
హీరోలతో పోల్చకుంటే సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ల కెరీర్ చాలా తక్కువ. వరుసగా ఒకటి, రెండు ఫ్లాపులు పడితే చాలు హీరోయిన్ గా అవకాశాలు కనుమరుగవుతాయి. సెకెండ్ హీరోయిన్ లేదా సహాయక నటి పాత్రలు వస్తాయి. కొందరికైతే ఇవి కూడా రావు. దీంతో క్రమంగా సినిమా ఇండస్ట్రీకి దూరమవుతారు హీరోయిన్లు. ఇప్పుడు మనం చెప్పుకోబోతోన్న ముద్దుగుమ్మ కూడా సరిగ్గా ఇదే కోవకు చెందుతుంది. చాలా మంది లాగే ఈ హీరోయిన్ కూడా మోడల్ గా కెరీర్ ప్రారంభించింది. ప్రతిష్ఠాత్మక ఫెమినా మిస్ ఇండియా పోటీలో టాప్ టెన్‌లో నిలవడంతో పాటు ఫ్రెష్ ఫేస్ టైటిల్ కూడా సొంతం చేసుకుంది. ఆ తర్వాత హీరోయిన్ గా సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. మొదటి సినిమానే అల్లు అర్జున్ లాంటి స్టార్ హీరో పక్కన చేసింది. తన అందం, అభినయంతో కుర్రకారను కట్టి పడేసింది. సినిమా కూడా హిట్ అయ్యింది. దీంతో ఈ ముద్దుగుమ్మకు వరుసగా అవకాశాలు వచ్చాయి. ప్రభాస్, రవితేజ, గోపీచంద్, విక్రమ్, మంచు మనోజ్, దర్శన్ (కన్నడ హీరో) ఇలా స్టార్ హీరోల సినిమాల్లో కథానాయకిగా నటించింది. అలాగే కొన్ని హిందీ సినిమాల్లోనూ యాక్ట్ చేసింది. కానీ ఇందులో చాలా సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. దీంతో ఈ ముద్దుగుమ్మకు అవకాశాలు కరువయ్యాయి. 2021 లో చివరి సారిగా సిల్వర్ స్క్రీన్ పై కనిపించిందీ అందాల తార.
ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీకి పూర్తిగా దూరమైన ఈ అందాల తార ఇప్పుడు కార్పొరేట్ లైఫ్ ను ఎంచుకుంది. యూకేలోని ఒక గేమింగ్ కంపెనీలో డైరెక్టర్‌గా పని చేస్తూ బాగానే సంపాదిస్తోంది. ఇంతకీ ఆ అందాల తార ఎవరనుకుంటున్నారా? వేదం హీరోయిన్ దీక్షా సేథ్. రవితేజ తో మిరపకాయ్, గోపీచంద్ తో వాంటెడ్, మంచు మనోజ్ తో ఊ కొడతారా ఉలిక్కి పడతారా తదితర సినిమాల్లో నటించిందీ అందాల తార. అయితే ఇప్పుడు సినిమా కెరీర్ ను విడిచి పెట్టిన ఈ ముద్దుగుమ్మ IESE Business School నుంచి ఎంబీఏ పూర్తి చేసింది. . ప్రస్తుతం యూకేకు చెందిన ఒక గేమింగ్ కంపెనీలో Director – Business Development & Strategic Partnerships గా పని చేస్తోందని తెలుస్తోంది. ఈ మేరకు లింక్డ్ ఇన్‌లో కూడా ఈ కెరీర్ మార్పును deliberate shiftగా వివరించింది దీక్ష. దీంతో ఈ బ్యూటీ పేరు ఇప్పుడు తెగ మార్మోగిపోతోంది. ఆమెకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు ఇప్పుడు నెట్టింట తెగ వైరలవుతున్నాయి.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.