తన నెక్స్ట్ ప్రాజెక్ట్ ను అనౌన్స్ చేయనున్నాడు. ఇప్పుడు మహేష్ బాబుతో రోషన్ దిగిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే ఈ ఫోటో పై నెటిజన్లు రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. మహేష్ పక్కన చిన్నబాబు ఇప్పుడు చాలా మారిపోయాడు.. కానీ మహేష్ బాబు మాత్రం ఏం మారలేదు.. అంతే అందంగా ఉన్నారు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.Roshan, Mahesh Babu