Cinema : ఏం ట్విస్టులు రా బాబూ.. దెబ్బకు మైండ్ బ్లాక్.. సైకలాజికల్ హారర్ సినిమా.. ఒంటరిగా చూడలేరు..

హారర్ సినిమాలకు ప్రత్యేక ఫ్యాన్ బేస్ ఉంటుంది. చాలా సంవత్సరాలుగా ఈ జానర్ చిత్రాలకు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది. వణుకుపుట్టించే సస్సెన్స్ ఉన్నప్పటికీ ఈ జానర్ సినిమాలు చూసేందుకు జనాలు తెగ ఆసక్తి చూపిస్తున్నారు. చాలా సంవత్సరాల క్రితం విడుదలైన హారర్ సినిమాలు ఇప్పటికీ అడియన్స్ మదిలో నిలిచిపోయాయి.

Cinema : ఏం ట్విస్టులు రా బాబూ.. దెబ్బకు మైండ్ బ్లాక్.. సైకలాజికల్ హారర్ సినిమా.. ఒంటరిగా చూడలేరు..
Kaun Movie

Updated on: Oct 28, 2025 | 4:46 PM

హారర్ సినిమాలు చూసే అలవాటు ఉందా.. ? అయితే మీకోసమే ఈ సైకలాజికల్ హారర్ మూవీని తీసుకువచ్చాము. ఊహించని ట్విస్టులు.. గూస్ బంప్స్ తెప్పించే సన్నివేశాలతో సాగే ఈ సినిమా అప్పట్లో భారీ విజయాన్ని అందుకుంది. ఇప్పటికీ ఈ చిత్రానికి ప్రత్యేక ఫ్యాన్ బేస్ ఉంది. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న సినిమా పేరు కౌన్. 1999లో విడుదలైన ఈ మూవీ భారీ విజయాన్ని అందుకుంది. ఇందులో బాలీవుడ్ హీరోయిన్ ఊర్మిళ మటోండ్కర్, మనోజ్ బాజ్ పేయి ప్రధాన పాత్రలలో నటించారు. ఇప్పటివరకు బాలీవుడ్‌లో అత్యుత్తమ సైకలాజికల్ హారర్ చిత్రం. రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం వహించిన ఈ చిత్రం షూటింగ్ కేవలం 15 రోజుల్లో పూర్తయింది. అంతేకాదు.. ఈ చిత్రాన్ని స్క్రిప్ట్ లేకుండానే తెరకెక్కించారు.

ఇవి కూడా చదవండి : Actress : శ్రీదేవికి వాయిస్ ఓవర్ ఇచ్చిన హీరోయిన్.. ఒకప్పుడు డిమాండ్ ఉన్న ఆర్టిస్ట్.. చివరకు ఊహించని విధంగా..

స్క్రిప్ట్ లేదు.. పెద్దగా బడ్జెట్ లేదు.. పాటలు అసలే లేవు.. అలాగే.. ఈ సినిమాలో ఎలాంటి స్పెషల్ ఎఫెక్ట్స్ ఉపయోగించలేదు. అయినప్పటికీ, ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించింది. ఇందులో సుశాంత్ సింగ్ సైతం కీలకపాత్ర పోషించారు. ఈ మూవీ షూటింగ్ మొత్తం ఒకే ఇంట్లో జరిగింది. రామ్ గోపాల్ వర్మ, మనోజ్ బాజ్ పేయి ఇద్దరూ సినిమా షూటింగ్ సమయంలో చాలా సన్నివేశాలకు సెట్ లోనే డైలాగ్స్ రాశారు. స్క్రిప్ట్ లేకుండా స్టార్ట్ చేసిన ఈ సినిమా షూటింగ్ కేవలం 15 రోజుల్లో పూర్తయ్యింది.

ఇవి కూడా చదవండి : Actress: ఇండస్ట్రీని ఏలేసిన హీరోయిన్.. లగ్జరీ లైఫ్ వదిలి బ్రహ్మాకుమారిగా.. 45 ఏళ్ల వయసులో ఇలా.. గుర్తుపట్టారా.. ?

ఈ సినిమా కథ మొత్తం ఊర్మిళ మటోండ్కర్ పాత్ర చుట్టూ తిరుగుతుంది. ఆద్యంతం ఊహించని మలుపులు, సస్పెన్స్, థ్రిల్లర్ సీన్స్ మిమ్మల్ని ఆద్యంతం ఉత్కంఠకు గురిచేస్తాయి. ప్రేక్షకులను ప్రతిక్షణం కొత్త ట్విస్టులతో సాగేలా చేస్తుంది. ఇందులో ఊర్మిళ తన నటనతో జనాల హృదయాలను గెలుచుకుంది. ప్రస్తుతం ఈ సినిమా యూట్యూబ్ లో అందుబాటులో ఉంది.

ఇవి కూడా చదవండి : Cinema : ఇవేం ట్విస్టులు రా అయ్యా.. ఊహించని మలుపులు.. ఈ సినిమాను అస్సలు మిస్సవ్వద్దు..