అప్పట్లో ఎయిర్‌హోస్టెస్.. ఇప్పుడు క్రేజీ హీరోయిన్.. ఐదు సినిమాలు చేస్తే అన్ని అట్టర్ ఫ్లాప్.. కానీ
సినిమా ఇండస్ట్రీలో చాలా మంది హీరోయిన్స్ కెరీర్ బిగినింగ్ లో రకరకాల పనులు చేసే వారు. కొంతమంది సేల్స్ గర్ల్స్ గ మరికొంతమంది కాల్ సెంటర్స్ లో కూడా పని చేశారు. మరికొంతమంది సాఫ్ట్ వేర్ ఇంజనీర్స్ ఉన్నారు. అలాగే డాక్టర్స్ కూడా ఉన్నారు. అదృష్టం కలిసొచ్చి హీరోయిన్స్ గా మారి సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు కొంతమంది ముద్దుగుమ్మలు అలాంటి వారిలో ఈ బ్యూటీ ఒకరు. కెరీర్ బిగినింగ్ లో ఎయిర్ హోస్టెస్‌గా పనిచేసింది.

ప్రస్తుతం టాలీవుడ్ లో యంగ్ హీరోయిన్స్ హవా నడుస్తుంది. ఇప్పటికే చాలా మంది హీరోయిన్స్ తెలుగులో హీరోయిన్స్ గా అవకాశాలు అందుకుంటూ సత్తా చాటుతున్నారు. వారిలో పైన కనిపిస్తున్న ముద్దుగుమ్మ ఒకటి. చేసింది తక్కువ సినిమాలే కానీ విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకుంది. విశేషం ఏంటంటే ఈ అమ్మడు నటించిన ఒక్క సినిమా కూడా హిట్ అవ్వలేదు. కానీ క్రేజ్ మాత్రం విపరీతంగా ఉంది. అంతే కాదు ఈ అమ్మడు హీరోయిన్ గా సినిమాలు చేయాక ముందు ఇండిగో ఎయిర్‌లైన్స్‌లో ఎయిర్‌హోస్టెస్‌గా పని చేసింది. ఆతర్వాత పలు యాడ్స్ లో నటించింది. ఆతర్వాత హీరోయిన్ గా అవకాశాలు అందుకుంది ఈ అమ్మడు. ఇంతకూ ఈ ముద్దుగుమ్మ ఎవరో కనిపెట్టారా.?
టాలీవుడ్ లో ఎంతో మంచి హీరోయిన్స్ రాణిస్తున్నారు. వారిలో రాశి సింగ్ ఒకరు. రాశి సింగ్ 1999 జనవరి 5న రాయ్‌పూర్‌లో జన్మించింది. ఆమెకు సౌరభ్ సింగ్ అనే సోదరుడు ఉన్నాడు. చిన్నప్పటి నుంచి నటనపై ఆసక్తి ఉన్న రాశి, 14 ఏళ్ల వయసులో కమర్షియల్ యాడ్స్‌లో నటించడం ప్రారంభించింది.చిన్నప్పటి నుంచి నటన పై ఆసక్తితో ధారావాహికల్లోని పాత్రలు చూసి వాటిని రోజూ అద్దం ముందు ప్రాక్టీస్ చేసేది.
వ్యక్తిగత కారణాల వల్ల ఇండిగో ఎయిర్‌లైన్స్‌లో ఎయిర్‌హోస్టెస్‌గా కెరీర్‌ని ప్రారంభించాల్సి వచ్చింది. ఆతర్వాత హీరోయిన్ గా ఛాన్స్ లు అందుకుంది. ఈ ముద్దుగుమ్మ 2021లో ఆది సాయి కుమార్ నటించిన శశి చిత్రంతో తెలుగు సినిమాల్లోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత పోస్టర్, జెమ్, ప్రేమ్ కుమార్ , ప్రసన్న వదనం వంటి సినిమాల్లో నటించింది. ఆమె పాపం పసివాడు అనే వెబ్ సిరీస్‌లో కూడా కనిపించింది. చివరిగా భూతద్దం భాస్కర్ నారాయణ చిత్రంలో నటించింది. రాశి సింగ్ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ, తన ఫోటోషూట్స్‌తో అభిమానులను ఆకట్టుకుంటుంది.
View this post on Instagram
రాశి సింగ్ ఇన్ స్టా..
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..