
కింగ్ నాగార్జున నటించిన హిట్ సినిమాల్లో సంతోషం సినిమా ఒకటి. ఇప్పటికీ ఫ్యామిలీ అడియన్స్ ఫేవరేట్ చిత్రాల్లో ముందుంటుంది ఈ సినిమా. అందమైన ప్రేమకథతో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర ఘన విజయం సాధించింది. డైరెక్టర్ దశరథ్ దర్శకత్వం వహించిన ఈ మూవీకి అప్పట్లో మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక ఈ సినిమాకు ఆర్పీ. పట్నాయక్ అందించిన మ్యూజిక్ గురించి చెప్పక్కర్లేదు. అద్భుతమైన సంగీతంతో ఈ చిత్రాన్ని అప్పట్లోనే మ్యూజికల్ బ్లాక్ బస్టర్ హిట్ గా చేశారు. ఈ సినిమాలోని సాంగ్స్ ఇప్పటికీ వినిపిస్తూనే ఉన్నాయి. ఫ్యామిలీ ఎంటర్టైనర్‌గా వచ్చిన ఈ చిత్రానికి ఇప్పటికీ సెపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇక ఇందులో నాగార్జున సరసన శ్రియ, గ్రేసీ సింగ్ హీరోయిన్లుగా నటించగా.. పృథ్వీరాజ్, ప్రభుదేవా కీలకపాత్రలు పోషించారు.
ఈ సినిమాలో నటించిన ప్రతి ఒక్కరికి ఆ తర్వాత తెలుగులో ఆఫర్స్ వచ్చాయి. అలాగే ఈ మూవీల హోమ్లీగా.. అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకులను కట్టిపడేసింది గ్రేసీ సింగ్. ఈ చిత్రంతో తెలుగులో మంచి క్రేజ్ సొంతం చేసుకున్న ఈ బ్యూటీకి ఆ తర్వాత మాత్రం అనుకున్నంతగా అవకాశాలు రాలేదు. సంతోషం సినిమా తర్వాత తప్పు చేసి పప్పుకూడు సినిమాలో నటించింది. ఆ తర్వాత రామ రామ కృష్ణ కృష్ణ సినిమాలో కనిపించింది. ఆ తర్వాత మరో తెలుగు సినిమా చేయలేదు.
కానీ ఎక్కువగా హిందీ చిత్రాల్లో నటించింది. అమీర్ ఖాన్ నటించిన బ్లాక్ బస్టర్ హిట్ మూవీ లగాన్ చిత్రంలో నటించింది. అలాగే మున్నాభాయ్ ఎంబీబీఎస్ మూవీలోనూ మెరిసింది. నటిగానే కాకుండా ఆమె భరతనాట్యం, ఒడిస్సీ నృత్యకారిణి. కొన్నాళ్లుగా సినిమాలకు దూరంగా ఉంటున్న గ్రేసీ సింగ్ ఇప్పుడు బుల్లితెరపై సందడి చేస్తుంది. అలాగే సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది. తాజాగా గ్రేసీ సింగ్ ఫ్యామిలీ ఫోటోస్ నెట్టింట వైరలవుతున్నాయి.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి