
బాలీవుడ్ చాక్లెట్ బాయ్ రణబీర్ మొన్నామధ్య బ్రహ్మాస్త్ర సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు. భారీ అంచనాల మధ్య విడుదలైన బ్రహ్మాస్త్ర సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. ఇక ఇప్పుడు యానిమల్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. తాజాగా రణబీర్ కపూర్ పుట్టినరోజు సందర్భంగా ‘యానిమల్’ టీజర్‌ను విడుదల చేశారు. రణబీర్ కపూర్ మునుపెన్నడూ చూడని రగడ్ అవతార్‌లో కనిపించనున్నాడు. చాలా మాస్ ఎలిమెంట్స్ తో చాలా డిఫరెంట్ స్టోరీగా ఇది ఉండబోతోందని టీజర్ చూస్తే అర్ధమవుతుంది. ఈ టీజర్ తోనే సినిమా పై అంచనాలను పెంచేశారు దర్శకుడు. ఇదిలా ఉంటే యానిమల్ సినిమాను ముందుగా మరో హీరోతో చేయాలనీ అనుకున్నారట. అది కూడా మన టాలీవుడ్ హీరోతో.. ఇంతకు ఆయన ఎవరంటే..
‘అర్జున్ రెడ్డి’ సినిమాకి దర్శకత్వం వహించి పాపులర్ అయిన సందీప్ రెడ్డి వంగా ‘యానిమల్’ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. రణబీర్ కపూర్‌కి ‘యానిమల్’ సినిమా కథ చెప్పడానికి ముందు అదే కథను తెలుగు స్టార్ హీరోకు వినిపించాడట సందీప్. ఆయన ఎవరో కాదు సూపర్ స్టార్ మహేష్ బాబు. కానీ కథ విన్న మహేష్ బాబు తనకు ఈ కథ సూట్ అవ్వదు అని చెప్పాడంతో సందీప్ రెడ్డి వంగా రణబీర్‌కి చెప్పాడట. అయితే మహేష్ బాబు తనకు సూట్ అయ్యే కథను సిద్ధం చేయమని సందీప్ కు చెప్పాడట. మరి ఈ వార్తల్లో వాస్తవమెంత అన్నది తెలియదు కానీ. ఇప్పుడు ఇదే న్యూస్ ఫిలిం సర్కిల్స్ లో వైరల్ అవుతుంది.
‘అర్జున్ రెడ్డి’ సినిమా తర్వాత సందీప్ రెడ్డి వంగా అదే సినిమాను హిందీ రీమేక్ ‘కబీర్ సింగ్’ చిత్రానికి కూడా దర్శకత్వం వహించారు. కపూర్ ప్లేబాయ్, లవర్ బాయ్ పాత్రలు పోషించి అలసిపోయిన రణబీర్ కపూర్.. నటనకు కూడా స్కోప్ ఉన్న ‘యానిమల్’ సినిమాను వెంటనే ఓకే చేశారట. ‘యానిమల్’ సినిమాలో రణబీర్ డిఫరెంట్ షేడ్స్ లో కనిపించనున్నాడు. ఈ సినిమాలో రణ్‌బీర్ తండ్రి పాత్రలో అనిల్ కపూర్ నటించారు. అతని పాత్ర కూడా చాలా డిఫరెంట్‌గా ఉండనుంది. ‘యానిమల్’ చిత్రంలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుంది. బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ ‘యానిమల్’ సినిమాలో విలన్ పాత్రలో కనిపించనున్నాడు. డిసెంబర్ 1న ‘యానిమల్’ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..