
ఇండస్ట్రీలో హీరోయిన్ గా రాణించాలని ఎంతో మంది అడుగుపెడుతూ ఉంటారు. ఈ రంగుల ప్రపంచంలో కొంతమంది సక్సెస్ అవుతారు మరికొంతమంది అలుపెరగకుండా ప్రయత్నాలు చేస్తుంటారు. కాగా కొంతమంది ముద్దుగుమ్మలు హీరోయిన్ గా అవకాశాలు అందుకున్నా కూడా అనుకున్నంతగా సక్సెస్ కాలేరు. దాంతో సెకండ్ హీరోయిన్స్ గా.. మరికొంతమంది స్పెషల్ సాంగ్స్ వైపు అడుగులేస్తుంటారు. పైన కనిపిస్తున్న హీరోయిన్ కూడా వారిలో ఒకరు. హీరోయిన్ గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఆమె అనుకుంతగా సక్సెస్ కాలేకపోయింది. దాంతో సెకండ్ హీరోయిన్ గా మారింది.. ఆతర్వాత స్పెషల్ సాంగ్స్ తో కుర్రాళ్లను ఉర్రుతలూగించింది.. కెరీర్ మంచి ఫామ్ లో ఉండగానే క్యాన్సర్ బారిన పడింది.. మనో ధైర్యంతో క్యాన్సర్ మహమ్మారిని ఓడించింది.. కానీ ఇప్పుడు అవకాశాల కోసం ఎదురుచూస్తుంది. ఇంతకూ ఆమె ఎవరో తెలుసా.?
టాలీవుడ్ లో ఎంతో మంది ముద్దుగుమ్మలు తమ అందాలతో ప్రేక్షకులను కవ్వించారు అలాంటి వారిలో హంసానందిని ఒకరు. అందాల భామ హంసా నందిని పూనేలో పుట్టి, పెరిగింది. మోడలింగ్ చేయడంకోసం ముంబైకి వచ్చింది ఈ అమ్మడు. 2002 నుంచి మోడలింగ్ రంగంలో ఉంటూ, పలు టెలివిజన్ ప్రకటనలలో నటించింది. ఆతర్వాత హీరోయిన్ గా మారింది. 2004లో వచ్చిన ఒకటవుదాం సినిమాతో హీరోయిన్ గా మారింది హంసానందిని. హీరోయిన్ గా వరుసగా సినిమాలు చేసింది ఈ ముద్దుగుమ్మ.
హీరోయిన్ గా అంతగా సక్సెస్ కాలేదు ఈ చిన్నది. దాంతో కొన్ని సినిమాల్లో సెకండ్ హీరోయిన్ గా చేసింది. అయినా కూడా అనుకున్నంతగా గుర్తింపు తెచ్చుకోలేదు. దాంతో స్పెషల్ సాంగ్స్ చేసి మెప్పించింది. 2013 లో మిర్చి, భాయి, అత్తారింటికి దారేది, రామయ్యా వస్తావయ్యా, బాలకృష్ణ హీరోగా నటించిన లెజెండ్ సినిమాలలో ప్రత్యేక గీతాలలో నటించింది. ఇదిలా ఉంటే 2021 లో తాను రొమ్ము క్యాన్సర్ వ్యాధి బారిన పడ్డట్లు తెలిపింది. తన తల్లి కూడా క్యాన్సర్ తోనే మరణించింది. జన్యూపరంగా తాను క్యాన్సర్ వ్యాధి బారిన పడ్డట్లు తెలిపింది. క్యాన్సర్ ని జయించిన హంసా నందిని ఇప్పుడు అవకాశాల కోసం ఎదురుచూస్తుంది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ హాట్ హాట్ ఫొటోలతో కవ్విస్తుంది.