Ileana D Cruz: తెలుగు, తమిళం సినిమాల్లో ఇలియానా బ్యాన్.. ఎందుకు చేశారో తెలుసా..?

|

Aug 22, 2024 | 3:18 PM

2006లో ‘దేవదాసు’ సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన ఇలియానా దశాబ్ద కాలంగా వెనుదిరిగి చూసుకోలేదు. మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్, ప్రభాస్, రవితేజ వంటి తెలుగు స్టార్లతో ఇలియానా స్క్రీన్ షేర్ చేసుకుంది. అయితే ఇలియానా తనకు బాగా డిమాండ్ ఉన్న సమయంలో హఠాత్తుగా తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి తప్పుకుంది. ఈ విషయాన్ని తాజాగా ఓ నిర్మాత తెలిపారు.

Ileana D Cruz: తెలుగు, తమిళం సినిమాల్లో ఇలియానా బ్యాన్.. ఎందుకు చేశారో తెలుసా..?
Ileana
Follow us on

ఒకప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ ఇలియానా. ముంబైకి చెందిన ఈ బ్యూటీ దేవదాసు సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. ఆ తర్వాత పోకిరి సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ఇలియానాకు తెలుగులో ఆఫర్స్ క్యూ కట్టాయి. తక్కువ సమయంలోనే స్టార్ డమ్ సంపాదించుకున్న ఈ బ్యూటీ.. ఆ తర్వాత తమిళం, హిందీలో వరుస అవకాశాలను సొంతం చేసుకుంది. 2006లో ‘దేవదాసు’ సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన ఇలియానా దశాబ్ద కాలంగా వెనుదిరిగి చూసుకోలేదు. మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్, ప్రభాస్, రవితేజ వంటి తెలుగు స్టార్లతో ఇలియానా స్క్రీన్ షేర్ చేసుకుంది. అయితే ఇలియానా తనకు బాగా డిమాండ్ ఉన్న సమయంలో హఠాత్తుగా తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి తప్పుకుంది. ఈ విషయాన్ని తాజాగా ఓ నిర్మాత తెలిపారు.

సినీ పరిశ్రమలో ఈ నిర్మాతల సంఘాలు చాలా బలంగా ఉన్నాయి. ముఖ్యంగా తెలుగు చిత్రసీమలో టాప్ నటీనటులపై కూడా నిషేధం విధిస్తుంటారు. అలాగే ఇలియానా చేసిన ఓ పని వల్ల ఆమెను తెలుగులోనే కాకుండా తమిళ సినిమాల్లో కూడా బ్యాన్ చేశారు. టాలీవుడ్ఓ ఇండస్ట్రీకి చెందిన ఓ నిర్మాత ఇటీవల ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘నటి ఇలియానా ఓ తమిళ సినీ నిర్మాత నుంచి రూ.40 లక్షలు అడ్వాన్స్ గా అందుకుంది. కానీ డేట్స్ మాత్రం ఇవ్వలేదు. ఇచ్చిన డబ్బు తిరిగి ఇవ్వలేదు. ఆ నిర్మాత మాకు ఫిర్యాదు చేశారు. ఫోన్ చేసి విచారించాం. అప్పుడు ఇలియానా మాట్లాడుతూ.. ‘నేను డేట్స్ ఇచ్చాను.. కానీ నా డేట్స్ ఉపయోగించలేదు. తర్వాత నిర్మాతల సంఘం లాగ్ షీట్స్ అన్నీ బయటకి తీస్తే.. అడ్వాన్స్ తీసుకున్న నిర్మాతలకు ఇచ్చిన డేట్స్ లో ఇలియానా మరో సినిమాలో నటించిందని తెలిసింది. వెంటనే ఆ నటిపై నిషేధం విధించాం.’ మా రూల్ ప్రకారం అడ్వాన్స్ తీసుకున్న తర్వాత సినిమా సెట్ కు వచ్చి నటించాలి. అప్పుడే నటిస్తున్నట్టు. కానీ అడ్వాన్స్ తీసుకుని సినిమా స్టార్ట్ కాలేదు, ఆర్టిస్టులు సినిమా సెట్ కి రాలేదు కాబట్టి వచ్చిన అడ్వాన్స్ డబ్బు తిరిగి ఇచ్చేయాలి, ఇదే రూల్’’ అన్నారు. అడ్వాన్స్ తీసుకుని డేట్స్ ఇచ్చి అదే తేదీకి వేరే సినిమాలో నటించడం నేరమని నిర్మాత అన్నారు.

ఇలియానా నిషేధానికి గురైనప్పుడు, ఆమె విజయ్ తమిళ చిత్రం ‘నన్బన్’లో నటిస్తోంది. తమిళంలో ఆమెకు అదే ఆఖరి చిత్రమని, ఆమెపై నిషేధం విధించామని నిర్మాత తెలిపారు. 2012 తర్వాత ఆరేళ్ల పాటు ఏ తెలుగు, తమిళ సినిమాలోనూ నటించలేదు ఇలియానా. ఆ తర్వాత 2018లో రవితేజ నటించిన ‘అమర్ అక్బల్ ఆంటోని’ సినిమాలో నటించింది. ఇప్పటివరకు మరో సౌత్ ఇండియన్ సినిమాలో నటించలేదు. ఇలియానా భారత పౌరసత్వాన్ని వదులుకుని 2014లో పోర్చుగల్ పౌరసత్వం పొందింది. 2023లో ఇలియానా మైఖేల్ డోలన్ అనే అమెరికన్ నటుడిని పెళ్లాడింది. వీరికి బాబు జన్మించాడు. ప్రస్తుతం ఇలియానా కేవలం హిందీ సినిమాల్లోనే నటిస్తోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.