
యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన బ్లాక్ బస్టర్ మూవీస్ లో సింహాద్రి ఒకటి. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ చిత్రంలో ఎన్టీఆర్ సరసన అంకిత, భూమిక హీరోయిన్లుగా నటించారు. బాక్సాఫీస్ వద్ద రికార్డు కలెక్షన్లు రాబట్టిన ఈ సినిమాలో ఎన్టీఆర్ నట విశ్వరూపం చూపించారు. అలాగే ఇద్దరు హీరోయిన్లు కూడా తమ అందచందాలతో ఆకట్టుకున్నారు. ముఖ్యంగా అంకిత తన అందమైన కళ్లతో అందరి దృష్టిని ఆకర్షించింది. ఎన్టీఆర్ ను ఆట పట్టించే సీన్స్ లో అంకిత అభినయం హైలెట్ గా నిలిచింది. అలాగే ‘చీమ చీమ చీమ చీమ’ అంటూ సాగే సాంగ్‌లో ఎన్టీఆర్‌కు పోటీగా డ్యాన్స్ చేసింది. సినిమా కూడా సూపర్ హిట్ కావడంతో ఈ అమ్మడి క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. లాహిరి లాహిరి లాహిరి, ధనలక్ష్మీ ఐ లవ్ యూ, రారాజు, మనసు మాట వినదు, విజయేంద్రవర్మ, ప్రేమలో పావని కళ్యాణ్ తదితర చిత్రాల్లో హీరోయిన్ గా నటించంది. తెలుగుతో పాటు తమిళం, కన్నడం సినిమాల్లోనూ నటించి మెప్పించిందీ అందాల తార. ఎక్కువగా గ్లామరస్ పాత్రలకే పరిమితమైన ఈ ముద్దుగుమ్మ స్టార్ హీరోయిన్ గా క్రేజ్ తెచ్చుకోలేకపోయింది.
2009 వరకు వరుస సినిమాలు చేసిన అంకిత ఆ తర్వాత అవకాశాలు తగ్గడంతో ఇండస్ట్రీకి దూరమైంది. ఆమె చివరిసారిగా పోలీస్ అధికారి చిత్రంలో నటించింది. సినిమాల సంగతి పక్కన పెడితే 2016లో విశాల్ జగతాప్ అనే వ్యక్తిని పెళ్లాడింది అంకిత. ప్రస్తుతం వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు.
ప్రస్తుతం అమెరికాలోని న్యూ జెర్సీలో స్థిరపడింది అంకిత. అక్కడే దాదాపు అర ఎకరం స్థలంలో నిర్మించుకున్న అందమైన ఇంట్లో నివసిస్తోంది. అంకిత భర్త విశాల్ అమెరికాలోని సిటీ బ్యాంక్ లో పని చేస్తున్నారు. సినిమాలకు దూరంగా ఉన్న అంకిత అప్పుడప్పుడు సోషల్ మీడియాలో కనిపిస్తుంటుంది. అలా తాజాగా ఆమెకు సంబంధించిన కొన్ని ఫొటోలు నెట్టింట వైరలవుతున్నాయి. సినిమాల్లో నటించేటప్పుడు చాలా ముద్దుగా, స్లిమ్ గా కనిపించిన అంకిత ఇప్పుడు కొంచెం బొద్దుగా కనిపిస్తోంది. అయినా ఆ అందం ఏ మాత్రం తగ్గలేదంటున్నారు నెటిజన్లు.
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..