మహేష్ బాబును అన్నయ్య అని పిలిచేదాన్ని.. హీరోయిన్ మాటలకు ఫ్యాన్స్ షాక్

సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న లేటెస్ట్ మూవీ కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న మొత్తం ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా, డైరెక్టర్ రాజమౌళి రూపొందిస్తున్న సినిమా వారణాసి. ఈ సినిమాపై ముందు నుంచి భారీ అంచనాలు నెలకున్నాయి.

మహేష్ బాబును అన్నయ్య అని పిలిచేదాన్ని.. హీరోయిన్ మాటలకు ఫ్యాన్స్ షాక్
Mahesh Babu

Updated on: Nov 18, 2025 | 5:49 PM

సూపర్ స్టార్ మహేష్ బాబు, రాజమౌళి కాంబినేషన్ లో వస్తున్న సినిమా పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా కోసం మహేష్ అభిమానులు ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా అనౌన్స్ చేస్తూ భారీ ఈవెంట్ ను ఏర్పాటు చేశారు రాజమౌళి. అలాగే ఈ ఈవెంట్ లోనే మహేష్ బాబు లుక్‌తో పాటు టైటిల్‌ను కూడా అనౌన్స్ చేశారు. వారణాసి అనే టైటిల్ తో ఈ సినిమా తెరకెక్కుతుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. భారీ యాక్షన్-అడ్వెంచర్ చిత్రంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. అలాగే ఈ సినిమా ఆఫ్రికన్ అడవుల నేపథ్యంలో సాగే కథ అని, ఇందులో మహేష్ బాబు ఒక పవర్‌ఫుల్ పాత్రలో కనిపించనున్నాడని టాక్ నడుస్తోంది. ఇక ఈ సినిమా నుంచి కొన్ని ఫోటోలు లీక్ అయ్యి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

ఇది కూడా చదవండి : ఆమె నా సినిమాలో చేయకపోవడమే మంచిదైంది.. స్టార్ హీరోయిన్ పై రాజమౌళి

ఈ సినిమాలో గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా హీరోయిన్ గా నటిస్తుంది. అలాగే ఈ సినిమాలో పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. రాజమౌళి ఈ సినిమాని పాన్-ఇండియా స్థాయి దాటి అంతర్జాతీయ స్థాయిలో తీసుకెళ్లాలని ప్లాన్ చేస్తున్నాడు. ఈ సినిమాను ఏకంగా 120కు పైగా దేశాల్లో విడుదల చేయనున్నారు రాజమౌళి. హాలీవుడ్ నటులు, టెక్నీషియన్లు కూడా ఈ ప్రాజెక్టులో భాగమయ్యారని తెలుస్తుంది. ఇదిలా ఉంటే మహేష్ బాబును ఓ హీరోయిన్ అన్న అన్న అని పిలిచేదట.. ఇంతకూ ఆమె ఎవరో తెలుసా..?

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి : రెండే రెండు సినిమాలు హిట్. మిగిలినవన్నీ ఫ్లాప్.. దెబ్బకు మాయం అయ్యింది

తాజాగా సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతుంది. మహేష్ బాబు సినిమాలో యంగ్ హీరోయిన్ శ్రీదివ్య చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించింది. మహేష్ నటించిన యువరాజు సినిమాలో శ్రీదివ్య చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించింది. ఓ ఈవెంట్‌లో మహేష్ బాబు శ్రీదివ్యను ఎత్తుకున్న ఫోటో పై  శ్రీదివ్య స్పందించింది. చిన్న వయసులో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించా.. ఆ సమయంలో నేను మహేష్ బాబును అన్నయ్య, అన్నయ్యా.. అంటూ ఉండేదాన్ని. నాకు ఆయన చాక్లెట్స్ ఇచ్చేవారు అని శ్రీదివ్య తెలిపింది. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఇది కూడా చదవండి : ఇది కదా సినిమా అంటే..! పెట్టింది రూ. 16 కోట్లు.. వచ్చింది రూ.400కోట్లు..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.