Childhood Photos: ఈ ఫొటోలో ఉన్న చిన్నారిని గుర్తుపట్టారా..? పవర్ స్టార్, సూపర్ స్టార్ లతో నటించింది ఈ బ్యూటీ.

తమ అభిమాన హీరోయిన్స్ కు సంబంధించిన ప్రతి విషయాలను చాలా భద్రంగా చూసుకుంటూ ఉంటారు. ఇక ఆ హీరోయిన్ చిన్ననాటి ఫోటోల నుంచి లేటెస్ట్ ఫొటోస్ వరకు భద్రంగా దాచుకుంటూ ఉంటారు.

Childhood Photos: ఈ ఫొటోలో ఉన్న చిన్నారిని గుర్తుపట్టారా..? పవర్ స్టార్, సూపర్ స్టార్ లతో నటించింది  ఈ బ్యూటీ.
Childhood Pic

Updated on: Dec 12, 2022 | 9:16 AM

స్టార్ హీరోయిన్స్ కు సంబంధించిన ఫోటోలను పదిలంగా దాచుకోవడం. లేదా సోషల్ మీడియాలో షేర్ చేస్తూ హల్ చల్ చేస్తూ ఉంటారు కొందరు కుర్రకారు. తమ అభిమాన హీరోయిన్స్ కు సంబంధించిన ప్రతి విషయాలను చాలా భద్రంగా చూసుకుంటూ ఉంటారు. ఇక ఆ హీరోయిన్ చిన్ననాటి ఫోటోల నుంచి లేటెస్ట్ ఫొటోస్ వరకు భద్రంగా దాచుకుంటూ ఉంటారు. తాజాగా అలా ఓ క్రేజీ హీరోయిన్ చిన్ననాటి ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. పై ఫొటోలో అమాయకంగా తమ్ముడితో కలిసి ఫొటోకు ఫోజ్ ఇచ్చిన బ్యూటీ ఎవరో గుర్తు పట్టరా.. ? ఈ అమ్మడు తెలుగులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సూపర్ స్టార్ మహేష్ బాబులతో కలిసి నటించింది.

పై ఫొటోలో ఉన్న చిన్నారి ఎవరో కాదు. అందాల భామ అమీషా పటేల్. బాలీవుడ్ లో ఈ ముద్దుగుమ్మ చాలా పాపులర్. తెలుగులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన బద్రి సినిమాతో పరిచయం అయ్యింది. ఈ సినిమాలో పవర్ స్టార్ కు జోడీగా నటించింది ఈ భామ. అలాగే సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన నాని సినిమాలో నటించింది అమీషా.

ఇవి కూడా చదవండి

ఇక ఇప్పుడు ఈ బ్యూటీ బాలీవుడ్ లో అడపాదడపా సినిమాలు చేస్తుంది. సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్ గా ఉంటుంది ఈ బ్యూటీ లేటు వయసులోనూ ఘాటు అందాలతో నెట్టింట సెగలు పుట్టిస్తుంది. హాట్ హాట్ ఫోటోలకు అమీషా కేరాఫ్ అడ్రస్ గా మారింది.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..