
చాలా మంది హీరోయిన్స్ కెరీర్ బిగినింగ్ లోకి ఇప్పటికీ చాలా మారిపోయి షాక్ ఇస్తున్నారు. కొంతమంది ప్లాస్టిక్ సర్జరీ చేయించుకొని అందంగా మారిపోయారు. హీరోయిన్స్ సినిమా సినిమాకు చాలా అందంగా మారిపోతూ అభిమానులను ఆకట్టుకుంటున్నారు. పైనున్న హీరోయిన్ ను గుర్తుపట్టారా..? చేసింది తక్కువ సినిమాలే అయినా మంచి క్రేజ్ సొంతం చేసుకుంది. తన అందంతో ప్రేక్షకులను ఫిదా చేసింది. ఇంతకు ఎవరో గుర్తుపట్టారా.? చూడగానే వారెవ్వా అనిపించేలా కవ్విస్తుంది ఆమె. ఇంతకు ఆమె ఎవరో కనిపెట్టండి చూద్దాం.! తెలుగులో మంచి సినిమాలు చేసింది. తెలుగుతో పాటు తమిళ్ లోనూ సినిమాలు చేసి ఆకట్టుకుంది. తాజాగా హిందీలోనూ చేసి మంచి విజయాన్ని అందుకుంది. ఇంతకూ ఆమె ఎవరో కనిపెట్టరా..
హీరోయిన్స్ గా ఇండస్ట్రీలో రాణించడం అనేది చాల కష్టం.. కానీ ఈ హీరోయిన్ మాత్రం మంచి అవకాశాలు అందుకుంటూ ప్రేక్షకులను మెప్పిస్తుంది. ఇంతకు ఆ అమ్మడు ఎవరో తెలుసా.? ఆమె మరెవరో కాదు అందాల భామ అదితి రావు హైదరి. తెలుగులో సమ్మోహనం సినిమాతో మంచి హిట్ అందుకుంది. ఈ సినిమాతోనే తెలుగులోకి అడుగు పెట్టింది ఈ చిన్నది. తొలి సినిమాలోనే తన అందం, నటనతో ప్రేక్షకులను మెప్పించింది అదితి.2006లో మమ్ముట్టి సరసన, మలయాళ చిత్రం ప్రజాపతితో తెరంగేట్రం చేసింది. ఆతర్వాత 2012లో, అదితి రావ్ హైదరి, బాలీవుడ్ చిత్రం యే సాలి జిందగీలో నటించింది.
రాక్ స్టార్ (2011), మర్డర్ 3 (2013), ఖూబ్ సూరత్ (2014), వాజిర్ (2016), ఫితూర్ (2016) సినిమాలతో వరుసగా బాలీవుడ్ లో విజయాలను అందుకుంది అదితి రావు హైదరి. ఈ అమ్మడు కెరీర్ బిగినింగ్ లో గుర్తుపట్టలేనంతగా ఉంది. అప్పుడు ఏవరేజ్ గా ఉన్న ఈ చిన్నది.. ఇప్పుడు అప్సరసలా మారిపోయింది. తెలుగులో సమ్మోహనం, మహా సముద్రం, అంతరిక్షంలాంటి సినిమాలో నటించింది. అయితే అదితి అప్పటికి ఇప్పటికీ చాలా మారిపోయింది. అయితే అందం కోసం ఆమె సర్జారీ చేయించుకుందని టాక్ కూడా వినిపించింది. కానీ ఇప్పుడు ఆమె చాలా అందంగా మారిపోయింది.
ఇక ఈ అమ్మడు సత్యదీప్ మిశ్రా అనే వ్యక్తిని పెళ్లి చేసుకుందని. 2009లో ఈ ఇద్దరికీ వివాహం జరిగింది. కానీ ఆతర్వాత ఈ ఇద్దరూ విడిపోయారు. ప్రస్తుతం హీరో సిద్దార్థ్ లో అదితి ప్రేమలో ఉంది. ఇటీవలే వీరి పెళ్లి జరిగింది. చాలా రహస్యంగా పెళ్లి చేసుకున్నారు. 2024 మార్చి 27న వనపర్తి జిల్లా శ్రీరంగాపూర్‌లోని రంగనాథస్వామి ఆలయంలో వివాహం చేసుకున్నారు. ఇక అదితి రావు హైదరి సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. రెగ్యులర్ గా ఫోటోలు షేర్ చేస్తూ ప్రేక్షకులను మెప్పిస్తుంది. చీరకట్టులో ఈ అమ్మడి ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.