AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Brahmanandam: యాడ్‌లో బ్రహ్మానందంతో కలిసి నటించిన ఈ అబ్బాయి ఎవరో తెలుసా..?

బ్రహ్మానందం.. టాలీవుడ్ ఇండస్ట్రీలో పరిచయం అక్కర్లేని పేరు. 1200 సినిమాల్లో నటించిన ఈ లెజెండరీ కమెడియన్ ఇప్పుడు కాస్త రెస్ట్ మోడ్‌లో ఉన్నారు. నచ్చిన కథలు వచ్చినపుడో.. నచ్చిన మనషులు వచ్చి తప్పకుండా మీరు చేయాలి అని అడిగినపుడో తప్ప సినిమాలు చేయడం లేదు బ్రహ్మీ. దీంతో గత కొన్నేళ్లుగా బ్రహ్మి చేస్తున్న సినిమాల సంఖ్య బాగా తగ్గిపోయింది.

Brahmanandam: యాడ్‌లో బ్రహ్మానందంతో కలిసి నటించిన ఈ అబ్బాయి ఎవరో తెలుసా..?
Brahmanandam,Benny
Praveen Vadla
| Edited By: Janardhan Veluru|

Updated on: Feb 05, 2025 | 4:29 PM

Share

బ్రహ్మానందం గురించి కొత్తగా చెప్పాల్సిందేమీ లేదు.. 1200 సినిమాల్లో నటించిన ఈ లెజెండరీ కమెడియన్ ఇప్పుడు కాస్త రెస్ట్ తీసుకుంటున్నాడు. నచ్చిన కథలు వచ్చినపుడో.. నచ్చిన మనషులు వచ్చి తప్పకుండా మీరు చేయాలి అని అడిగినపుడో తప్ప సినిమాలు చేయట్లేదీయన. కొన్నేళ్లుగా బ్రహ్మి చేస్తున్న సినిమాల సంఖ్య బాగా తగ్గిపోయిందిప్పుడు. అయితే ఇదే సమయంలో కేవలం సినిమాలు మాత్రమే కాదు.. యాడ్స్, వెబ్ సిరీస్‌లు కూడా చేస్తున్నాడు బ్రహ్మానందం. ఈ క్రమంలోనే తాజాగా ఈయన ఓ యాడ్ చేసాడు.. నీటికి సంబంధించిన ఎండోర్స్‌మెంట్ ఇది.

ఇందులో బ్రహ్మానందంతో పాటు ఓ అబ్బాయి నటించాడు. ఆ కుర్రాడిని చూస్తుంటే ఎక్కడో చూసామే అనే ఫీలింగ్ అయితే తప్పకుండా కలుగుతుంది. ఈ యాడ్ వచ్చినప్పటి నుంచి సోషల్ మీడియాలో ఈ కుర్రాడి గురించే ఎక్కువ చర్చ జరుగుతుంది. ఎక్కడో చూసామే.. కానీ గుర్తు రావట్లేదే అంటూ తలలు అలా పట్టుకుంటున్నారంతా. ఇంతకీ ఆ కుర్రాడెవరో తెలుసా..? లెజెండరీ కమెడియన్ సుధాకర్ కొడుకు బెన్నీ. ఒకప్పుడు సుధాకర్, బ్రహ్మానందం కాంబినేషన్‌లో వందల సినిమాలు వచ్చాయి. ఈ ఇద్దరూ కలిసి చేసిన కామెడీతో ఆడియన్స్ పొట్టలు చెక్కలయ్యాయి.

ఆ తర్వాత సుధాకర్ కాస్త నెమ్మదించాడు కానీ బ్రహ్మి మాత్రం దూసుకుపోయాడు. తన అనారోగ్యం కారణంగా సినిమాలకు కూడా దూరమయ్యాడు సుధాకర్. అయితే తన కొడుకు బెన్నీని మాత్రం ఇండస్ట్రీకి చేరువ చేయాలని చాలా రోజులుగా చూస్తున్నాడు. ఈ క్రమంలోనే బ్రహ్మానందం నటిస్తున్న యాడ్‌తో బెన్నీ ఇంట్రడ్యూస్ అయ్యాడు. అక్కడున్నది సుధాకర్ కొడుకు అని చాలా మందికి తెలియకపోవచ్చు కానీ బ్రహ్మితో కలిసి నటిస్తే ఎవరీ కుర్రాడు అనే చర్చ అయితే మొదలవుతుంది కదా..! మరి బ్రహ్మి ఇమేజ్ బెన్నీకి హెల్ప్ అవుతుందో లేదో చూడాలి.

బ్రహ్మానందంతో కలిసి కమెడియన్ సుధాకర్ కొడుకు బెన్నీ నటించిన యాడ్..

2026లో మరో 30 శాతం పెరగనున్న బంగారం! నివేదికలో ఆశ్చర్యకరమైన విషయం
2026లో మరో 30 శాతం పెరగనున్న బంగారం! నివేదికలో ఆశ్చర్యకరమైన విషయం
20 సార్లు ఓడిన తర్వాత రాహుల్ చిట్కా పనిచేసిందంటున్న ఫ్యాన్స్
20 సార్లు ఓడిన తర్వాత రాహుల్ చిట్కా పనిచేసిందంటున్న ఫ్యాన్స్
టెస్టులకు కూడా దొరకని వ్యాధి.. వదిలేస్తే యమ డేంజర్!
టెస్టులకు కూడా దొరకని వ్యాధి.. వదిలేస్తే యమ డేంజర్!
రూ.100 కంటే తక్కువ ప్లాన్స్‌ గురించి తెలుసా? 30 రోజుల వ్యాలిడిటీ
రూ.100 కంటే తక్కువ ప్లాన్స్‌ గురించి తెలుసా? 30 రోజుల వ్యాలిడిటీ
చూడటానికి ఇంత ఉంది.. సింహానికి కూడా సుస్సు పోయిస్తుంది..
చూడటానికి ఇంత ఉంది.. సింహానికి కూడా సుస్సు పోయిస్తుంది..
వెంకటగిరి రాజా ఫ్యామిలీ కోసం తయారైన స్పెషల్ రెసిపి..టేస్ట్ చేశారా
వెంకటగిరి రాజా ఫ్యామిలీ కోసం తయారైన స్పెషల్ రెసిపి..టేస్ట్ చేశారా
పర్సనల్ లోన్ తీసుకునే ముందు ఈ విషయాలు తప్పక తెలుసుకోండి..
పర్సనల్ లోన్ తీసుకునే ముందు ఈ విషయాలు తప్పక తెలుసుకోండి..
ఇంట్లో గులాబీలు గుత్తులుగా పూస్తున్నాయా?.. వాస్తు చెప్పే రహస్యం..
ఇంట్లో గులాబీలు గుత్తులుగా పూస్తున్నాయా?.. వాస్తు చెప్పే రహస్యం..
పాస్‌వర్డ్ లేకుండా వైఫైని ఎలా కనెక్ట్ చేయాలి? సులభమైన ట్రిక్‌
పాస్‌వర్డ్ లేకుండా వైఫైని ఎలా కనెక్ట్ చేయాలి? సులభమైన ట్రిక్‌
జైలర్ 2లో ఆ నటుడు.. అస్సలు ఊహించలేదుగా
జైలర్ 2లో ఆ నటుడు.. అస్సలు ఊహించలేదుగా