Geetha Govindam: బాబోయ్.. అప్పుడు విజయ్ ప్రేమ కోసం ఆరాటం.. ఇప్పుడు నెట్టింట సంచలనం..

2018లో రిలీజ్ అయిన ఈ సినిమా అటు కలెక్షన్ల వర్షం కురిపించింది. ఇందులో విజయ్ దేవరకొండ జోడిగా నేషనల్ క్రష్ రష్మిక మందన్నా నటించింది. ఇక ఈ సినిమాలో రష్మిక కంటే ఎక్కువగా స్పెషల్ అట్రాక్షన్ అయ్యింది ఓ అమ్మాయి. ఈ మూవీలో విజయ్ ను అమితంగా ప్రేమించే స్టూడెంట్ పాత్రలో నటించింది. సినిమాలో కనిపించింది తక్కువ సమయమే కానీ తన నటనతో అబ్బురపరిచింది. విజయ్ ను ప్రేమిస్తున్నాను.. పెళ్లి చేసుకో అంటూ వెంటపడుతూ సినిమాలో స్పెషల్ అప్పీరియన్స్ ఇచ్చింది.

Geetha Govindam: బాబోయ్.. అప్పుడు విజయ్ ప్రేమ కోసం ఆరాటం.. ఇప్పుడు నెట్టింట సంచలనం..
Geetha Govindam
Follow us
Rajitha Chanti

|

Updated on: May 12, 2024 | 10:54 AM

కెరీర్ మొదట్లో చిన్న చిన్న పాత్రలతో అలరించి ఇప్పుడు హీరోగా మెప్పిస్తున్న స్టార్ విజయ్ దేవరకొండ. అర్జున్ రెడ్డి మూవీతో హీరోగా సెన్సెషన్ సృష్టించిన విజయ్.. ఇప్పుడు హిట్టు, ప్లాపులతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో బిజీగా ఉంటున్నాడు. ఇటీవలే ఫ్యామిలీ స్టార్ సినిమాతో మంచి విజయం ఖాతాలో వేసుకున్న విజయ్.. ఇప్పుడు గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. ఇప్పటివరకు విజయ్ నటించిన చిత్రాల్లో వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీ గీతా గోవిదం. డైరెక్టర్ పరశురామ్ తెరకెక్కించిన ఈ మూవీ భారీ విజయాన్ని అందుకుంది. 2018లో రిలీజ్ అయిన ఈ సినిమా అటు కలెక్షన్ల వర్షం కురిపించింది. ఇందులో విజయ్ దేవరకొండ జోడిగా నేషనల్ క్రష్ రష్మిక మందన్నా నటించింది. ఇక ఈ సినిమాలో రష్మిక కంటే ఎక్కువగా స్పెషల్ అట్రాక్షన్ అయ్యింది ఓ అమ్మాయి. ఈ మూవీలో విజయ్ ను అమితంగా ప్రేమించే స్టూడెంట్ పాత్రలో నటించింది. సినిమాలో కనిపించింది తక్కువ సమయమే కానీ తన నటనతో అబ్బురపరిచింది. విజయ్ ను ప్రేమిస్తున్నాను.. పెళ్లి చేసుకో అంటూ వెంటపడుతూ సినిమాలో స్పెషల్ అప్పీరియన్స్ ఇచ్చింది. ఇప్పుడు మాత్రం సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తుంది. ఇంతకీ ఆ అమ్మాయి ఎవరు అనుకుంటున్నారా ?.. తన పేరు అనీషా డామా.

గీతా గోవిందం సినిమా కాకుండా పలు చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా కనిపించింది అనీషా. ఆ తర్వాత సమంత నటించిన ఓ బేబీ సినిమాలో రావు రమేశ్ కూతురిగా కనిపించింది. ఇవేకాకుండా పెళ్లి కూతురు పార్టీ సినిమాలో కనిపించింది. అయితే అనీషా నటించిన చిత్రాలేవి ఆమెకు అంతగా గుర్తింపు తీసుకురాలేదు. కేవలం గీతా గోవిందం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యింది.

కొన్నిరోజుల క్రితం ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అయిన సత్తిగాని రెండెకరాలు సినిమాలో కథానాయికగా నటించింది. ఇందులో పుష్ప ఫేమ్ నటుడు కేశవ హీరోగా నటించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటున్న ఈ బ్యూటీ.. నిత్యం లేటేస్ట్ ఫోటోస్ షేర్ చేస్తూ సందడి చేస్తుంది. గ్లామరస్ ఫోటోలతో మెస్మరైజ్ చేస్తుంది.

View this post on Instagram

A post shared by Aneesha Dama (@aneeshadama)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.