Khadgam Movie : చెక్కు చెదరని అందం.. 44 ఏళ్ల వయసులోనూ అందాల ఆరబోత.. ఖడ్గం మూవీ హీరోయిన్ ఇప్పుడేం చేస్తుందంటే..

ఒక్క సినిమాతోనే తెలుగు చిత్రపరిశ్రమలో ఫేమస్ అయిన స్టార్స్ చాలా మంది ఉన్నారు. అందం, అభినయంతో ఆకట్టుకుని.. ఆ తర్వాత వరుస ఆఫర్స్ అందుకుంటారని చాలా మంది అనుకున్నారు. కానీ అందుకు భిన్నంగా ఊహించని విధంగా ఇండస్ట్రీకి దూరమయ్యారు పలువురు ముద్దుగుమ్మలు. అలాంటి వారిలో కిమ్ శర్మ ఒకరు.

Khadgam Movie : చెక్కు చెదరని అందం.. 44 ఏళ్ల వయసులోనూ అందాల ఆరబోత.. ఖడ్గం మూవీ హీరోయిన్ ఇప్పుడేం చేస్తుందంటే..
Kim Sharma

Updated on: Mar 03, 2025 | 8:15 AM

ఖడ్గం.. తెలుగు ప్రేక్షకులకు ఎప్పటికీ గుర్తుండిపోయే సినిమా. స్వాతంత్ర్య దినోత్సవం… గణతంత్ర దినోత్సవం సందర్భంగా టీవీల్లో ఈ సినిమా ఖచ్చితంగా రావాల్సిందే. క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో హీరో శ్రీకాంత్, ప్రకాష్ రాజ్, రవితేజ, బ్రహ్మాజీ ప్రధాన పాత్రలు పోషించారు. అందులో సోనాలి బింద్రే, సంగీత హీరోయిన్లుగా కనిపించారు. వీరిద్దరితోపాటు ఖడ్గం సినిమాలో స్పెషల్ అట్రాక్షన్ అయ్యింది కిమ్ శర్మ. సోనాలి బింద్రే తర్వాత శ్రీకాంత్ సరసన నటించి మెప్పించింది. ముసుగు వెయ్యొద్దు మనసు మీద అంటూ వచ్చే పాటతో మరింత ఫేమస్ అయ్యింది ఈ అమ్మడు. ఈ చిత్రంతోనే తెలుగు అడియన్స్ హృదయాల్లో స్థానం సంపాదించుకుంది. అయితే ఖడ్గం సినిమాతో వచ్చిన క్రేజ్ తో కిమ్ శర్మకు మరిన్ని ఆఫర్స్ వస్తాయని అనుకున్నారు. కానీ అలా జరగలేదు. తెలుగులో ఈబ్యూటీకి ఊహించిన స్థాయిలో ఆఫర్స్ రాలేదు.

ఖడ్గం సినిమా తర్వాత తెలుగులో మరో సినిమా చేయలేదు. చాలా కాలం సినిమాలకు గ్యాప్ తీసుకున్న కిమ్ శర్మ.. రామ్ చరణ్ నటించిన మగధీర చిత్రంలో స్పెషల్ సాంగ్ చేసింది. బాలీవుడ్ ఇండస్ట్రీలో సెటిల్ అయిన ఈ ముద్దుగుమ్మ.. అక్కడే పలు స్పెషల్ సాంగ్స్ చేసింది. బాలీవుడ్ నటుడు హర్షవర్దన్ రానాతో కొన్నాళ్లు ప్రేమాయణం సాగించింది. అయితే వీరిద్దరి మధ్య బ్రేకప్ జరిగిందనే ప్రచారం నడిచింది.

ఇవి కూడా చదవండి

అటు పర్సనల్ విషయాలు నెట్టింట చక్కర్లు కొట్టిన కిమ్ శర్మ నేరుగా స్పందించలేదు. ప్రస్తుతం సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ నిత్యం ఫోటోస్ షేర్ చేస్తుంది. తాజాగా ఈ అమ్మడు లేటేస్ట్ ఫోటోస్ చూసి ఆశ్చర్యపోతున్నారు ఫ్యాన్స్. 44 ఏళ్ల వయసులోనూ ఏమాత్రం చెక్కు చెదరని అందంతో నెట్టింట రచ్చ చేస్తుంది.

ఇది చదవండి :  Tollywood: చిన్నప్పుడే అవార్డులు.. టాలీవుడ్ క్రేజీ హీరో.. ఇప్పుడు అవకాశాల కోసం..

Tollywood: అప్పుడు కలెక్టర్ దగ్గర ఉద్యోగం.. ఇప్పుడు స్టార్ కమెడియన్.. ఎవరో తెలుసా.. ?

Mahesh Babu: మహేష్ మేనకోడలు ఎంత అందంగా ఉందో చూశారా.. ? ఇక హీరోయిన్స్ సైడ్ అవ్వాల్సిందే..

ఒక్క సినిమా చేయలేదు.. హీరోయిన్లకు మించి క్రేజ్.. ఎవరంటే..