తెలుగు సినీ పరిశ్రమలో ఎన్నో ప్రేమకథ చిత్రాలు వెండితెరపై సంచలనం సృష్టించాయి. అందులో ప్రేమ ఖైదీ ఒకటి. అప్పట్లో ఈ మూవీ సెన్సెషన్ అయ్యింది. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన భారీ విజయాన్ని అందుకుంది. ఈ మూవీతో తెలుగు తెర పై సెన్సెషన్ క్రియేట్ చేశాడు హీరో హరీష్ కుమార్. ఈ చిత్రంలో హీరోగా నటించిన హరీష్ కు ఆ తర్వాత తెలుగులో వరుస ఆఫర్స్ క్యూ కట్టాయి. ప్రేమ కానుకగా.. ప్రేమాభిషేకం వంటి చిత్రాలతో టాలీవుడ్ ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యాడు. ఇవే కాకుండా పెళ్లాం చెబితే వినాలి.. రౌడీ ఇన్స్పెక్టర్.. కాలేజీ బుల్లోడు.. ప్రేమ విజేతా.. ప్రాణదాత, మనవరాలి పెళ్లి , బంగారు కుటంబం వంటి చిత్రాలతో అప్పట్లోనే స్టార్ డమ్ సొంతం చేసుకున్నాడు. హరీష్ హీరోగానే కాకుండా చైల్డ్ ఆర్టిస్టుగా పలు సినిమాల్లో నటించాడు. ఆంధ్రకేసరి, నటుడిగా ఒహో నా పెళ్లంట సినిమాలకు బాలనటుడిగా నంది అవార్డులు అందుకున్నారు.
తెలుగుతోపాటు తమిళం, మలయాళం, హిందీలో సూపర్ హిట్స్ అందుకున్నారు. ఈహీరోకు దక్షిణాదితోపాటు ఉత్తరాదిలోనూ ఎంతో మంది అభిమానులు ఉన్నారు. భారతీయ సినిమా ప్రపంచంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హరీష్ కు అప్పట్లో అమ్మాయిల ఫాలోయింగ్ కూడా ఎక్కువగానే ఉండేది. వరుసగా హిట్ చిత్రాల్లో వెండితెరపై సందడి చేసిన ఈ హీరోకు మెల్లగా అవకాశాలు దూరమయ్యాయి. దీంతో కొన్ని సినిమాల్లో సహాయ పాత్రలలో కనిపించారు. ఆ తర్వాత పూర్తిగా ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నారు.
హరీష్ కుమార్ పక్కా హైదరాబాద్ అబ్బాయి. బాల నటుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి 1979లో ముద్దుల కొడుకు సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయ్యాడు. ఆ తర్వాత ప్రేమ కానుక… ప్రేమాభిషేకం, కొండవీటి సింహం, త్రిశూలం వంటి చిత్రాలతో హిట్స్ అందుకున్నాడు. 13 ఏళ్ల వయసులోనే హీరోగా మారిన హరీష్ ఎక్కువగా ప్రేమకథ చిత్రాల్లోనే కనిపించారు. ప్రస్తుతం హరీష్ తన కుటుంబంతో కలిసి ముంబయిలోనే ఉంటున్నట్లు తెలుస్తోంది. 2021 డిసెంబర్ లో హైదరాబాద్ లో జరిగిన సంతోషం అవార్డ్స్ వేడుకలో కనిపించిన ఈ హీరో అటు సోషల్ మీడియాలోనూ అంతగా యాక్టివ్ గా లేరు.
ఇది చదవండి : Tollywood: అప్పుడు పద్దతిగా.. ఇప్పుడు మోడ్రన్‌గా.. చెప్పవే చిరుగాలి హీరోయిన్ను ఇప్పుడు చూస్తే షాకే..
Tollywood: ఫోక్ సాంగ్‌తో ఫేమస్ అయిన వయ్యారి.. హీరోయిన్గా అదరగొట్టేసింది..
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.