Cinema : 15 ఏళ్లుగా ట్రెండింగ్.. బాక్సాఫీస్ వద్ద అట్టర్ ప్లాప్.. దెబ్బకు కనిపించకుండా పోయిన హీరోయిన్..

ఇటీవల కంటెంట్ ప్రాధాన్యత ఉన్న చిత్రాలు బ్లాక్ బస్టర్ హిట్స్ అవుతున్నాయి. స్టార్ హీరోహీరోయిన్స్ లేకపోయినా రికార్డులు తిరగరాస్తున్న చిత్రాలు చాలా ఉన్నాయి. కానీ కొన్ని సినిమాలు భారీ బడ్జెట్, స్టార్స్ నటించినప్పటికీ బాక్సాఫీస్ వద్ద అట్టర్ ప్లాప్ అయ్యాయి. ప్రస్తుతం మనం మాట్లాడుకుంటున్న ఓ సినిమా మాత్రం విడుదలైన మొదటి రోజే అట్టర్ ప్లాప్ అయ్యింది.

Cinema : 15 ఏళ్లుగా ట్రెండింగ్.. బాక్సాఫీస్ వద్ద అట్టర్ ప్లాప్.. దెబ్బకు కనిపించకుండా పోయిన హీరోయిన్..
Veer Movie

Updated on: Mar 01, 2026 | 11:22 AM

సాధారణంగా ఈమధ్యకాలంలో చిన్న సినిమాలు సత్తా చాటుతున్నాయి. కొన్ని సందర్భాల్లో భారీ బడ్జెట్ చిత్రాలు నిరాశపరుస్తున్నాయి. మరోవైపు థియేటర్లలో అట్టర్ ప్లాప్ అయిన సినిమాలు మాత్రం ఓటీటీలో దూసుకుపోతున్నాయి. ఊహించని రేంజ్ లో డిజిటల్ ప్లాట్ ఫామ్ లో సత్తా చాటుతున్నాయి. అయితే ఓ సినిమాను తెరకెక్కించడానికి దాదాపు 20 సంవత్సరాలు పట్టింది. స్టార్ హీరోహీరోయిన్లను ప్రధాన పాత్రలతో రెండు దశాబ్దాలపాటు చిత్రీకరణ జరిగింది. చివరకు బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ అయ్యింది. కానీ అదే సినిమా ఇప్పుడు ఓటీటీలో దూసుకుపోతుంది. ఇంతకీ ఆ సినిమా ఏంటీ.. ? స్టోరీ ఏంటీ? అనేది తెలుసుకుందామా.

ఎక్కువ మంది చదివినవి : Folk Singer : ఒక్క పాటతో యూట్యూబ్ సెన్సేషన్.. ఎర్ర ఎర్ర రుమాల్ పాటకు ఎంత రెమ్యునరేషన్ ఇచ్చారంటే..

బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో నటించిన సినిమాల్లో వీర్ ఒకటి. ఇందులో జరీనా ఖాన్ కథానాయికగా నటించింది. ఈ మూవీ సల్మాన్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ ప్లాప్ గా నిలిచింది. 2010లో ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా అంతగా ఆకట్టుకోలేకపోయింది. దాదాపు 63 కోట్లతో నిర్మించిన ఈ సినిమా కనీసం పెట్టుబడి సైతం రాబట్టలేకపోయింది. భారీ హైప్ మధ్య సల్మాన్ డ్రీమ్ ప్రాజెక్ట్ గా వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద బోల్తా పడింది. బ్రిటిష్ వలస పాలకులకు లొంగిపోవడానికి నిరాకరించే పిండారీల అనే గిరిజనుల కథను ఆధారంగా చేసుకుని తెరకెక్కించిన సినిమా ఇది. ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీ రూ.43 కోట్లు మాత్రమే కలెక్షన్స్ రాబట్టింది.

ఎక్కువ మంది చదివినవి : Jagapathi Babu: ఆ హీరోను ప్రతిరోజూ తలుచుకుంటా.. బతికితే అతడిలా బతకాలి.. జగపతి బాబు..

ఈ సినిమాలో జరీనా ఖాన్ హీరోయిన్ గా నటించింది. యువరాణి పాత్రలో మరింత అందంగా మెప్పించింది. అయితే ఈ సినిమా అట్టర్ ప్లాప్ కావడంతో జరీనాకు ఆశించిన స్థాయిలో గుర్తింపు రాలేదు. హిందీలో హౌస్ ఫుల్ 2, వాజా తుమ్ హో వంటి చిత్రాల్లో నటించినప్పటికీ అంతగా ఆఫర్స్ రాలేదు. ప్రస్తుతం ఇండస్ట్రీకి దూరంగా ఉండిపోయింది. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉంది ఈ సినిమా.

ఎక్కువ మంది చదివినవి : Tollywood : సందీప్ రెడ్డి వంగాకు మెసేజ్ చేసి పిచ్చోడిని అయిపోయా.. టాలీవుడ్ హీరో..

ఎక్కువ మంది చదివినవి : Tollywood : రజినీకాంత్ చేసిన ఆ ఒక్క హెల్ప్‏తో చిరంజీవి లైఫ్ మారిపోయింది.. టాలీవుడ్ నటుడు..

Follow Us