సినిమా ఇండస్ట్రీలో రాణించడానికి లుక్స్ ముఖ్యంకాదు నటనే ముఖ్యం. చాలా మంది తమ నటనతో స్టార్స్ గా ఎదిగారు. చాలా మంది సినిమాల్లోకి రాక ముందు ఎన్నో కష్టాలు, ఇబ్బందులు ఎదురొని ఇప్పుడు స్టార్స్ గా రాణిస్తున్నారు. అలాగే ఓ హీరో కూడా ఇండస్ట్రీలోకి రాక ముందు ఎన్నో కష్టాలను ఎదుర్కొని ఇప్పుడు వందల కోట్లకు పైగా ఆస్తులు సంపాదించారు. అప్పటిలో ఒక పూట తిండి తినడానికి కూడా ఎనో కష్టాలు పడిన ఆ హీరో ఇప్పుడు పాన్ ఇండియా స్టార్. తన నటనతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. ఇంతకూ ఆ హీరో ఎవరో తెలుసా.? ఎన్నో సూపర్ హిట్ సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు ఆ హీరో. ఇంతకూ ఆయన ఎవరో తెలుసా.? ఆయనకు తెలుగు, తమిళ్ భాషలో అభిమానులు ఉన్నారు. ఇంతకూ ఆయన ఎవరంటే..
తమిళ నటుడు విజయ్ సేతుపతి పుట్టినరోజు నేడు. లుక్స్ ముఖ్యం కాదు నటనే ముఖ్యం అని నిరూపించాడు ఈ స్టార్ హీరో. విజయ్ సేతుపతి క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సినిమా రంగంలోకి రాకముందు విజయ్ చాలా కష్టమైన జీవితం గడిపాడు. ఇప్పుడు స్టార్ గా ఎదిగిన తర్వాత కూడా ఆయన సాదాసీదా జీవితాన్ని గడుపుతున్నారు.
విజయ్ సేతుపతి దుబాయ్‌లో అకౌంటెంట్ గా చేశారు. తర్వాత ఇండియాకు వచ్చి ఓ థియేటర్ కంపెనీలో అకౌంటెంట్‌గా చేరారు. ‘అకౌంటెంట్‌గా పని చేయడం వల్ల ప్రతిరోజూ నటీనటులను చూడడానికి, వారితో కలిసి ఉండటానికి, వారితో మాట్లాడటానికి, నటనా కళను అర్థం చేసుకోవడానికి వీలు కల్పిస్తుందని నేను అనుకున్నాను అని గతంలో విజయ్ తెలిపారు. అలాగే ప్రతి క్షణం, మధ్యాహ్న భోజన సమయం కూడా నాకు నేర్చుకునే అనుభవం. నటీనటుల చుట్టూ ఉండటం కంటిన్యూగా క్లాస్‌కి హాజరైనట్లే’ అని సేతుపతి అన్నారు. అలాగే ఆయన మాట్లాడుతూ.. జూనియర్ ఆర్టిస్ట్ నుండి హీరోగా తన ప్రయాణాన్ని గుర్తు చేసుకున్నారు. ఒకప్పుడు డబ్బు కోసం ఎక్కువ గంటలు పనిచేసిన ప్రదేశంలోనే తన మొదటి సన్నివేశాన్ని చిత్రీకరించారని తెలిపారు. ‘ఇది ఒక వృత్తం. అయితే ఈ సర్కిల్ ఇలా పూర్తవుతుందని అనుకోలేదు. ఇలాంటి సర్కిళ్లు నా లైఫ్ లో చాలానే ఉన్నాయి’ అన్నారు విజయ్.
2013లో వచ్చిన ‘పిజ్జా’ సినిమా ద్వారా విజయ్ సేతుపతి హీరోగా మారాడు. ఈ చిత్రానికి కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వం వహించారు. ఈ సినిమా అప్పట్లో పెద్ద హిట్‌గా నిలిచింది.’నేను సినిమా షూటింగ్‌కి వెళ్లినప్పుడు ఏదైనా ప్రత్యేక సన్నివేశం ఉంటే, ఆసక్తికర సన్నివేశం ఉంటే పిల్లలతో పంచుకుంటాను’ అని చెప్పారు విజయ్. విజయ్ సేతుపతి ఆస్తులు 140 కోట్ల రూపాయలు. ఆయన దగ్గర పలు లగ్జరీ కార్లు ఉన్నాయి. విజయ్ ప్రస్తుతం చాలా సినిమాల్లో నటిస్తున్నాడు. తెలుగు, తమిళ్ తో పాటు బాలీవుడ్‌లోనూ మంచి పేరు తెచ్చుకున్నాడు.
మరిన్ని సినిమా వార్తలకోసం ఇక్కడ క్లిక్ చేయండి