ఈ ఫొటోలో దుల్కర్, విజయ్‌తో ఉన్న అమ్మాయి ఎవరో తెలుసా.? ఆమె చాలా ఫేమస్ గురూ..!

విజయ్ దేవరకొండ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎలాంటి బ్యాగ్రౌండ్ సపోర్ట్ లేకుండా సినీరంగంలోకి అడుగుపెట్టి మొదట్లో చిన్న చిన్న పాత్రలు పోషించారు. పెళ్లి చూపులు సినిమాతో హీరోగా మారిన విజయ్.. అర్జున్ రెడ్డి మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. రీసెంట్‌గా కింగ్ డమ్ సినిమాతో హిట్ అందుకున్నారు విజయ్.

ఈ ఫొటోలో దుల్కర్, విజయ్‌తో ఉన్న అమ్మాయి ఎవరో తెలుసా.? ఆమె చాలా ఫేమస్ గురూ..!
Dulquer , Vijay

Updated on: Aug 16, 2025 | 12:37 PM

మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ ఇప్పుడు మన టాలీవుడ్ హీరో అయ్యాడు. మలయాళ భాషలో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు చేసిన దుల్కర్.. ఇప్పుడు వరుసగా తెలుగులో సినిమాలు చేస్తున్నాడు. మణిరత్నం దర్శకత్వం వహించిన ఒకే బంగారం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యాడు ఈ యంగ్ హీరో.. ఆ తర్వాత నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వచ్చిన మహానటి సినిమాలో జెమిని గణేశన్ పాత్రలో నటించి మెప్పించారు. ఈ సినిమాతోనే దుల్కర్ మన తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. ఈ సినిమా తర్వాత తెలుగు దర్శకుడు హను రాఘవపూడి దర్శకత్వం వహించిన సీతారామం సినిమా చేశాడు. ఈ సినిమా ఇండస్ట్రీలో క్లాసిక్ హిట్ గా నిలిచింది. ఈ సినిమాలో లెఫ్టనెంట్ రామ్ పాత్రలో అద్భుతంగా నటించాడు దుల్కర్. అలాగే లక్కీ భాస్కర్ అనే సినిమాతో మరో హిట్ అందుకున్నాడు. ఇక ఇప్పుడు కాంత అనే సినిమాతో రానున్నాడు.

Chiranjeevi: అన్నయ్య నాకు దేవుడు.. లక్షరూపాయిల కోసం ఫోన్ చేస్తే కోటి ఇచ్చారు..

మొన్నామధ్య విడుదలైన లక్కీ భాస్కర్ సినిమాకు కూడా మన టాలీవుడ్ దర్శకుడు వెంకీ అట్లూరి దర్శకత్వం వహించాడు. దీపావళి కానుకగా విడుదలైన లక్కీ భాస్కర్ సినిమా సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. ఈ సినిమాలో మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటించింది. ఆకట్టుకునే కథనంతో తెరకెక్కిన లక్కీ భాస్కర్ సినిమాలో దుల్కర్ మరోసారి తన నటనతో ఆకట్టుకున్నాడు. ఈ సినిమా రిలీజ్ కు ముందు ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించింది మూవీ టీమ్.

ఇవి కూడా చదవండి

11ఏళ్ల తర్వాత రీ ఎంట్రీ ఇస్తున్న హీరోయిన్.. అప్పుడు కుర్రాళ్ళ డ్రీమ్ గర్ల్ ఇప్పుడు ఎలా ఉందంటే..

ఆ ఈవెంట్ కు రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ గెస్ట్ గా హాజరయ్యాడు. కాగా ఈ ఈవెంట్ ఓ అమ్మాయి. విజయ్, దుల్కర్ తో కలిసి ఇలా ఫోటోలకు ఫోజులిచ్చింది. ఆ ఫోటో ఇప్పుడు మరోసారి చక్కర్లు కొడుతుంది. ఇంతకూ ఆమె ఎవరో తెలుసా.?పై ఫొటోలో విజయ్, దుల్కర్ తో ఉన్న చిన్నది చాలా ఫేమస్. ఆమె ఎవరో కాదు జస్లీన్ రాయల్ ఈ అమ్మడి పూర్తి పేరు జస్లీన్ కౌర్ రాయల్. ఈ అమ్మడు గాయని,  పాటల రచయిత అలాగే స్వరకర్త కూడా.. పంజాబీ , హిందీ , బెంగాలీ , గుజరాతీ అలాగే ఇంగ్లిష్ లోనూ పాటలు పాడింది. అంతే కాదు 2022లో, షేర్షా (2021) చిత్రానికి ఉత్తమ సంగీత దర్శకురాలిగా ఫిల్మ్‌ఫేర్ అవార్డును కూడా  గెలుచుకుంది. ఫిల్మ్‌ఫేర్ చరిత్రలో మొదటి మహిళా సంగీత దర్శకురాలిగా ఆమె గుర్తింపు పొందింది. దుల్కర్ సల్మాన్ తో కలిసి హీరియే.. హీరియే అనే సాంగ్ చేసింది. ఈసాంగ్ ఎంత పాపులర్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ చిన్నది. ఇలా దుల్కర్, విజయ్ లతో ఫోటోలు దిగి సోషల్ మీడియాలో పంచుకుంది. మరోసారి ఈ ఫోటో వైరల్ అవుతుంది. విజయ్ దేవరకొండ ఇటీవలే కింగ్‌‌డమ్ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నాడు.

చూస్తే దిమాక్ ఖరాబ్ అవ్వాల్సిందే..! వర్షాకాలంలో వేడిపుట్టిస్తున్న సినిమా.. ఒంటరిగా మాత్రమే చూడండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.