Tollywood: ఈ టాలీవుడ్ నటి గుర్తుందా? ఇప్పుడామె కూతురు కూడా తెలుగులో ఫేమస్ హీరోయిన్.. ఎవరో తెలిస్తే ఆశ్చర్యపోతారు
ఈ నటి ఒకప్పుడు తెలుగుతో పాటు తమిళం, మలయాళం తదితర దక్షిణాది భాషలన్నింటిలోను హీరోయిన్ గా నటించింది. తన అందం, అభినయంతో ప్రేక్షకులను కట్టిపడేసింది. అయితే సినిమాల సంగతి పక్కన పెడితే.. ఈ సీనియర్ నటి జీవితం సంచలనాల మయం అని చెప్పు కోవచ్చు.

నటి లిజి.. ఈ పేరు వింటే గుర్తు పట్టకపోవచ్చు కానీ.. పై ఫొటో చూస్తే ఠక్కున గుర్తు పడతారు. అందులోనూ 90 జనరేషన్స్ వారికి ఈ ముద్దుగుమ్మ బాగానే పరిచయం. 1982లో ఇదిరి నేరం ఒతిరి కార్యం అనే మలయాళ సినిమాతో సినీ రంగ ప్రవేశం చేశారు లిజి. ఆ తర్వాత పలు సూపర్ హిట్ సినిమాల్లో హీరోయిన్ గా యాక్ట్ చేశారు. తెలుగుతో పాటు మలయాళం, కన్నడ, తమిళం. ఇలా దక్షిణాది భాషలన్నింటిలోనూ లిజి యాక్ట్ చేశారు. తెలుగు సినిమాల విషయానికి వస్తే.. సాక్షి, మగాడు, దోషి నిర్దోషి, 20వ శతాబ్దం, మామాశ్రీ, ఆత్మబంధం, శివ శక్తి, స్టువర్ట్ పురం దొంగలు తదితర సినిమాల్లో హీరోయిన్ గా, సహాయక నటిగా మెప్పించింది. తెలుగులో ఆమె చివరిగా నితిన్ ఛల్ మోహన్ రంగ (2018) సినిమాలో హీరోయిన్ తల్లిగా కనిపించింది. సినిమాల సంగతి పక్కన పెడితే.. ఈ నటి వ్యక్తిగత జీవితం సంచలనాల మయం అని చెప్పుకోవచ్చు. ఈ అందాల తార ప్రముఖ దర్శకుడు ప్రియదర్శన్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. 1996లో ప్రేమ వివాహం చేసుకున్న ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు పుట్టారు. వివాహం తర్వాత సినిమాలకు దూరమైన లిజి తన పేరును లక్ష్మి అని మార్చుకుంది.
కాగా సుమారు 26 ఏళ్లు కలిసి కాపురం చేసిన లిజి, ప్రియదర్శన్ దంపతులు 2016లో విడాకులు తీసుకుని విడిపోయారు. వీరికి ఇద్దరు పిల్లలు కాగా కూతురు ఇప్పుడు దక్షిణాదిలో ఫేమస్ హీరోయిన్. తెలుగు ఆడియెన్స్ కు కూడా ఈ ముద్దుగుమ్మ పరిచయమే. ఇంతకీ ఆమె ఎవరనుకుంటున్నారా? ఆ మధ్యన లోకా సినిమాతో పాన్ ఇండియా రేంజ్ లో ఫేమస్ అయిన కల్యాణి ప్రియదర్శన్.
కల్యాణి ప్రియదర్శన్ ఫొటోస్..
View this post on Instagram
2017లో హాలో అనే తెలుగు సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైంది కల్యాణి. ఆ తర్వాత చిత్రల హరి, రణరంగం తదిత సినిమాలతో తెలుగు ఆడియెన్స్ కు బాగా చేరువైంది. తమిళం, మలయాళం సినిమాల్లోనూ హీరోయిన్ గా యాక్ట్ చేసింది. ఇక గతేడాది కల్యాణి లీడ్ రోల్ లో నటించిన లోకా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. పాన్ ఇండియా రేంజ్ లో విడుదలైన ఈ సినిమా ఏకంగా రూ. 300 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించింది. ఇప్పుడీ ముద్దుగుమ్మ చేతిలో పలు క్రేజీ ప్రాజెక్టులున్నాయి.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




