
సోషల్ మీడియా పుణ్యమా అని సెలబ్రేటల ఫోటోలు నిత్యం వైరల్ అవుతుంటాయి. సినీ సెలబ్రెటీల త్రో బ్యాక్ ఫోటోల దగ్గర నుంచి లేటెస్ట్ ఫొటోస్ వరకు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. సినిమా వాళ్ల వ్యక్తిగత జీవితం కూడా సోషల్ మీడియాలో రకరకాల వార్తలు వైరల్ అవుతుంటాయి. ఇక పైన కనిపిస్తున్న ఫోటో గుర్తుపట్టారా.? ఆ ఫొటోలో ఉన్న ఇద్దరూ ఇండస్ట్రీలో తోపులు.. చాలా ఫేమస్ ఎవరో గుర్తుపట్టారా.? ఆ ఇద్దరూ తెలుగులో స్టార్ డైరెక్టర్స్. వారిలో ఒకరు ప్రభాస్ తో సినిమా చేశాడు.. అలాగే ఇప్పుడు ప్రభాస్ తో సినిమా చేస్తున్నారు. ఇండస్ట్రీలో మంచి క్రేజ్ సొంతం చేసుకున్నారు. ఆ ఇద్దరినీ గుర్తుపట్టడం కాస్త కష్టమే..
ఆ ఇద్దరూ ఎవరో కాదు.. తెలుగులో క్రేజీ దర్శకులు. వారిలో ఒకరు ప్రభాస్ తో రాధే శ్యామ్ సినిమా చేసిన దర్శకుడు రాధాకృష్ణ. రాధేశ్యామ్ సినిమాలో ప్రభాస్ స్టైలిష్ లుక్ లో కనిపించి ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటించింది. మంచి అంచనాల మధ్య విడుదలైన ఈ లవ్ స్టోరీ పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. కానీ ఈ సినిమా చాలా మంది ఫేవరెట్ మూవీ.. ఇక మరొకరు కూడా క్రేజీ దర్శకుడు. ఇది కూడా చదవండి : Prabhas: ప్రభాస్‌కు ఇష్టమైన హీరోయిన్ ఎవరో తెలుసా.? ఆమె నా క్రష్ అంటున్న రెబల్ స్టార్
ఆయన ఎవరో కాదు త్వరలోనే ప్రభాస్ హీరోగా నటిస్తున్న ఫౌజీ డైరెక్టర్ హనురాఘవపూడి. హనురాఘవపూడి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తన సినిమాలతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు హను. సీతారామం సినిమాతో సూపర్ హిట్ అందుకున్నారు హను ఇక ఇప్పుడు ప్రభాస్ తో కలిసి ఫౌజీ సినిమా చేస్తున్నారు. ఇక ఇప్పుడు ఈ ఇద్దరి ఓల్డ్ ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ ఇద్దరూ.. దర్శకుడు చంద్రశేఖర్ యేలేటి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్స్ గా పని చేశారు. అప్పటి ఫోటో ఒకటి ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతుంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి