ఫ్లాప్స్‌తో సతమతమవుతున్న హీరో నితిన్‌ను మళ్లీ సక్సెస్ ట్రాక్‌పైకి ఎక్కించిన సినిమాలలో ఒకటి ‘గుండె జారి గల్లంతయ్యిందే’. దర్శకుడు విజయ్ కుమార్ కాంబినేషన్‌లో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకుంది. 2013లో విడుదలైన ఈ చిత్రంలో నితిన్ సరసన నిత్యామీనన్, ఇషా తల్వార్ హీరోయిన్లుగా నటించారు. ఈ చిత్రం సూపర్ హిట్ అందుకున్నా.. హీరోయిన్‌గా ఇషాకు మాత్రం తెలుగులో పెద్దగా అవకాశాలు రాలేదు. ఇంకో ఆసక్తికర విషయమేంటంటే.. ఈ మూవీలో ఇషా తల్వార్‌కు నిత్యామీనన్ డబ్బింగ్ చెప్పింది. మరి ఇప్పుడు ఇషా తల్వార్ ఏం చేస్తోంది.? ఎలా ఉందో ఇప్పుడు తెలుసుకుందామా..
బాలీవుడ్ నటుడు వినోద్ తల్వార్ తనయ ఇషా తల్వార్. మోడలింగ్ ద్వారా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఇషా.. కెరీర్ తొలినాళ్లలో 40కిపైగా బ్రాండ్స్‌కు సంబంధించిన యాడ్స్‌లో నటించింది. చైల్డ్ ఆర్టిస్టుగానూ పలు చిత్రాల్లో చేసింది. ‘తట్టతిన్ మరయతు’ అనే మలయాళ సినిమాతో సినీ ఇండస్ట్రీలోకి హీరోయిన్‌గా అడుగుపెట్టింది. తెలుగులో ‘గుండె జారి గల్లంతయ్యిందే’, ‘మైనే ప్యార్ కియా’, ‘రాజా చెయ్యి వేస్తే’ వంటి చిత్రాల్లో నటించింది.
ఎక్కువగా మలయాళం సినిమాల్లో మెరిసిన ఈ బ్యూటీ.. హిందీలోనూ పలు చిత్రాల్లో నటించింది. ప్రస్తుతం ఈ బ్యూటీ వెబ్ సిరీస్‌లతో ఫుల్ బిజీగా ఉంది. ‘మిర్జాపూర్’ సిరీస్‌లో మాధురి యాదవ్ పాత్రతో బాగా ఫేమస్ అయింది. ఈ ముద్దుగుమ్మ ఇన్‌స్టా ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. లేట్ ఎందుకు వాటిపై ఓ లుక్కేయండి.
ఇది చదవండి: పంజా మూవీ హీరోయిన్ ఇప్పుడెలా ఉందో చూశారా.? పిచ్చెక్కించేంత హాట్‌గా
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి