Richa Pallod: నువ్వే కావాలి హీరోయిన్ ఏంటి ఇలా మారిపోయింది? అసలు గుర్తుపట్టలేరు.. లేటెస్ట్ ఫొటోస్ వైరల్
నువ్వే కావాలి సినిమా సక్సెస్ కు ప్రధాన కారణం తరుణ్- రిచా జోడీనే అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మొదట్లో అల్లరి స్నేహితులుగా, ఆ తర్వాత ప్రేమికులుగా ఆడియెన్స్ ను మెప్పించిందీ జోడీ. ఈ మూవీతో ఈ పెయిర్ ది బెస్ట్ జోడీగా పేరు తెచ్చుకుంది. ఈ ఇద్దరు కలిసి మళ్లీ చిరుజల్లు అనే చిత్రంలో నటించారు
టాలీవుడ్ హ్యాండ్సమ్ హీరో నటించిన సూపర్ హిట్ సినిమాల్లో నువ్వే కావాలి ఒకటి. 2000లో రిలీజైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. అప్పట్లో ఏకంగా 250 రోజులు ఆడిన సినిమాగా ఈ క్లాసిక్ లవ్ స్టోరీకి గుర్తింపు ఉంది. కె. విజయభాస్కర్ తెరకెక్కించిన ఈ మూవీలో తరుణ్ సరసన రిచా హీరోయిన్ గా నటించింది. ఉషా కిరణ్ మూవీస్ బ్యానర్‌పై దివంగత నిర్మాత రామోజీరావు, స్రవంతి రవికిషోర్ సంయుక్తంగా ఈ ప్రేమకథా చిత్రాన్ని నిర్మించారు. నువ్వే కావాలి సినిమా సక్సెస్ కు ప్రధాన కారణం తరుణ్- రిచా జోడీనే అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మొదట్లో అల్లరి స్నేహితులుగా, ఆ తర్వాత ప్రేమికులుగా ఆడియెన్స్ ను మెప్పించిందీ జోడీ. ఈ మూవీతో ఈ పెయిర్ ది బెస్ట్ జోడీగా పేరు తెచ్చుకుంది. ఈ ఇద్దరు కలిసి మళ్లీ చిరుజల్లు అనే చిత్రంలో నటించారు.. కానీ ఈ సినిమా పెద్దగా ఆకట్టుకోలేదు. ఇక రిచా విషయానికి వస్తే.. తెలుగులో తెలుగులో హోలీ, నా మనసిస్తారా, పెళ్లాం పిచ్చోడు, ఇంకోసారి వంటి చిత్రాల్లో నటించిది. తమిళం, హిందీ, కన్నడ భాషా సినిమాల్లోనూ నటించి అక్కడి ఆడియెన్స్ ను అలరించింది. అయితే 2016 తర్వాత వెండితెరకు పూర్తిగా దూరమైందీ అందాల తార.
కాగా రిచా పొలాడ్ 2011లో హిమాన్షు బజాజ్ ని పెళ్లి చేసుకుంది. వీరికి 2013లో ఒక కుమారుడు పుట్టాడు. దీంతో ఇక పిల్లాడి పెంపకానికే తన సమయాన్ని కేటాయించిందీ ముద్దుగుమ్మ. అయితే 2018లో ఖాన్ నెంబర్ 1 సినిమాలో కనిపించింది రిచా. ఆ తర్వాత 2020లో లాల్ ఇష్క్యూ అనే వెబ్ సిరీస్,యువర్ హానర్ వంటి సిరీసుల్లోనూ మెరిసింది.ఆ తర్వాత ఎక్కడా కనిపించలేదు.
రిచా డ్యాన్స్ వీడియో,..
View this post on Instagram
సినిమాలకు దూరంగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటుందీ అందాల తార. తన ఫ్యామిలీ ఫొటోలను అందులో షేర్ చేస్తూ ఉంటుంది రిచా. అప్పట్లో ఎంతో ముద్దు ముద్దుగా క్యూట్ గా కనిపించిన రిచా ఇప్పుడు పూర్తిగా మారిపోయింది. అయితే గ్లామర్ విషయంలో మాత్రం తగ్గడం లేదీ ముద్దుగుమ్మ. వీటిని చూసిన అభిమానులు, నెటిజన్లు మళ్లీ సినిమాల్లోకి ఎప్పుడు వస్తున్నారు మేడమ్? అని కామెంట్స్ చేస్తున్నారు.
మళ్లీ సినిమాల్లోకి వస్తుందా?
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.