పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. బాహుబలి సిరీస్ సినిమాలతో అతని క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. మధ్యలో కొన్ని పరాజయాలు ఎదురైనా సలార్, కల్కి సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్స్ అందుకున్నాడీ యంగ్ రెబల్ స్టార్. ఇప్పుడు ప్రభాస్ కు విదేశాల్లో కూడా ఫ్యాన్స్ ఉన్నారు. హీరోగా ప్రభాస్ కెరీర్‌లో ఎన్నో బ్లాక్ బస్టర్లు, సూపర్ హిట్ సినిమాలు ఉండచ్చు. అయితే అతని కెరీర్ ను మలుపు తిప్పిన సినిమా మాత్రం వర్షం అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ సినిమాకు ముందు ప్రభాస్ కెరీర్ లో సూపర్ హిట్స్ లేవు. ఈశ్వర్, రాఘవేంద్ర సినిమాలు ప్రభాస్ కు మంచి పేరు తీసుకొచ్చినా కమర్షియల్ గా మాత్రం వర్కవుట్ కాలేదు. అలాంటి ప్రభాస్ కు వర్షం రూపంలో మొదటి సూపర్ డూపర్ హిట్ సినిమా పడింది. దివంగత దర్శకుడు శోభన్ తెరకెక్కించిన ఈ రొమాంటిక్ యాక్షన్ ఎంటర్ టైనర్ లో బ్యూటీ క్వీన్ త్రిష హీరోయిన్ గా నటించింది. విలన్ గా హీరో గోపీచంద్ అద్భుతమైన నటనతో ఆకట్టుకున్నాడు. ఈ ముగ్గురికీ కెరీర్ పరంగా ఒక మైల్డ్ స్టోన్ లా వర్షం సినిమా నిలిచిపోయింది. కాగా ఈ సినిమా రిలీజ్ అయ్యి ఈ ఏడాదికి 20 ఏళ్లు పూర్తయ్యాయి. 2004 జనవరి 14న రిలీజైన వర్షం సినిమాకు కలెక్షన్ల వర్షం కురిసింది.
ఇదిలా ఉంటే వర్షం సినిమాకు సంబంధించి ఒక ఆసక్తికరమైన విషయం వెలుగులోకి వచ్చింది. అదేంటంటే.. ఈ సినిమాకు హీరో గా ప్రభాస్ ఫస్ట్ ఛాయిస్ కాదట. డైరెక్టర్ శోభన్ ప్రభాస్ కన్నా ముందు మరొక హీరోతో వర్షం మూవీని తెరకెక్కించాలని భావించాడట. ఆ హీరో మరెవరో కాదు మన టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు. అందుకు తగ్గట్టుగానే వర్షం సినిమా కథను మొదట మహేశ్ కే వినిపించారట. అయితే ఎందుకో గానీ మహేశ్ ఈ సినిమాపై పెద్దగా ఆసక్తి చూపించలేదట. కట్ చేస్తే అదే స్టోరీని ప్రభాస్ కు వినిపించారట శోభన్. స్టోరీని విని బాగా ఇంప్రెస్ అయిపోయిన డార్లింగ్ వెంటనే సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. అలా ప్రభాస్ కెరీర్ లో వర్షం రూపంలో మొదటి బ్లాక్ బస్టర్ చేరింది. కాగా వర్షం సినిమాకు మూడు నంది పురస్కారాలు రావడం విశేషం.
Shape your story! #OTTO pic.twitter.com/XuCd7RI0BK
— Mahesh Babu (@urstrulyMahesh) April 2, 2024
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.