Harry Potter: ‘హ్యారీ పోటర్’ సినిమా హీరో గుర్తున్నాడా ?.. ఇప్పుడు చూస్తే అస్సలు గుర్తుపట్టలేరు..
2001లో హ్యారీ పాటర్ అండ్ ది ఫిలాసఫర్స్ స్టోన్ తో మొదలై.. హ్యారీ పోటర్ అండ్ ది డెత్లీ హాలోస్ పార్ట్ 2 (2011) తో ముగిసింది. ఇందులో డేనియల్ రాడ్ క్లిఫ్, రూపెర్ట్ గ్రింట్, ఎమ్మా వాట్సన్ ప్రధానపాత్రలు పోషించారు. 'హ్యారీ పోటర్' పేరు చెప్పగానే ఠక్కున గుర్తొచ్చే కుర్రాడి పేరు డేనియల్ రాడ్ క్లిఫ్. ఈ సినిమా ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది అభిమానుల హృదయాల్లో నిలిచిపోయాడు. హ్యారీ పోటర్' మొత్తం ఎనిమిది సిరీస్ లలో అతడే హీరో. నీలికళ్లతో..అమాయకత్వం.. అద్భుతమైన నటనతో వరల్డ్ వైడ్ గా భారీ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు.
‘హ్యారీ పోటర్’ ఈ సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. 90’s చిల్డ్రన్స్ ఫేవరేట్ చిత్రాల్లో ఇది ఒకటి. బ్రిటీష్ రచయిత జేకే రౌలింగ్ రాసిన నవలల ఆధారంగా ఈ సినిమాను రూపొందించారు. కేవలం ఒక సినిమాగా కాదు.. మొత్తం ఎనిమిది ఫాంటసీ చిత్రాలుగా తెరకెక్కించారు వార్నర్ బ్రదర్స్స. 2001లో హ్యారీ పాటర్ అండ్ ది ఫిలాసఫర్స్ స్టోన్ తో మొదలై.. హ్యారీ పోటర్ అండ్ ది డెత్లీ హాలోస్ పార్ట్ 2 (2011) తో ముగిసింది. ఇందులో డేనియల్ రాడ్ క్లిఫ్, రూపెర్ట్ గ్రింట్, ఎమ్మా వాట్సన్ ప్రధానపాత్రలు పోషించారు. ‘హ్యారీ పోటర్’ పేరు చెప్పగానే ఠక్కున గుర్తొచ్చే కుర్రాడి పేరు డేనియల్ రాడ్ క్లిఫ్. ఈ సినిమా ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది అభిమానుల హృదయాల్లో నిలిచిపోయాడు. ‘హ్యారీ పోటర్’ మొత్తం ఎనిమిది సిరీస్ లలో అతడే హీరో. నీలికళ్లతో..అమాయకత్వం.. అద్భుతమైన నటనతో వరల్డ్ వైడ్ గా భారీ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. మరీ ఇప్పుడు ‘హ్యారీ పోటర్’ హీరో ఎలా మారిపోయాడు ? ఏం చేస్తున్నాడో తెలుసా?..
డేనియల్ రాడ్‌క్లిఫ్ 23 జూలై 1989న మార్సియా జెన్నీన్ గ్రేషమ్, అలాన్ జార్జ్ రాడ్‌క్లిఫ్‌లకు జన్మించాడు. హ్యారీ పోటర్ ఫిల్మ్ సిరీస్‌లో టైటిల్ క్యారెక్టర్‌ని పోషించడానికి ఎంపికైనప్పుడు రాడ్‌క్లిఫ్ వయసు కేవలం 11 సంవత్సరాలు మాత్రమే. కానీ అంతకుముందే క్రెడిట్ డేవిడ్ కాపర్‌ఫీల్డ్ (1999) టీవీ షోలో నటించాడు. ఆ తర్వాత ద టైలర్ ఆఫ్ పనామా (2001) రాడ్‌క్లిఫ్ సినిమా రంగ ప్రవేశం చేశాడు. కానీ ప్రపంచానికి మాత్రం అతడు హ్యారీ పోటర్ గానే పరిచయం అయ్యాడు. 2001లో విడుదలైన ఈ సినిమాతో రాడ్ క్లిఫ్ క్రేజ్ ఒక్కసారిగా మారిపోయింది.
View this post on Instagram
ఇప్పటికీ అతడికి వరల్డ్ వైడ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. సీతారామం బ్యూటీ మృణాల్ ఠాకూర్ సైతం అతడికి వీరాభిమాని. డేనియల్ రాడ్‌క్లిఫ్ 10 సంవత్సరాల పాటు హ్యారీ పోటర్ చిత్రాల్లో నటించాడు. హ్యారీ పోటర్ తర్వాత పలు చిత్రాల్లో నటించాడు రాడ్ క్లిఫ్. కిల్ యువర్ డార్లింగ్స్ (2013), రొమాంటిక్ కామెడీ వాట్ ఇఫ్ (2013), సర్రియలిస్ట్ కామెడీ స్విస్ ఆర్మీ మ్యాన్ (2016) హీస్ట్ ఫిల్మ్ నౌ యు సీ మీ 2 (2016)లో కనిపించాడు. డేనియల్ రాడ్‌క్లిఫ్ ఇప్పటివరకు దాదాపు USD 110 మిలియన్ల సంపాదించినట్లు సమాచారం. UKలోని అత్యంత సంపన్న సెలబ్రిటీలలో ఒకరు. అలాగే అత్యధిక పారితోషికం తీసుకునే నటుల్లో ఒకరు.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.