సినిమా ఇండస్ట్రీలో చాలా మంది హీరోయిన్స్ స్టార్స్ గా రాణిస్తున్నారు. పై ఫోటోలో కనిపిస్తున్న హీరోయిన్ ను గుర్తుపట్టారా.? చాలా కాలంగా స్టార్ హీరోయిన్ గా రాణిస్తుంది ఈ చిన్నది. ఇంతకూ ఆమె ఎవరో గుర్తుపట్టారా.? చాలా మంది కష్టపడి ఇండస్ట్రీకి వస్తుంటారు. అలాగే ఈ హీరోయిన్ కూడా కష్టపడి స్టార్ గా ఎదిగింది. కెరీర్ బిగినింగ్ లో చిన్న చిన్న పాత్రలు చేసిన ఆమె.. ఆ తర్వాత హీరోయిన్ గా మారిపోయింది. చిన్న సినిమాలనుంచి స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. ఇప్పుడు హీరోలకు సమానంగా రెమ్యునరేషన్ తీసుకుంటూ దూసుకుపోతోంది. తెలుగు, తమిళ్ సినిమాల్లో నటిస్తూ ప్రేక్షకులను మెప్పిస్తుంది. ఇంతకూ ఆమె ఎవరో కనిపెట్టరా.?
పై ఫోటోలు సోఫాలో కూర్చొని క్యూట్ స్మైల్ తో ఆకట్టుకుంటున్న ఆ బ్యూటీ ఎవరో గుర్తుపట్టారా.? తన అందంతో కుర్రకారును ఆకట్టుకుంటుంది ఈ వయ్యారి భామ. ఆమె మరెవరో కాదు. చెన్నయ్ చంద్రం త్రిష కృష్ణన్. టాలీవుడ్ లో త్రిష దాదాపు అందరు హీరోల సరసన నటించి మెప్పించింది. చిరంజీవి, వెంకటేష్, బాలకృష్ణ సరసన త్రిష. మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్ లతో కూడా నటించి మెప్పించింది.
ఈ మధ్య కాలంలో త్రిష టాలీవుడ్ కు దూరంగా ఉంటుంది. ఎక్కువగా ఆమె తమిళ్ సినిమాల పైనే ఫోకస్ పెట్టింది. ఇటీవలే పొన్నియన్ సెల్వన్ సినిమాతో మంచి హిట్ అందుకుంది. అంతే కాదు ఈ సినిమాలో నటించిన ఐశ్వర్య రాయ్‌తో అందం విషయంలో పోటీ పడింది. ఇక త్రిష ప్రస్తుతం మెగాస్టార్ కు జోడీగా విశ్వంభర సినిమాలో నటిస్తుంది. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాకు వశిష్ఠ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో త్రిషతో పాటు మరికొంతమంది హీరోయిన్స్ కూడా నటిస్తున్నారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.