చిరంజీవి, పవన్ కళ్యాణ్‌కు లవర్‌గా రామ్ చరణ్‌కు తల్లిగా.. ఈ హీరోయిన్ రూటే సపరేటు

ప్రస్తుతం చిరంజీవి రెండు సినిమాలతో బిజీగా ఉన్నారు. ఓ వైపు విశ్వంభర, అలాగే మన శంకరవరప్రసాద్ గారు అనే సినిమాలు చేస్తున్నారు. అటు పవన్ కళ్యాణ్ కూడా రాజకీయాలతో పాటు సినిమాలు కూడా చేస్తున్నారు. ప్రస్తుతం పవన్ ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలు చేస్తున్నారు. మరోవైపు చరణ్ పెద్ది సినిమా చేస్తున్నాడు.

చిరంజీవి, పవన్ కళ్యాణ్‌కు లవర్‌గా రామ్ చరణ్‌కు తల్లిగా.. ఈ హీరోయిన్ రూటే సపరేటు
Chiranjeevi, Pwan Kalyan

Updated on: Sep 18, 2025 | 12:44 PM

సినిమా ఇండస్ట్రీలో చాలా మంది హీరోయిన్స్ రాణించడం కోసం ఎలాంటి పాత్రలు చేయడానికైనా సిద్ధంగా ఉంటారు. కొంతమంది హీరోయిన్స్ వయసుకు మించిన పాత్రలు చేసి మెప్పిస్తూ ఉంటారు. కొంతమంది హీరోయిన్స్ ఒకే హీరోకు భార్యగా, అక్కగా, అమ్మగా కూడా నటిస్తూ ఉంటారు. అలాగే మరికొంతమంది హీరోయిన్స్ ఓ ఫ్యామిలీ హీరోల్లో తండ్రి కొడుకుల పక్కన కూడా హీరోయిన్ గా నటిస్తూ ఉంటారు. ఇప్పుడు మనం మాట్లాడుకునే హీరోయిన్ కూడా అదే కోవకు చెందింది.. ఆమె మెగా హీరోల సరసన హీరోయిన్ గా మెప్పించింది. అయితే చిరంజీవికి, పవన్ కళ్యాణ్ కు లవర్ గా నటించిన ఆమె రామ్ చరణ్ కు తల్లిగా నటించింది. ఆ హీరోయిన్ ఎవరో తెలుసా.?ఆమె అందానికి ఫిదా కానీ ప్రేక్షకుడు ఉండరు. ఇంతకూ ఆమె ఎవరంటే..

మనుషుల్నిపీక్కుతిండం ఏంట్రా బాబు..! ఒకే సినిమాలో ఆరు స్టోరీలు.. దైర్యమున్నోళ్లే చూడండి

చిరంజీవికి, పవన్ కళ్యాణ్ కు లవర్ గా నటించి.. రామ్ చరణ్ కు తల్లిగా నటించిన హీరోయిన్ ఎవరో కాదు.. ఎవరు గ్రీన్ బ్యూటీ శ్రియ శరన్. ఈ ముద్దుగుమ్మ ఇప్పటికీ అదే అందంతో ప్రేక్షకులను కవ్విస్తుంది. ఇటీవలే మిరాయ్ సినిమాతో భారీ హిట్ అందుకుంది.. ఈ భామ. కాగా మెగాస్టార్ చిరంజీవి నటించిన ఠాగూర్ సినిమాలో శ్రియ చిరంజీవిని ఇష్టపడే అమ్మాయిగా కనిపించింది. అలాగే పవన్ కళ్యాణ్ నటించిన బాలు సినిమాలో ఆయన లవర్ గా మెరిసింది.

ఇవి కూడా చదవండి

ఆరుగురు పిల్లల తండ్రితో ఎఫైర్.. పెళ్లి కాకుండా ఇద్దరు పిల్లలకు తల్లైంది.. ఆమె కూతురు కూడా స్టార్ హీరోయిన్

ఎంతో మంది స్టార్ హీరోల సరసన నటించిన శ్రియ రామ్ చరణ్ కు తల్లిగాను నటించింది. ఆ సినిమా ఎదో కాదు దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ సినిమా.. ఈ సినిమాలో శ్రియ చిన్న పాత్రలోనే కనిపించింది. రామ్ చరణ్ ఫ్లాష్ బ్యాక్( చరణ్ చిన్ననాటి పాత్ర సమయంలో ) ఆమె చరణ్ తల్లిగా కనిపించింది. ఇపా చిరంజీవికి, పవన్ కళ్యాణ్ కు హీరోయిన్ గా చేసింది చరణ్ కు తల్లిగా నటించింది శ్రియ. ఇక ఇప్పటికీ తరగని అందంతో కుర్రకారును కవ్విస్తుంది శ్రియ. యంగ్ హీరోయిన్స్ ను బీట్ చేసేలా తన గ్లామర్ తో ఆకట్టుకుంటుంది.

13 ఏళ్లకు హీరోయిన్.. 19ఏళ్లకే కనబడకుండాపోయింది.. ఇప్పుడు సినిమాలు మానేసి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.