Pilla Zamindar: నాని పిల్ల జమీందార్ మూవీ హీరోయిన్ గుర్తుందా..? ఆమె భర్త తెలుగులో పవర్ ఫుల్ హీరో..

సాధారణంగా సినీరంగంలో ఒక్క సినిమాతోనే పాపులర్ అయిన హీరోయిన్స్ చాలా మంది ఉన్నారు. కానీ కొందరు ముద్దుగుమ్మలు మాత్రం తక్కువ సమయంలోనే ఫేడవుట్ అయిపోయి ఇండస్ట్రీలోకి దూరమయ్యారు. అందులో ఈ హీరోయిన్ ఒకరు. తెలుగులో చేసింది తక్కువ సినిమాలే అయినప్పటికీ తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది ఈ వయ్యారి.

Pilla Zamindar: నాని పిల్ల జమీందార్ మూవీ హీరోయిన్ గుర్తుందా..? ఆమె భర్త తెలుగులో పవర్ ఫుల్ హీరో..
Pilla Zamindar

Updated on: Mar 28, 2025 | 3:21 PM

న్యాచురల్ స్టార్ నాని గురించి చెప్పక్కర్లేదు. ఎలాంటి బ్యాగ్రౌండ్ సపోర్ట్ లేకుండానే అసిస్టెంట్ డైరెక్టర్ గా సినీరంగంలోకి అడుగుపెట్టి ఇప్పుడు స్టార్ హీరోగా దూసుకుపోతున్నాడు. హిట్టు, ప్లాపులతో సంబంధం లేకుండా విభిన్నమైన సినిమాలు చేస్తూ తన గ్రాఫ్ పెంచుకుంటున్నాడు. ఇప్పటికే దసరా, హాయ్ నాన్న సినిమాలతో వరుస హిట్స్ అందుకున్న నాని.. ఇప్పుడు హిట్ 3 మూవీతో అడియన్స్ ముందుకు రాబోతున్నాడు. డైరెక్టర్ శైలేష్ కొలను దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో నాని పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నాడు. నాని నటించిన చిత్రాల్లో ఇప్పటికీ అడియన్స్ మదిలో నిలిచిన సినిమాల్లో పిల్ల జమీందార్ ఒకటి. 2011లో విడుదలైన ఈ మూవీ మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాలో కామెడీతోపాటు ఎమోషన్స్ సైతం ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

పిల్ల జమీందార్ సినిమాలో నాని సరసన బిందుమాధవి, హరిప్రియ హీరోయిన్లుగా నటించారు. ఆ సినిమా తర్వాత బిందుమాధవి పలు సినిమాల్లో నటించి తెలుగు ప్రేక్షకులను అలరించింది. కానీ హరిప్రియ అంతగా అడియన్స్ ముందుకు రాలేదు. తెలుగులో చేసింది తక్కువ సినిమాలే అయినప్పటికీ తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. తకిట తకిట, పిల్ల జమీందార్, అబ్బాయి క్లాస్ అమ్మాయి మాస్, గలాట, ఈ వర్షం సాక్షిగా, జైసింహా వంటి చిత్రాల్లో నటించి మెప్పించింది.

హరిప్రియ భారతనాట్య కళాకారిణి.. సినిమాల్లోకి రాకముందు అనేక ప్రదర్శనలు ఇచ్చింది. తెలుగుతోపాటు తమిళంలో పలు సినిమాల్లో నటించిన హరిప్రియ.. ఆ తర్వాత సినిమాలకు గుడ్ బై చెప్పేసింది. టాలీవుడ్ పవర్ ఫుల్ విలన్ వశిష్టను ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఆమె భర్త వశిష్ట తెలుగులో నారప్ప, నయీం డైరీస్, ఓదెల రైల్వే స్టేషన్ వంటి చిత్రాల్లో నటించి మెప్పించాడు. ప్రస్తుతం సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది హరిప్రియ.

ఇది చదవండి :  Tollywood: చేసిన ఒక్క సినిమా డిజాస్టర్.. కట్ చేస్తే.. అమ్మడు జోరు ఇప్పట్లో ఆగేలా లేదుగా..

Tollywood: గ్లామర్ షోతో మెంటలెక్కిస్తోన్న హీరోయిన్.. వరుస సినిమాలు చేస్తున్న రానీ క్రేజ్.. ఆఫర్స్ కోసం..

Ram Charan : రామ్ చరణ్ ఫేవరేట్ హీరోయిన్ ఎవరో తెలుసా.. ? పాన్ ఇండియా సెన్సేషన్.. కానీ ఇప్పుడు..

Actress Laya: హీరోయిన్ లయ కూతురిని చూశారా.. ? అప్పుడే సినిమాల్లోకి వచ్చేసిందిగా.. ఫోటోస్ చూస్తే..

Tollywood: తెలుగులో జోరు పెంచిన యంగ్ హీరోయిన్.. అమ్మడు ఇప్పట్లో ఆగేలే లేదుగా..