ఒకప్పుడు బ్యాట్మెంటన్ స్టార్.. సినిమాల కోసం ఆ కెరీర్ వదిలేసింది.. ఇప్పుడు ఇండస్ట్రీలో తోపు హీరోయిన్

సినిమా ఇండస్ట్రీలో చాలా మంది హీరోయిన్స్ గా అవకాశాలు రాక ముందు పలు రంగాల్లో తమ ప్రతిభను చాటుకున్నారు. లాయర్లు, డాక్టర్లు, బిజినస్ మేన్స్ ఇలా చాలా మంది ఇప్పుడు హీరోయిన్స్ గా సత్తా చాటుతున్నారు. కాగా ఈ ఫొటోలో కనిపిస్తున్న హీరోయిన్ ఒకప్పుడు బ్యాట్మెంటన్ స్టార్.. ఇప్పుడు ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్

ఒకప్పుడు బ్యాట్మెంటన్ స్టార్.. సినిమాల కోసం ఆ కెరీర్ వదిలేసింది.. ఇప్పుడు ఇండస్ట్రీలో తోపు హీరోయిన్
Actress

Updated on: Apr 11, 2025 | 2:53 PM

సినిమా ఇండస్ట్రీలో చాలా మంది హీరోయిన్స్ తమ ప్రతిభను ఇతర రంగాలల్లోనూ చాటుకున్నారు. హీరోయిన్స్ గా అడుగు పెట్టక ముందు చాలా మంది బిజినెస్, స్పోర్ట్స్ , డాక్టర్స్, లాయర్లు ఇలా పలు వృత్తుల్లో రాణించారు. కొంతమంది హీరోయిన్స్ ఇప్పటికీ హీరోయిన్స్ గా చేస్తూనే లాయర్లు గా డాక్టర్లుగా పని చేస్తున్నారు. కాగా పైన కనిపిస్తున్న నటి ఒకప్పుడు బ్యాడ్మింటన్‌ స్టార్. ఆతర్వాత మోడలింగ్ లోకి అడుగుపెట్టింది. ఇప్పుడు ఇండస్ట్రీలో తోపు హీరోయిన్. ఇంతకూ ఆమె ఎవరో గుర్తుపట్టారా.? రీసెంట్ గా ఆమె నటించిన సినిమా ఏకంగా వెయ్యికోట్లకు పైగా వసూల్ చేసి నయా రికార్డ్ క్రియేట్ చేసింది. ఇంతకూ ఆమె ఎవరో గుర్తుపట్టారా.? అందం అభినయంతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది ఆ బ్యూటీ.. ఇంతకూ ఆ బ్యూటీ ఎవరంటే..

బాలీవుడ్ ముద్దుగుమ్మలు ఎంతో మంది ఇప్పుడు మన టాలీవుడ్ లోనూ సినిమాలు చేస్తూ రాణిస్తున్నారు వారిలో హాట్ బ్యూటీ.. దీపికా పదుకొణె ఒకరు. ఈ అమ్మడు 5, 1986న డెన్మార్క్‌లోని కోపెన్‌హాగన్‌లో జన్మించింది. ఆమె తండ్రి ప్రకాశ్ పదుకొణె ప్రఖ్యాత బ్యాడ్మింటన్ క్రీడాకారుడు. బెంగళూరులో పెరిగిన దీపికా, చిన్నతనంలో బ్యాడ్మింటన్‌లో జాతీయ స్థాయి ఛాంపియన్‌షిప్‌లలో పాల్గొంది, కానీ తర్వాత మోడలింగ్ వైపు మళ్లింది. ఇక సినిమాల పై ఆసక్తితో హీరోయిన్ గా ప్రయత్నించింది.

ఇవి కూడా చదవండి

2006లో కన్నడ చిత్రం “ఐశ్వర్య”తో సినిమా రంగంలోకి అడుగుపెట్టింది దీపికా. 2007లో “ఓం శాంతి ఓం” చిత్రంతో బాలీవుడ్‌లో అరంగేట్రం చేసి, షారుఖ్ ఖాన్ సరసన నటించి భారీ విజయం సాధించింది. ఆ తర్వాత “లవ్ ఆజ్ కల్”, “బచ్నా ఏ హసీనో”, “పద్మావత్”, “బాజీరావ్ మస్తానీ”, “పికు”, “కల్కి 2898 ఏడీ” వంటి హిట్ చిత్రాల్లో నటించింది. దీపికా నటనకు మూడు ఫిల్మ్‌ఫేర్ అవార్డులు లభించాయి. ప్రభాస్ నటించిన కల్కి సినిమాతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టింది. త్వరలోనే కల్కి 2లో నటించనుంది ఈ చిన్నది. హాలీవుడ్‌లో కూడా “ట్రిప్లెక్స్: ది రిటర్న్ ఆఫ్ జాండర్ కేజ్” చిత్రంతో పాదం మోపింది. 2023లో ఆస్కార్ అవార్డుల ప్రజెంటర్‌గా వ్యవహరించింది. ఇక దీపికా వ్యక్తిగత జీవితం విషయానికొస్తే.. దీపికా 2018లో నటుడు రణ్‌వీర్ సింగ్‌ను వివాహం చేసుకుంది. వారికి 2024లో ఒక కుమార్తె జన్మించింది, ఆమె పేరు దువా పదుకొణె సింగ్.  ప్రస్తుతం సినిమాలకు గ్యాప్ ఇచ్చి ఫ్యామిలీతో టైం స్పెండ్ చేస్తుంది ఈ భామ.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.