Tollywood: అయ్య బాబోయ్.. అస్సలు తగ్గని అందం.. అరుంధతి డ్యాన్స్ టీచర్ ఇప్పుడేం చేస్తుందంటే..

సాధారణంగా కొందరు హీరోయిన్స్ ఒక్క సినిమాతోనే పాపులర్ అవుతుంటారు. ఆ తర్వాత వరుస అవకాశాలు అందుకుంటూ స్టార్ స్టేటస్ సొంతం చేసుకుంటారు. కానీ సినిమాల్లో సైడ్ క్యారెక్టర్స్, గెస్ట్ రోల్ చేసి అందరి దృష్టిని ఆకర్షించిన తారలు చాలా మంది ఉన్నారు. అందులో ఈ ముద్దుగుమ్మ ఒకరు. స్క్రీన్ పై కనిపించింది కాసేపే అయినా ఇప్పటికీ అడియన్స్ హృదయాల్లో ఆమె రూపం నిలిచిపోయింది.

Tollywood: అయ్య బాబోయ్.. అస్సలు తగ్గని అందం.. అరుంధతి డ్యాన్స్ టీచర్ ఇప్పుడేం చేస్తుందంటే..
Leena Sidhu

Updated on: Jul 18, 2025 | 6:23 PM

అనుష్క శెట్టి.. సూపర్ సినిమాతో కథానాయికగా టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. కానీ ఆమె కెరీర్ మలుపు తిప్పిన సినిమా అరుంధతి. లేడీ ఓరియెంటెడ్ డ్రామాగా వచ్చిన ఈ సినిమాలో జేజమ్మ పాత్రలో అద్భుతమైన నటనతో కట్టిపడేసింది. డైరెక్టర్ కోడి రామకృష్ణ దర్శకత్వం వహించిన ఈ సినిమా 2009లో విడుదలైంది. అప్పట్లో ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల తుఫాన్ సృష్టించింది. అంతేకాదు.. అప్పట్లోనే ఎన్నో అవార్డులు సొంతం చేసుకుంది. ఈ చిత్రానికి అప్పట్లో ఏడు విభాగాల్లో నంది పురస్కారాలను అందించింది ప్రభుత్వం. ఇక ఈ సినిమాతో తెలుగు వారికి దగ్గరయ్యింది అనుష్క. ఒక్క సినిమాతోనే ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది. దీంతో తెలుగు వరుస అవకాశాలు అందుకుంటూ స్టార్ స్టేటస్ సొంతం చేసుకుంది. ఇప్పటికీ తెలుగు సినిమా ప్రపంచంలో ఈ మూవీ ప్రత్యేకం.

అరుంధతి సినిమాలో జేజమ్మ పాత్ర ఎంత ప్రధానమో.. పశుపతి పాత్ర సైతం అంతే కీలకం. ఈ సినిమాలో భయంకరమైన విలన్ పాత్రలో యాక్టింగ్ ఇరగదీశారు సోనూసూద్. ఇక ఈ సినిమాలో మరో నటి సైతం హైలెట్ అయ్యింది. ఆమె పేరు లీనా సిద్ధు. ఈ పేరు చెబితే అడియన్స్ అస్సలు గుర్తుపట్టలేరు. కానీ అరుంధతి చిత్రంలో డ్యాన్స్ టీచర్ అంటే మాత్రం ఠక్కున గుర్తుపట్టేస్తారు. ఇందులో అరుంధతికి చిన్నప్పుడు డ్యాన్స్ నేర్పించిన టీచర్ పాత్రలో కనిపించింది. స్క్రీన్ పై ఆమె నిడివి తక్కువే అయినప్పటికీ కథ మలుపు తిరగడంలో ఆమె పాత్రే ప్రధానం.

ఇవి కూడా చదవండి

ఇవి కూడా చదవండి : బాబోయ్.. ఈ ఆసనాలేంటమ్మా.. తలకిందులుగా వేలాడుతున్న హీరోయిన్.. ఒకప్పుడు తెలుగులో తోపు..

లీనా సిద్ధు.. అచ్చమైన తెలుగమ్మాయి. తెలుగులో అరుంధతి సినిమాలో కీలకపాత్ర పోషించింది. ఆ తర్వాత ఛార్మీ నటించిన కావ్య’s డైరీ, లంక, హ్యాపీ హ్యాపీగా వంటి సినిమాల్లో కనిపించింది. అందం, అభినయంతో మెప్పించినప్పటికీ ఆమెకు అంతగా అవకాశాలు మాత్రం రాలేదు. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటూ ఫ్యామిలీ లైఫ్ ఎంజాయ్ చేస్తుంది లీనా సిద్ధు. ఇప్పుడు సోషల్ మీడియాలో నిత్యం ఏదోక పోస్ట్ చేస్తుంటుంది. తాజాగా ఆమె న్యూలుక్ ఫోటోస్ చూసి ఆశ్చర్యపోతున్నారు ఫ్యాన్స్.

ఇవి కూడా చదవండి : 

Shilpa Shetty : శిల్పా శెట్టి చెల్లెలు తెలుగులో తోపు హీరోయిన్.. ఒక్క సినిమాతోనే కుర్రాళ్లకు కునుకు లేకుండా చేసింది.. ఎవరంటే..

Telugu Actress : వరుసగా ప్లాపులు.. అయినా తగ్గని క్రేజ్.. రెమ్యునరేషన్ డబుల్ చేసిన హీరోయిన్..

Cinema : హిస్టరీలోనే అతిపెద్ద అట్టర్ ప్లాప్ సినిమా.. రూ.45 కోట్లతో తీస్తే.. రూ.60 వేలు రాలేదు.. దెబ్బకు..