Tollywood: ఒకప్పుడు షార్ట్‌ ఫిల్మ్స్‌ చేశాడు.. ఇప్పుడీ టాలీవుడ్ హీరో ఇంట్లో 4 లగ్జరీ కార్లు, 10 బైక్స్.. ఎవరో తెలుసా?

విశాఖపట్నంలో పుట్టి పెరిగాడు. అక్కడే చదువుకున్నాడు. మెకానికల్ ఇంజినీరింగ్ లో డిగ్రీ పట్టా పొందాడు. అదే క్రమంలో సినిమాలపై ఆసక్తితో షార్ట్ ఫిల్మ్స్ తో కెరీర్ ప్రారంభించాడు. యూట్యూబర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అదే పాపులారిటీతో తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు.

Tollywood: ఒకప్పుడు షార్ట్‌ ఫిల్మ్స్‌ చేశాడు.. ఇప్పుడీ టాలీవుడ్ హీరో ఇంట్లో 4 లగ్జరీ కార్లు, 10 బైక్స్.. ఎవరో తెలుసా?
Tollywood Actor

Updated on: Oct 14, 2025 | 8:57 PM

సినిమా సెలబ్రిటీల ఇంట్లో లగ్జరీ కార్లు, బైక్లు ఉండడం ఆశ్చర్యకరమైన విషయమేమీ కాదు. సినిమా ఇండస్ట్రీలో ఉండే అందరి వద్ద ఈ రేంజ్ కార్లు, బైక్స్ ఉంటాయి. కానీ ఈ నటుడు సినిమాల్లోకి వచ్చి కొన్నేళ్లే అయ్యింది. విశాఖ పట్నంలో పుట్టి పెరిగిన అతను 2012లో మెకానికల్ ఇంజినీరింగ్ లో డిగ్రీ పూర్తి చేశాడు. ఆ తర్వాత షార్ట్ ఫిల్మ్స్ తో కెరీర్ ప్రారంభించాడు. డిఫరెంట్ కాన్సెప్ట్ తో వీడియోలు చేస్తూ అందరినీ కడుపుబ్బా నవ్వించాడు. యూట్యూబర్ గా ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు. అదే క్రేజ్ తో తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు. చాలా సినిమాల్లో కమెడియన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా నవ్వులు పంచాడు. స్టార్ హీరోలకు ఫ్రెండ్ గా నటించి ఆడియెన్స్ మెప్పు పొందాడు. అలాగే హీరోగానూ మారి అదృష్టం పరీక్షించుకుంటున్నాడు. ఈ నటుడి ట్యాలెంట్ తెలిసి మాస్ మహరాజా రవితేజ ఇతనిని హీరోగా పెట్టి ఓ సినిమా నిర్మించడం విశేషం. ప్రస్తుతం టాలీవుడ్ లో బిజీ బిజీగా ఉంటోన్న నటుల్లో ఇతను కూడా ఒకడు.

అయితే ఇటీవల దసరా ఆయుధ పూజ సందర్భంగా ఈ టాలీవుడ్ నటుడి గురించి ఒక ఆసక్తికర విషయం తెలిసింది. అదేంటంటే.. ఈ కమెడియన్ ఇంట్లో ఇప్పటికే 4 లగ్జరీ కార్లు, 10 బైక్స్ ఉన్నాయట. ఈ విషయం తెలిసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. షార్ట్ ఫిల్మ్స్ తో కెరీర్ ప్రారంభించి సిల్వర్ స్క్రీన్ దాకా చేరుకున్న ఈ నటుడి సక్సెస్ కు ఇది నిదర్శనమంటూ సినీ అభిమానులు, నెటిజన్లు ఈ నటుడిపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ‘అన్నా నీ రేంజ్ మారిపోయింది’ అంటూ కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు. ఇంతకీ ఆ నటుడెవరో తెలుసా? ఫేమస్ కమెడియన్ వైవా హర్ష.

ఇవి కూడా చదవండి

 

వీడియో ఇదిగో..

వైవా హర్షగా గుర్తింపు తెచ్చుకున్న హర్ష చెముడు 2013లో మసాలా సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు. మైనే ప్యార్‌కియా, పవర్‌, గోవిందుడు అందరివాడేలే, సూర్య వర్సెస్‌ సూర్య, సైజ్‌ జీరో, దోచేయ్‌, శంకరా భరణం, జక్కన్న, ఎక్కడికి పోతావు చిన్నవాడా, రాజా ది గ్రేట్‌, నక్షత్రం, జై లవకుశ, తొలి ప్రేమ, తేజ్‌ ఐ లవ్యూ, భానుమతి అండ్‌ రామకృష్ణ, కార్తికేయ 2, బింబిసార, బేబీ, ఊరుపేర భైరవ కోన, గేమ్‌ ఛేంజర్‌, తండేల్‌, సారంగపాణి జాతకం, జూనియర్‌, బకాసుర రెస్టారెంట్‌ చిత్రాల్లో మెరిశాడీ హర్ష. అలాగే సుందరం మాస్టర్ సినిమాతో హీరోగా కూడా మారాడు. ప్రస్తుతం హర్ష పలు సినిమా షూటింగులతో బిజి బిజీగా ఉంటున్నాడు.

భార్య అక్షరతో..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.