పెద్ద హీరోలు,యాక్షన్ సీన్స్, స్పెషల్ సాంగ్స్ లేవు.. రూ.4కోట్లతో తెరకెక్కి బడా సినిమాలను కూడా బీట్ చేసింది

చిన్న సినిమాలు మంచి విజయాలను అందుకుంటూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ఆకట్టుకునే కథ ఉంటే సినిమాలు మంచి విజయాలను సొంతం చేసుకోవడమతొ పాటు రికార్డ్స్ క్రియేట్ చేస్తున్నాయి. తాజాగా ఓ సినిమా ఊహించని విజయం సాధించింది థియేటర్స్ లో కలెక్షన్స్ వర్షం కురిపిస్తుంది. ఇంతకూ ఆ సినిమా ఎదో తెలుసా..?

పెద్ద హీరోలు,యాక్షన్ సీన్స్, స్పెషల్ సాంగ్స్ లేవు.. రూ.4కోట్లతో తెరకెక్కి బడా సినిమాలను కూడా బీట్ చేసింది
Movie

Updated on: Aug 13, 2025 | 7:56 AM

కొన్ని సినిమాలు ఎప్పుడు వచ్చాయో.. ఎప్పుడు వెళ్లిపోయాయో చెప్పడం కష్టమే.. ఇప్పుడున్న పరిస్థితుల్లో భారీ బడ్జెట్ సినిమాలైనా సరే కథ ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోతే నాలుగు రోజులకే థియేటర్స్ నుంచి కనిపించకుండా పోతున్నాయి. ఇక మంచి కథతో తెరకెక్కిన చిన్న సినిమాలు మాత్రం బ్లాక్ బస్టర్ హిట్స్ అవుతున్నాయి. అంతే కాదు అవార్డ్స్ కూడా కొల్లగొడుతున్నాయి చిన్న సినిమాలు.. ఇప్పుడు అలాంటి ఓ చిన్న సినిమానే బాక్సాఫీస్ ను షేక్ చేస్తుంది. ఇది కథ సినిమా అంటే అని క్రిటిక్స్ కూడా బల్లగుద్ది చెప్తున్నారు. పెద్ద పెద్ద హీరోలు లేరు, స్పెషల్ సాంగ్స్ , యాక్షన్ సీన్స్ లేవు కానీ థియేటర్స్ లో కలెక్షన్స్ వర్షం కురిపిస్తుంది ఈ సినిమా.. బడ్జెట్ రూ. 4 కోట్లు… 18 రోజుల్లోనే దాదాపు రూ.70కోట్లు వరకు రాబట్టింది.

ఇదికూడా చదవండి : ఏం పార్థు నన్నే మర్చిపోయావా..? నేను నీ పద్దుని.. ఎంత మారిపోయింది ఈ చిన్నది..

చిన్న సినిమా అయినా పాన్ ఇండియా రేంజ్ లో హిట్ అందుకుంది ఈ సినిమా.. ఆ సినిమా ఎదో కాదు రీసెంట్ బ్లాక్ బస్టర్ సూ ఫ్రమ్ సో. కన్నడలో తెరకెక్కిన ఈ సినిమా ఇప్పుడు బాక్సాఫీస్ ను షేక్ చేస్తుంది. విడుదలైన అన్ని భాషల్లో మంచి విజయాన్ని అందుకుంటుంది. విడుదలకు ముందు ఎలాంటి అంచనాలు లేకూండా వచ్చిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. జె.పి. తూమినాడ్  దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. కథ, స్క్రీన్‌ప్లే, డైరెక్షన్ అందించడమే కాకుండా హీరోగానూ చేశాడు తూమినాడ్ . అలాగే ఈ సినిమాకు కన్నడ స్టార్ రాజ్ బి శెట్టి నిర్మాతగా వ్యవహరించడంతో పాటు సినిమాలోనూ నటించారు.

ఇదికూడా చదవండి :143 Movie : ఎన్నాళ్లకు కనిపించింది..!! 143 హీరోయిన్ ఇప్పుడు ఎలా ఉందో చూశారా..

ఈ సినిమాను నిజ జీవిత సంఘటనల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. హిలేరియస్ కామెడీ, ఎమోషన్స్ తో పాటు సోషల్ మెసేజ్ కూడా ఇచ్చారు. ఇక ఈ సినిమాకు దర్శకుడు 26 సార్లు రాశాడట.. ఫైనల్ గా కథను అద్భుతంగా తెరకెక్కించాడు. కన్నడలో రిలీజ్ అయిన ఈ సినిమా.. ఇతర భాషల్లోనూ రిలీజ్ అయ్యి హిట్ అయ్యింది. ఈ సినిమా విడుదలైన 18వ రోజు నాటికి కలెక్షన్లు రూ.65.92 కోట్ల వరకు వసూల్ చేసి రికార్డ్ క్రియేట్ చేసింది. తెలుగులో ఈ సినిమాను ఆగస్టు 8న విడుదలైంది. మెల్లగా కలెక్షన్స్ స్టార్ట్ చేసి ఇప్పుడు రోజు రోజుకు కలెక్షన్స్ ఎంచుకుంటూ దూసుకుపోతుంది. ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. చాలా మంది ఈ సినిమా ఓటీటీలో చూడాలని చాలా మంది ఎదురుచూస్తున్నారు.

ఇవి కూడా చదవండి

ఇదికూడా చదవండి : 53 సినిమాలు చేసింది.. హీరోయిన్‌గానే కాదు స్పెషల్ సాంగ్స్‌లోనూ దుమ్మురేపింది.. ఈ అమ్మడు ఎవరో తెలుసా.?

మరిన్ని సినిమా వార్తలకోసం ఇక్కడ క్లిక్ చేయండి