Bollywood: అతను పాట పాడితే ప్రపంచమే ఓలలాడదా..? ఒక్క గంట షోకు కోట్లు ఇవ్వాల్సిందే.. ఎవరంటే..
ప్రేమలో ముక్కలైన హృదయాలకు అతడి పాట ఓదార్పు.. అద్భుతమైన గాత్రం అతడికి దేవుడిచ్చిన వరం. ఎలాంటి సపోర్ట్ లేకుండానే రియాల్టీ షో ద్వారా సంగీత ప్రపంచంలోకి అడుగుపెట్టిన అతడు.. ఇప్పుడు ఇండియాలోనే టాప్ సింగర్‌గా పాపులర్ అయ్యాడు. బాలీవుడ్, టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎన్నో సూపర్ హిట్ సాంగ్స్ ఆలపించి సంగీత ప్రియులను మైమరపించాడు. అతడి లైవ్ ఈవెంట్ షోస్ కోసం లక్షలాది మంది అభిమానులు ఎదురుచూస్తుంటారు.

ప్రేమలో ముక్కలైన హృదయాలకు అతడి పాట ఓదార్పు.. అద్భుతమైన గాత్రం అతడికి దేవుడిచ్చిన వరం. ఎలాంటి సపోర్ట్ లేకుండానే రియాల్టీ షో ద్వారా సంగీత ప్రపంచంలోకి అడుగుపెట్టిన అతడు.. ఇప్పుడు ఇండియాలోనే టాప్ సింగర్‌గా పాపులర్ అయ్యాడు. బాలీవుడ్, టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎన్నో సూపర్ హిట్ సాంగ్స్ ఆలపించి సంగీత ప్రియులను మైమరపించాడు. అతడి లైవ్ ఈవెంట్ షోస్ కోసం లక్షలాది మంది అభిమానులు ఎదురుచూస్తుంటారు. అతడి ఒక్క సంగీత కచేరి కోసం కోట్లలో ఖర్చు చేసేందుకు సైతం నిర్వాహకులు ముందుంటారు. అతడు మరెవరో కాదు.. బాలీవుడ్ టాప్ సింగర్ అర్జిత్ సింగ్. ఈ పేరు చెప్పగానే హిందీలో అనేక పాటలు గుర్తుకు వస్తాయి. కేసరియా, చన్నా మేరేయే, ఏ దిల్ హై ముష్కిల్, తుమ్ హి హో వంటి సూపర్ హిట్ సాంగ్స్ ఆలపించాడు. ఏప్రిల్ 25న అర్జిత్ సింగ్ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయనకు సోషల్ మీడియా వేదికగా సినీ ప్రముఖులు, అభిమానులు బర్త్ డే విషెస్ తెలుపుతున్నారు.
పశ్చిమ బెంగాల్‌లోని ముర్షిదాబాద్ జిల్లాలోని జియాగంజ్‌లో 1987లో జన్మించాడు అర్జిత్. చిన్నప్పటి నుంచే సంగీతాన్ని ఇష్టపడడం స్టార్ట్ చేశాడు. అతడి ఇష్టాన్ని గమనించిన తల్లిదండ్రులు సంగీతంలో శిక్షణ ఇప్పించారు. 18 ఏళ్ల వయసులో 2005లో సింగింగ్ రియాల్టీ షో ఫేమ్ గురుకుల్లో పాల్గొన్నాడు. కానీ ఈ షోలో అతడు తక్కువ సమయంలోనే ఎలిమినేట్ అయ్యాడు. 2010లో అర్జిత్ సింగ్ చేసిన తోసే నైనా మ్యూజిక్ వీడియోకు మంచి రెస్పాన్స్ వచ్చింది. అందులో అర్జిత్ సింగ్ వాయిస్ మెస్మరైజ్ చేసింది. దీంతో హిందీలో నెమ్మదిగా అవకాశాలు రావడం ప్రారంభమయ్యాయి. 2011లో మర్డర్ 2 సినిమాతో బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు. ఆషికి 2 సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయ్యాడు. ఆ తర్వాత అతడు వెనుదిరిగి చూడలేదు.
ఇప్పుడు అర్జిత్ సింగ్ పాట పాడితే ఆ సినిమా సూపర్ హిట్ అనే స్థాయికి అతడి క్రేజ్ వెళ్లిపోయింది. సినిమాల్లో ఒక్కో పాటకు దాదాపు రూ. 10 లక్షల వరకు పారితోషికం తీసుకుంటాడు. అలాగే అతడు సింగింగ్ లైవ్ షో కోసం రూ. 1.5 కోట్లు రెమ్యునరేష్ తీసుకుంటాడు. అర్జిత్ సింగ్ నికర విలువ దాదాపు 7 మిలియన్ డాలర్స్. అంటే మన దేశ కరెన్సీ ప్రకారం రూ. 55 కోట్లు. ముంబైలోని ప్రధాన ప్రాంతంలో ఉంటాడు. ఆయన ఇంటి ఖరీదు దాదాపు రూ. 8 కోట్లు. అర్జిత్ వద్ద హమ్మర్, రేంజ్ రోవర్, మెర్సిడెస్ బెంజ్ వంటి లగ్జరీ కార్లు ఉన్నాయి. కోట్లకు అధిపతి అయినా అర్జిత్ ఎప్పుడూ సింప్లిసిటిని ఇష్టపడుతుంటాడు.
ఇప్పటివరకు తెలుగు, హిందీలో మొత్తం 655లకు పైగా పాటలు పాడాడు. ఇప్పుడు ఇండస్ట్రీలో టాప్ మోస్ట్ సింగర్ అయినా.. అర్జి్త్ వ్యక్తిగత జీవితంలో అనేక ఒడిదుడుకులు ఎదుర్కొన్నాడు. మొదటి భార్యతో విడాకులు కావడం.. ఆ తర్వాత తన చిన్ననాటి స్నేహితురాలిని పెళ్లి చేసుకున్నాడు. ఫేమ్ గురుకుల్ రియాల్టీ షోలో పరిచయమైన రూపేఖా బెనర్జీని వివాహం చేసుకున్నాడు. కానీ వీరిద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో డివోర్స్ తీసుకున్నారు. ఆ తర్వాత చిన్ననాటి స్నేహితురాలు కోయెల్ రాయ్ ను రెండో వివాహం చేసుకున్నాడు. ప్రస్తుతం ఇన్ స్టా రీల్స్‌లో తెగ ట్రెండ్ అవుతున్న మెలోడీ “అణువణును అలలెగసెయ్ తెలియని ఓ ఆనందమే.. కనులేదటే నిలిచెనుగా మనాసేతికే నా స్వప్నమే.. ” అంటూ సాగే పాటను అర్జిత్ సింగ్ ఆలపించాడు.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.