
సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్ మలుపు తిప్పిన సినిమాల్లో పోకిరి ఒకటి. డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా మహేష్ కెరీర్ లోనే వన్ ఆఫ్ ది బెస్ట్ ఫిలింగా నిలిచింది. 2006 వేసవికాలంలో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ షేక్ చేసింది. అప్పటివరకు రోటిన్ కథలతో సతమతమవుతున్న మహేష్ కు భారీ విజయాన్ని అందించింది. అప్పట్లో ఈ మూవీ ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఇలియానా, ప్రకాష్ రాజ్, నాజర్, అజయ్, బ్రహ్మానందం కీలకపాత్రలలో నటించిన ఈ చిత్రాన్ని ఊహించని రెస్పాన్స్ వచ్చింది. ఇప్పటికీ ఈ సినిమాకు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. అయితే ఈ సినిమాతో హీరోయిన్ కంటే ఎక్కువగా ఫేమస్ అయిన ఓ అమ్మాయి గుర్తుందా..? ఈ చిత్రంలో విలన్ పాత్రలో నటించిన ప్రకాష్ రాజ్ వెంటే ఉండే లేడీ విలన్.. వీరిద్దరు కాంబోలో వచ్చే ‘గిల్లితే గిల్లించుకోవాలి ‘ అనే డైలాగ్ ఎంతగా వైరల్ అయ్యిందో చెప్పక్కర్లేదు.
ఇవి కూడా చదవండి : Actress : ఒకప్పుడు తోపు హీరోయిన్.. ఇప్పుడు 5 కంపెనీలకు యజమాని.. రూ.2000 కోట్ల ఆస్తులు.. ఎవరంటే..
విలన్ గ్యాంగ్ లో మెంబర్ గా కనిపించిన ఆ అమ్మాయి పేరు షీవా రానా. అసలు పేరు జ్యోతిరానా. ముంబైకి చెందిన ఈ ముద్దుగుమ్మ.. పోకిరి చిత్రంలో మోనా పాత్రలో నటించింది.ఈ సినిమాలో కనిపించింది కాసేపు అయినా ఎక్కువగానే పాపులర్ అయ్యింది. తన లుక్స్, యాటిట్యూడ్ తో కట్టిపడేసింది. జ్యోతి రానా నటిగానే కాదు.. సర్టిఫైడ్ యోగా ఇన్ స్ట్రక్టర్ కూడా.మోడల్ గా కెరీర్ స్టార్ట్ చేసిన జ్యోతి.. ఆ తర్వాత తెలుగు, హిందీ భాషలలో వరుస ఆఫర్స్ అందుకుంది. ఎన్నో సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు పోషించింది.
ఇవి కూడా చదవండి : Cinema : 26 రోజుల్లోనే 280 కోట్ల కలెక్షన్స్.. రికార్డ్ సృష్టించిన తొలి యానిమేటెడ్ సినిమా ఇది..
పోకిరి సినిమాతో ఒక్కసారిగా ఫేమస్ అయిన జ్యోతి.. ఆ తర్వాత చాలా కాలానికి ఆకాష్ పూరి నటించిన మోహబూబా సినిమాలో నటించింది. ప్రస్తుతం హిందీలోనే ఎక్కువగా సినిమాలు చేస్తుంది. అలాగే సరైన బ్రేక్ కోసం వెయిట్ చేస్తుంది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ నిత్యం క్రేజ్ ఫోటోస్ షేర్ చేస్తుంది. పోకిరి సినిమా విడుదలై 20 ఏళ్లు కావొస్తున్నా.. జ్యోతి క్రేజ్ మాత్రం తగ్గడం లేదు.
ఇవి కూడా చదవండి : Cinema : రెండు గంటల సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ మూవీ.. దెబ్బకు దద్దరిల్లిన బాక్సాఫీస్.. ఎక్కడ చూడొచ్చంటే..
Cinema: రూ.70 లక్షల బడ్జెట్.. 70 కోట్ల కలెక్షన్స్.. 460 రోజులు థియేటర్లలో రచ్చ చేసిన సినిమా..