Tollywood : ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టగలరా ?.. పవన్ సరసన చిందేసిన గ్లామరస్ బ్యూటీ..
తెలుగు, తమిళం, కన్నడ, మలయాళీ భాషల్లో పలు సినిమాల్లో కనిపించిన ఈ తార చాలాకాలంగా ఇండస్ట్రీకి దూరంగా ఉంటుంది. సినిమాలకు దూరంగా ఉన్నా.. సోషల్ మీడియాలో మాత్రం సందడి చేస్తుంటుంది. ఎప్పటికప్పుడు ఇంట్రెస్టింగ్ విషయాలను చెబుతూ.. ఫ్యామిలీ విషయాలను పంచుకుంటుంది. తాజాగా ఈ హీరోయిన్ లేటేస్ట్ ఫోటోస్, వీడియోస్ నెట్టింట తెగ వైరలవుతున్నాయి. ఒకప్పుడు గ్లామర్ క్వీన్ గా అలరించిన ఈ బ్యూటీ.. ఇప్పుడు పూర్తిగా హిజాబ్ ధరించి కనిపిస్తుంది.
![Tollywood : ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టగలరా ?.. పవన్ సరసన చిందేసిన గ్లామరస్ బ్యూటీ..](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/03/actress-9.jpg?w=1280)
తెలుగు సినీ పరిశ్రమలో స్పెషల్ సాంగ్స్‌కు ఈ బ్యూటీ కేరాఫ్ అడ్రస్. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఈ హీరోయిన్ నటించింది తక్కువ సినిమాలే అయినా ఎంతో మంది అభిమానలను సంపాదించుకుంది. అందం, అభినయం, గ్లామర్ క్వీన్‌గా అలరించినా… ఈ భామకు మాత్రం ఆశించిన స్థాయిలో అవకాశాలు రాలేదు. పలు చిత్రాల్లో సెకండ్ హీరోయిన్ గా.. స్పెషల్ సాంగ్స్ చేసింది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళీ భాషల్లో పలు సినిమాల్లో కనిపించిన ఈ తార చాలాకాలంగా ఇండస్ట్రీకి దూరంగా ఉంటుంది. సినిమాలకు దూరంగా ఉన్నా.. సోషల్ మీడియాలో మాత్రం సందడి చేస్తుంటుంది. ఎప్పటికప్పుడు ఇంట్రెస్టింగ్ విషయాలను చెబుతూ.. ఫ్యామిలీ విషయాలను పంచుకుంటుంది. తాజాగా ఈ హీరోయిన్ లేటేస్ట్ ఫోటోస్, వీడియోస్ నెట్టింట తెగ వైరలవుతున్నాయి. ఒకప్పుడు గ్లామర్ క్వీన్ గా అలరించిన ఈ బ్యూటీ.. ఇప్పుడు పూర్తిగా హిజాబ్ ధరించి కనిపిస్తుంది. ఇక ఇందుకు గల కారణాలను తాజాగా ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టింది. ఇంతకీ ఆమె ఎవరో గుర్తుపట్టారా ?.. తనే ముంతాజ్. ఈ పేరుతో గుర్తుపట్టడం కష్టమే. కానీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన ఓ సూపర్ హిట్ సినిమాలో స్టెప్పులేసింది.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. భూమిక కాంబోలో వచ్చిన ఖుషీ సినిమా భారీ విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. ఈ మూవీలో “గజ్జె ఘల్లుమన్నాదిరో గుండె ఝల్లుమన్నాదిరో… వాన ఝల్లుమన్నాదిరో ఊరు ఘొల్లుమన్నాదిరో.. ” అంటూ వచ్చే స్పెషల్ సాంగ్‌లో పవన్ తో కలిసి స్టెప్పులేసింది. ఈ సినిమాతోనే తెలుగు తెరకు పరిచయమైంది ముంతాజ్. ఆ తర్వాత చాలా బాగుంది, లూటీ, చాక్లెట్, జెమిని, ధీరుడు, ఆగడు వంటి చిత్రాల్లో కీలకపాత్రలలో కనిపించి మెప్పించింది. ఇక చాలా కాలం పాటు సినిమాలకు దూరంగా ఉన్న ఈ బ్యూటీ.. పవన్ నటించిచన అత్తారింటికి దారేది సినిమాలో ఇట్స్ టైమ్ టూ పార్టీ పాటలో కనిపించింది.
ఇక కొన్నాళ్లు సినిమాలకు దూరమైన ఈ హీరోయిన్.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఆకస్మాత్తుగా సినిమాలకు గుడ్ బై చెప్పడంపై స్పందించింది ముంతాజ్. “నేను ముస్లిం కుటుంబంలో పుట్టాను. నాకు ఖురాన్ బాగా తెలుసు. మొదట్లో ఖురాన్‌లో పేర్కొన్న విషయాలకు అర్థం తెలియదు . ఒకానొక దశలో దాని అంతరార్థం నాకు అర్థమై నాలో మార్పు వచ్చింది. అందుకే ఇకపై సినిమా చేయకూడదని నిర్ణయించుకున్నాను. అలాగే ఇప్పుడు హిజాబ్ ధరిస్తున్నాను” అంటూ చెప్పుకొచ్చింది.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.