అప్పుడు చిరంజీవి సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్.. ఇప్పుడు అమ్మాయిల డ్రీమ్ బాయ్..! ఇప్పటికీ తోప్ హీరో
సినిమా ఇండస్ట్రీలో చాలా మంది చైల్డ్ ఆర్టిస్ట్ లుగా కెరీర్ మొదలు పెట్టి ఆతర్వాత హీరోలుగా, హీరోయిన్స్ గా సినిమాలు చేసి మెప్పిస్తున్నారు. ఇక ఇప్పుడు ఓ స్టార్ హీరో కూడా ఒకప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించి మెప్పించాడు. ఇప్పుడు తిరుగులేని హీరో అతను..

ప్రపంచ సినీ చరిత్రలో తనదైన ముద్ర వేసుకున్న ప్రముఖ నటుడు ఆయన. కోట్లాదిమంది అభిమానులను సొంతం చేసుకున్నాడు ఆ హీరో.. చైల్డ్ ఆర్టిస్ట్ చేసి ఆతర్వాత హీరోగా మారి వరుస హిట్స్ అందుకున్నాడు. ఇప్పుడు ఇండస్ట్రీలో రాణిస్తున్న స్టార్స్ లో ఆయన ఒకరు. పాన్ ఇండియా స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు ఆ హీరో.. స్టార్ హీరోల సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసి మెప్పించాడు. మెగాస్టార్ చిరంజీవి, అలాగే సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా చేశాడు ఆ హీరో.. ఇంతకూ ఆయన ఎవరో తెలుసా.? అమ్మాయిలకు అతనంటే పిచ్చి.. అతను ఎవరో కాదు బాలీవుడ్ బడా హీరో హృతిక్ రోషన్. చిన్ననాటి నుండే నటన పట్ల అపారమైన అభిరుచిని పెంచుకున్నాడు హృతిక్. బాలీవుడ్‌లో గ్రీక్ గాడ్, హాలీవుడ్ యాక్షన్ హీరోగా అభిమానులచే కీర్తించబడే హృతిక్, యాక్షన్ చిత్రాలకు మారుపేరుగా నిలిచాడు. ఆయన చేసిన సినిమాలు తెలుగులో డబ్ అయి కూడా ఘనవిజయం సాధించాయి. ప్రముఖ నిర్మాత, నటుడు రాకేష్ రోషన్ కుమారుడిగా సినీ రంగ ప్రవేశం చేసిన హృతిక్, బాలనటుడిగా కూడా పలు బాలీవుడ్ చిత్రాలలో నటించి తన ప్రతిభను చాటుకున్నాడు.
సౌందర్య ఆ స్టార్ హీరోతో సినిమా చేయాల్సింది.. కానీ అతను చెప్పిన ఒకే ఒక్క మాటతో..
తన బాల్యంలో, హృతిక్ రోషన్ అప్పటి సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నటించిన భగవాన్ దాదా (1986) చిత్రంలో ఓ ముఖ్యమైన బాలనటుడి పాత్రను పోషించారు. ఈ చిత్రంలో రజనీకాంత్‌తో కలిసి ఉన్న ఆయన ఫోటో అప్పట్లో బాగా వైరల్ అయింది. ఈ అనుభవం ఆయన నటనా ప్రస్థానానికి బలమైన పునాది వేసింది. కాలక్రమేణా, ఇదే భగవాన్ దాదా చిత్రాన్ని మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెలుగులోకి రీమేక్ చేయాలనే ఆలోచన బలపడింది. ఈ రీమేక్ ప్రాజెక్టును హృతిక్ తండ్రి రాకేష్ రోషనే స్వయంగా నిర్మించాలని భావించారు. ప్రముఖ దర్శకుడు కోదండరామిరెడ్డి దర్శకత్వంలో ఈ సినిమాను ప్రారంభించారు. మాతృకలో బాలనటుడిగా నటించిన హృతిక్ రోషన్, ఈ తెలుగు రీమేక్‌లో కూడా అదే పాత్రలో నటించేందుకు ఎంపికయ్యారు. అయితే, షూటింగ్ ప్రారంభమైన కొంతకాలానికే ఈ ప్రాజెక్ట్ అనుకున్న దానికంటే ఎక్కువ బడ్జెట్‌కు చేరుకుంది.
తల్లి దండ్రులకు కర్మకాండలు చేయలేకపోయా..! బంధువులందరూ తిట్టారు.. ఎమోష్నల్ అయిన హీరో
అప్పట్లో ఒక కోటి రూపాయలు ఖర్చు చేయడమంటే నేటి వంద కోట్ల రూపాయలకు సమానం అని చెబుతారు. అలాంటి రోజుల్లో, ఈ రీమేక్ చిత్రం పూర్తవ్వడానికి దాదాపు మూడు కోట్ల రూపాయల బడ్జెట్ అవసరమని అంచనా వేశారు. ఈ భారీ వ్యయం కారణంగా, నిర్మాతలు ఆ సినిమాను మధ్యలోనే నిలిపివేయక తప్పలేదు. ఒకవేళ ఈ చిత్రం పూర్తయి విడుదలైనట్లయితే, అది తెలుగు సినీ చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచిపోయేది. మెగాస్టార్ చిరంజీవి, బాలనటుడిగా హృతిక్ రోషన్ కలిసి నటించిన ఏకైక తెలుగు సినిమాగా సరికొత్త రికార్డు సృష్టించేది. తెలుగు ప్రేక్షకులు ఈ అరుదైన కాంబినేషన్‌ను చూసే అవకాశాన్ని కోల్పోయారని ట్రేడ్ పండితులు, సినీ విశ్లేషకులు ఇప్పటికీ అభిప్రాయపడుతున్నారు.
50 దేశాల్లో విడుదలైన బ్లాక్ బస్టర్ సినిమా.. తొలి తెలుగు పాన్ వరల్డ్ మూవీ.. ఇప్పటికీ ఆ రికార్డ్ అలానే
View this post on Instagram




