ఇదెక్కడి మాస్ రా మావ..!! మోహన్ బాబు ఈ బాలీవుడ్ హాట్ బ్యూటీతో నటించారని తెలుసా..?

తన నటనతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు మోహన్ బాబు. డైలాగ్స్ చెప్పడంలో ఆయనతో ఓ ప్రత్యేక శైలి. విలన్ గా కెరీర్ ప్రారంభించిన మోహన్ బాబు ఆతర్వాత హీరోగా ఎదిగారు. ఎన్నో వైవిధ్యమైన పాత్రల్లో నటించారు.

ఇదెక్కడి మాస్ రా మావ..!! మోహన్ బాబు ఈ బాలీవుడ్ హాట్ బ్యూటీతో నటించారని తెలుసా..?
Mohan Babu
Follow us
Rajeev Rayala

|

Updated on: Oct 14, 2024 | 3:14 PM

మంచు మోహన్ బాబు.. ఇప్పుడంటే ఆయన సినిమాల స్పీడ్ తగ్గించారు కానీ ఒకప్పుడు మోహన్ బాబు అంటే డైలాగ్ కింగ్, కలెక్షన్ కింగ్. మోహన్ బాబు సినిమాలకు ఉండే క్రేజే వేరు. తన నటనతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు మోహన్ బాబు. డైలాగ్స్ చెప్పడంలో ఆయనతో ఓ ప్రత్యేక శైలి. విలన్ గా కెరీర్ ప్రారంభించిన మోహన్ బాబు ఆతర్వాత హీరోగా ఎదిగారు. ఎన్నో వైవిధ్యమైన పాత్రల్లో నటించారు. అలాగే ఎన్నో విజయాలను కూడా అందుకున్నారు మోహన్ బాబు. ఫ్యామిలి ఆడియన్స్ తో పాటు మాస్ ఆడియన్స్ ను కూడా తన నటనతో మెప్పించారు కలెక్షన్ కింగ్. అయితే మోహన్ బాబు చాలా మంది హీరోయిన్స్ తో నటించారు. అయితే ఓ బాలీవుడ్ బ్యూటీతో ఆయన నటించారు.

ఇది కూడా చదవండి : ఏంటి భయ్యా ఈ అమ్మడు.. మరీ ఇంత బాగుంది..! మహేష్ హీరోయిన్ ఇప్పుడు ఎలా ఉందంటే

అయితే ఆ హీరోయిన్ ఎవరో మీరు అస్సలు ఊహించలేరు. బాలీవుడ్ లో ఇప్పటికి డిమాండ్ ఉన్న హీరోయిన్ ఆమె.. ఆమె మరెవరో కాదు హాట్ బ్యూటీ శిల్పా శెట్టి. అవును మోహన్ బాబు సరసన బాలీవుడ్ అందాల భామ శిల్పాశెట్టి నటించారు. ఎంతో మంది హీరోయిన్స్ తో కలిసి నటించిన మోహన్ బాబు శిల్పా శెట్టితోనూ నటించారు. బాలీవుడ్ అందాల భామ శిల్పా శెట్టి ఎక్కువగా హిందీలోనే సినిమాలు చేసింది. ఆమె తెలుగులో చేసిన సినిమాలు తక్కువే. తెలుగులో శిల్పా శెట్టి చేసిన సినిమాలు నాలుగే..

వాటిలో మోహన్ బాబు సినిమా ఒకటి. ఆ సినిమానే వీడెవడండీ బాబూ.! 1997 లో ఇ. వి. వి. సత్యనారాయణ దర్శకత్వంలో వచ్చింది ఈ సినిమా. ఉల్లత్తై అల్లిత్తా అనే సినిమాకు రీమేక్ ఈ సినిమా. ఈ సినిమాలో శిల్పా శెట్టి హీరోయిన్ గా చేసింది. వెంకటేష్ హీరోగా నటించిన సాహస వీరుడు సాగర కన్య అనే సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది శిల్పా శెట్టి. ఆతర్వాత మోహన్ బాబుతో వీడెవడండీ బాబూ అనే సినిమా చేసింది. ఆతర్వాత నాగార్జునతో కలిసి ఆజాద్ సినిమాలో నటించింది. ఆతర్వాత బాలకృష్ణతో భలేవాడివి బాసు అనే సినిమాలో మెరిసింది. మోహన్ బాబు ప్రస్తుతం మంచు విష్ణు హీరోగా నటిస్తున్న కన్నప్ప సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాలో ఆయన కీలక పాత్ర చేస్తున్నారు.

View this post on Instagram

A post shared by R C Nayak (@r.c.nayak0505)

శిల్పా శెట్టి ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ పోస్ట్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

టేస్టీ అండ్ హెల్దీ కొబ్బరి పొడి.. బ్రేక్ ఫాస్ట్‌లోకి అదుర్స్!
టేస్టీ అండ్ హెల్దీ కొబ్బరి పొడి.. బ్రేక్ ఫాస్ట్‌లోకి అదుర్స్!
గురకతో ఇబ్బందిగా ఉందా..? తగ్గించుకునేందుకు చిట్కాలు!
గురకతో ఇబ్బందిగా ఉందా..? తగ్గించుకునేందుకు చిట్కాలు!
ఈజీగా అయిపోయే మీల్ మేకర్ మంచూరియా.. ఆరోగ్యం కూడా..
ఈజీగా అయిపోయే మీల్ మేకర్ మంచూరియా.. ఆరోగ్యం కూడా..
అన్నంతో రుచిగా మురుకులు.. కరకరలాడుతూ భలేగా ఉంటాయి..
అన్నంతో రుచిగా మురుకులు.. కరకరలాడుతూ భలేగా ఉంటాయి..
ఎల్‌ఐసీలో క్లెయిమ్‌ చేయని రూ.880 కోట్లు.. తెలుసుకోవడం ఎలా?
ఎల్‌ఐసీలో క్లెయిమ్‌ చేయని రూ.880 కోట్లు.. తెలుసుకోవడం ఎలా?
ఈ సారి చేపల వేపుడు ఇలా చేయండి.. ఆహా అదిరిపోతుంది..
ఈ సారి చేపల వేపుడు ఇలా చేయండి.. ఆహా అదిరిపోతుంది..
బాక్సింగ్ డే టెస్ట్‌కు ముందు కొత్త హెయిర్ కట్‌ అదరగొట్టిన విరాట్!
బాక్సింగ్ డే టెస్ట్‌కు ముందు కొత్త హెయిర్ కట్‌ అదరగొట్టిన విరాట్!
విజయ్ హజారే ట్రోఫీలో భారీ సెంచరీతో చెలరేగిన శ్రేయాస్ అయ్యర్
విజయ్ హజారే ట్రోఫీలో భారీ సెంచరీతో చెలరేగిన శ్రేయాస్ అయ్యర్
కువైట్‌లో భారత కార్మికులతో మమేకమైన ప్రధాని మోదీ!
కువైట్‌లో భారత కార్మికులతో మమేకమైన ప్రధాని మోదీ!
ఛాతిలో పేరుకుపోయిన కఫానికి ఇలా చెక్‌ పెట్టండి.. నేచురల్‌ టిప్స్‌
ఛాతిలో పేరుకుపోయిన కఫానికి ఇలా చెక్‌ పెట్టండి.. నేచురల్‌ టిప్స్‌