సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన అందమైన ప్రేమ కథ ఆర్య. అల్లు అర్జున్ హీరోగా నటించిన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. అప్పటికి వరకు వచ్చిన ప్రేమకథలకు బిన్నంగా తెరకెక్కిన ఆర్య సినిమా ఆ మంచి విజయాన్ని అందుకుంది.అంతే కాదు అల్లు అర్జున్ కు స్టార్ డమ్ తీసుకొచ్చింది ఈ సినిమా. ఇక ఈ సినిమాలోని పాటలు ఇప్పటికి మారుమ్రోగుతూనే ఉన్నాయి. అంత అద్భుతమైన సంగీతాన్ని అందించారు దేవీ శ్రీ ప్రసాద్. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన బ్యూటీ గుర్తుందా.. మొదటి లుక్ లోనే మనసు దోచేసిన ఈ భామ పేరు అను మెహతా. చూడముచ్చటైన రూపం.. చక్కటి అభినయం కనబరిచిన ఏ చిన్నది ప్రేక్షకుల మనసు దోచేసింది. అయితే అను చేసింది తక్కువ సినిమాలే అయినా ప్రేక్షకుల మనసులో తనదైన ముద్ర వేసింది. అయితే ఈ భామ కొన్ని సినిమాల తర్వాత ఇండస్ట్రీకి దూరం అయ్యింది.
అను మెహతా అసలు ఇప్పుడు ఎక్కడ ఉంది. ఏం చేస్తుంది..? ఎలా ఉంది అని ప్రేక్షకులను అభిమానులు ఆలోచిస్తున్నారు. అను తెలుగులో ఆర్య, నువ్వంటే నాకిష్టం, వేడుక, మహారాజశ్రీ అనే సినిమాలు చేసింది. అయితే వీటిలో ఆర్య సినిమా తప్ప మరో సినిమా వచ్చినట్టు కూడా ఎవ్వరికి తెలియదు. చివరిగా 2008లో కన్నడలో హొంగనసు అనే సినిమా చేసింది.
ఆ తర్వాత ఈ అమ్మడు సినిమాల్లో కనిపించలేదు. అయితే తాజాగా ఈ అమ్మడికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఈ ఫోటోలు చూసిన వారంతా షాక్ అవుతున్నారు. ఆర్య సినిమాలో గీత పాత్రలో కనిపించిన ఆ చిన్నదేనా ఈ ఫొటోల్లో ఉన్నది అంటూ ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు. అయితే మొన్నామధ్య ఈ అమ్మడు సాగరతీరాంలో అందాలు ఆరబోస్తూ ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. తాజాగా ఏవ్ ఫోటోలు ఇప్పుడు మరోసారి నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. ఈ ఫోటోలు చూసిన నెటిజన్లు అను మెహతా ఇలా మారిపోయిందేంటి అంటూ ముక్కున వేలేసుకుంటున్నారు.
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.