Ram Charan: రామ్ చరణ్‌తో ఉన్న ఈ అమ్మాయి ఇప్పుడు చాలా ఫెమస్.. ఎంతోమంది స్టార్ హీరోలతో పనిచేసింది

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న పెద్ది సినిమా కోసం ఫ్యాన్స్ ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా పై ఇప్పటికే అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత చరణ్ నటించిన గేమ్ ఛేంజర్ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. శంకర్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా భారీ అంచనాల మధ్య విడుదలైంది.

Ram Charan: రామ్ చరణ్‌తో ఉన్న ఈ అమ్మాయి ఇప్పుడు చాలా ఫెమస్.. ఎంతోమంది స్టార్ హీరోలతో పనిచేసింది
Ram Charan

Updated on: Jul 29, 2025 | 10:26 AM

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఫ్యాన్స్ గురించి ఆయన క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దేశవ్యాప్తంగానే కాదు ప్రపంచవ్యాప్తంగా చరణ్ కు అభిమానులున్నారు. ఆర్ఆర్ఆర్ సినిమాతో విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకున్నారు చరణ్. ఈ సినిమా తర్వాత చరణ్ గ్లోబల్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక ఇప్పుడు వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. ఇదిలా ఉంటే చరణ్ కు సంబందించిన ఓ ఫోటో ఇప్పుడు వైరల్ గా మారింది. పై ఫొటోలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో ఉన్న అమ్మాయిని గుర్తుపట్టారా.? ఆమె ఇప్పుడు చాలా ఫెమస్.. ఇంతకు ఆమె ఎవరో గుర్తిపట్టరా..

ఇది కూడా చదవండి : బాబోయ్..! మేడం మెంటలెక్కించింది..! సీరియల్ బ్యూటీ షేక్ చేస్తుందిగా..!!

సెలబ్రెటీలకు సంబందించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం చాలా కామన్. చాలా మంది ఫ్యాన్స్ తమ అభిమాన హీరోతో ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకుంటుంటారు. తాజాగా రామ్ చరణ్ అభిమాని పై ఫోటోను షేర్ చేసింది. ఇంతకు ఆ అభిమాని ఎవరో గుర్తుపట్టారా.? పైనున్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇంతకు పై ఫొటోలో చరణ్ తో ఉన్న అమ్మాయి డాన్స్ చేస్తే టాలీవుడ్ షేక్ అవుతుంది.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి :మర్యాద రామన్నలో కనిపించిన ఈ కుర్రాడు గుర్తున్నాడా.? అతను ఇప్పుడు టాలీవుడ్ హీరో..

పై ఫొటోలో రామ్ చరణ్ తో ఉన్న అమ్మాయి మరెవరో కాదు. ప్రముఖ కొరియోగ్రాఫర్ అనీ మాస్టర్. టాలీవుడ్ లో లేడీ కొరియోగ్రాఫర్ గా పేరు తెచ్చుకుంది అనీ మాస్టర్. ఎన్నో సినిమాల్లో పాటలకు ఆమె కొరియోగ్రాఫ్ చేశారు. అలాగే బిగ్ బాస్ లోనూ పాల్గొన్నారు అనీ మాస్టర్. బిగ్ బాస్ 5లో పాల్గొన్నారు అనీ మాస్టర్. తన గేమ్ తో ప్రేక్షకులను మెప్పించింది అనీ మాస్టర్. ఇక చరణ్ సినిమాల విషయానికొస్తే ఇటీవలే గేమ్ ఛేంజర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమాకు శంకర్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. అలాగే బుచ్చి బాబు సనా దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాకు పెద్ది అనే టైటిల్ ను ఖరారు చేశారు. అలాగే సుకుమార్ దర్శకత్వంలోనూ ఓ సినిమా చేస్తున్నాడు చరణ్.

ఇది కూడా చదవండి :నాగ చైతన్య ఫస్ట్ మూవీలో కనిపించిన ఈ నటి గుర్తుందా..?ఇప్పుడు చూస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.