Prabhas: రీఎంట్రీ ఇస్తోన్న ప్రభాస్ ఫస్ట్ హీరోయిన్.. వయ్యారాలతో సెగలు పుట్టిస్తున్న ఈ భామను ఇప్పుడు చూశారా..?

|

Jul 26, 2024 | 11:57 AM

దర్శకుడు జయంత్ సి. పరాన్జీ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ప్రభాస్ సరసన నటించిన శ్రీదేవి విజయ్ కుమార్. ఈ సినిమాతోనే శ్రీదేవి విజయ్ కుమార్ తెలుగు తెరకు పరిచయమైంది. అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది. అప్పట్లో వీరిద్దరి జోడికి ప్రత్యేకంగా అభిమానులు ఉన్నారు.

Prabhas: రీఎంట్రీ ఇస్తోన్న ప్రభాస్ ఫస్ట్ హీరోయిన్.. వయ్యారాలతో సెగలు పుట్టిస్తున్న ఈ భామను ఇప్పుడు చూశారా..?
Sridevi
Follow us on

ప్రస్తుతం పాన్ ఇండియా బాక్సాఫీస్ కింగ్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్. డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వం వహించిన బాహుబలి సినిమాతో డార్లింగ్ క్రేజ్ ఒక్కసారిగా మారిపోయింది. బాహుబలి 1,2 చిత్రాలతో రికార్డ్స్ సృష్టించిన ప్రభాస్.. ఇప్పుడు మరోసారి కల్కి 2898 ఏడి సినిమాతో రికార్డ్స్ తిరగరాశాడు. జూన్ 27న విడుదలైన ఈ మూవీ ఇప్పటికే రూ.1000 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి సరికొత్త చరిత్ర సృష్టించింది. అయితే ఇప్పుడు చేతినిండా సినిమాలతో క్షణం తీరికలేకుండా దూసుకుపోతున్నాడు ప్రభాస్. కానీ డార్లింగ్ హీరోగా వెండితెరకు పరిచయమైన సినిమా గుర్తుందా.. ? సాధారణంగా ప్రభాస్ హీరోగా నటించిన చిత్రం వర్షం అనుకుంటారు. కానీ ఆ సినిమా హీరోగా భారీ విజయాన్ని అందుకున్న సినిమా మాత్రమే. ప్రభాస్ హీరోగా సినీరంగంలోకి అడుగుపెట్టింది ఈశ్వర్ మూవీతో. ఈ సినిమాలో ప్రభాస్ పక్కా మాస్ పాత్రలో కనిపించాడు.

దర్శకుడు జయంత్ సి. పరాన్జీ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ప్రభాస్ సరసన నటించిన శ్రీదేవి విజయ్ కుమార్. ఈ సినిమాతోనే శ్రీదేవి విజయ్ కుమార్ తెలుగు తెరకు పరిచయమైంది. అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది. అప్పట్లో వీరిద్దరి జోడికి ప్రత్యేకంగా అభిమానులు ఉన్నారు. శ్రీదేవి విజయ్ కుమార్.. ఒకప్పటి నటీనటులు మంజుల, విజయ్ కుమార్ దంపతుల కుమార్తె. 1992లో రిక్షా మామ సినిమాతో తమిళ్ సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించిన శ్రీదేవి.. 2002లో ఈశ్వర్ సినిమాతో కథానాయికగా పరిచయమైంది.

ఇవి కూడా చదవండి

ఈశ్వర్ తర్వాత తెలుగులో నిన్నే ఇష్టపడ్డాను, నిరీక్షణ, ఆదిలక్ష్మీ, పెళ్లికానీ ప్రసాద్ వంటి చిత్రాల్లో నటించి మెప్పించింది. కెరీర్ మంచి ఫాంలో ఉన్నప్పుడు రాహుల్ అనే వ్యాపారవేత్తను పెళ్లి చేసుకున్న శ్రీదేవి.. ఆ తర్వాత సినిమాలకు పూర్తిగా దూరమైంది. ఇప్పుడిప్పుడే సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ అయిన శ్రీదేవి.. ఇప్పుడు బుల్లితెరపై పలు రియాల్టీ షోలకు జడ్జీగా వ్యవహరిస్తుంది. అలాగే మంచి ఆఫర్స్ వస్తే సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చేందుకు కూడా రెడీ అంటోంది. తాజాగా ఈ బ్యూటీ షేర్ చేసిన ఫోటోస్ చూసి ఆశ్చర్యపోతున్నారు ఫ్యాన్స్. అప్పటికీ ఇప్పటికీ అసలు ఏమాత్రం తరగని అందంతో కట్టిపడేస్తుందని అంటున్నారు నెటిజన్స్.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.