AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Saif Ali Khan: సైఫ్‌ను పొడిచింది ఇతనే .. సీసీ ఫుటేజ్ వీడియో వదిలిన పోలీసులు

బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్​ ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగానే ఉందని ముంబై లీలావతి ఆసుపత్రి వైద్యులు తెలిపారు. ఆయన వెన్నెముకకు తీవ్రగాయమైందని వెల్లడించారు. సర్జరీ చేసి వెన్నెముక నుంచి రెండున్నర అంగుళాల కత్తిని తొలగించినట్లు వివరించారు. ఫ్లూయిడ్‌ లీకేజీని అరికట్టడానికి సైఫ్‌ వెన్నెముకకు మేజర్‌ సర్జరీ చేసినట్లు తెలిపారు.

Saif Ali Khan: సైఫ్‌ను పొడిచింది ఇతనే .. సీసీ ఫుటేజ్ వీడియో వదిలిన పోలీసులు
Saif Ali Khan
Rajeev Rayala
|

Updated on: Jan 16, 2025 | 6:16 PM

Share

బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్ పై దుండగులు దాడి చేయడం కలకలం రేపింది. ఈ ఘటనతో బాలీవుడ్ మొత్తం ఒక్కసారిగా ఉలిక్కి పడింది. సైఫ్ అలీఖాన్‌పై అర్ధరాత్రి దాడి జరిగింది. కత్తితో 6 సార్లు పొడిచాడు ఓ దుండగుడు. కాగా ఈ దాడిలో  రెండు కత్తి పోట్లు చాలా లోతుగా దిగాయి అని వైద్యులు తెలిపారు.. హత్య చేయాలనే ఉద్దేశంతో దాడి చేసినట్లు తెలుస్తోంది. ఇక ఇప్పుడు  నిందితుడి ఫొటో కూడా లభ్యమైంది. సీసీటీవీ ఫుటేజీలో నిందితుడి ఫొటోను పోలీసులు షేర్ చేశారు. సైఫ్ అలీఖాన్‌పై దాడి జరగడంతో ముంబయి క్రైం బ్రాంచ్‌కు చెందిన 8 బృందాలను విచారణకు ఏర్పాటు చేశారు. దీంతో ముంబై పోలీసులతో 7 బృందాలను ఏర్పడి కేసును దర్యాప్తు చేస్తున్నారు. సైఫ్ అలీఖాన్‌పై జరిగిన దాడిపై మొత్తం 15 బృందాలు విచారణ జరుపుతున్నాయి.

చోరీకి వచ్చిన దొంగే.. సైఫ్‌పై దాడి చేసినట్టు గుర్తించారు పోలీసులు. పక్క ఇంటి సీసీ ఫుటేజ్‌ ద్వారా ఓ వ్యక్తి సైఫ్ ఇంట్లోకి ప్రవేశించినట్టు ఆధారాలు సేకరించారు. నిందితుడు పారిపోతుండగా దృశ్యాలు సీసీటీవీకి చిక్కాయి. త్వరలోనే నిందితుడిని పట్టుకుంటామంటున్నారు ముంబై పోలీసులు.

ఇక ఈ దాడి లో సైఫ్ వెన్నెముకకు తీవ్రగాయమైందని వెల్లడించారు వైద్యులు. సర్జరీ చేసి వెన్నెముక నుంచి రెండున్నర అంగుళాల కత్తిని తొలగించినట్లు వివరించారు. ఫ్లూయిడ్‌ లీకేజీని అరికట్టడానికి సైఫ్‌ వెన్నెముకకు మేజర్‌ సర్జరీ చేసినట్లు తెలిపారు. సైఫ్‌ అలీఖాన్‌ మెడ, ఎడమ చేతికి మరో రెండు ప్లాస్టిక్‌ సర్జరీలు చేసినట్లు వివరించారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్