AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కల్కి సీక్వెల్ నుంచి దీపికా అవుట్.. బాలీవుడ్ భామకు దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన మేకర్స్

టాలీవుడ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన బ్లాక్ బస్టర్ హిట్ మూవీ కల్కి 2898 ఏడీ. ఈ చిత్రంలో ప్రభాస్, దీపికా పదుకొణె, దిశా పటానీ, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దుల్కర్ సల్మాన్ వంటి పాన్ ఇండియన్ సెలబ్రిటీలు కీలకపాత్రలు పోషించారు. హిందూ ఇతిహాసం దశావతారలోని చివరి అవతారమైన కల్కి అవతారం ఆధారంగా చేసుకుని సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో రూపొందించారు నాగ్ అశ్విన్

కల్కి సీక్వెల్ నుంచి దీపికా అవుట్.. బాలీవుడ్ భామకు దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన మేకర్స్
Prabhas
Rajeev Rayala
|

Updated on: Sep 18, 2025 | 12:09 PM

Share

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన సినిమాలు వరుసగా బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్నాయి. ఇక ప్రభాస్ కెరీస్ లో బిగ్గెస్ట్ హిట్ మూవీస్ లో కల్కి సినిమా ఒకటి. కల్కి సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రెబల్ స్టార్ ప్రభాస్ కల్కి సినిమాతో మరోసారి వెయ్యి కోట్ల క్లబ్ లోకి చేరిపోయారు. బాహుబలి సినిమా తర్వాత కల్కి ఆ రికార్డ్ ను సొంతం చేసుకుంది. ఈ సినిమాకు నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించారు. మహాభారత నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో చాలా మంది నటీనటులు ఉన్నారు. టాలీవుడ్ హీరోలు, హీరోయిన్స్ తో పాటు పలువురు దర్శకులు కూడా ఈ సినిమాలో నటించారు. విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్, ఆర్జీవీ, రాజమౌళి, అవసరాల శ్రీనివాస్ ఇలా చాలా మంది ఈ సినిమాలో కనిపించారు.

మనుషుల్నిపీక్కుతిండం ఏంట్రా బాబు..! ఒకే సినిమాలో ఆరు స్టోరీలు.. దైర్యమున్నోళ్లే చూడండి

అలాగే శోభన, రాజేంద్ర ప్రసాద్, కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్ ఈ సినిమాలో కీలకపాత్రల్లో కనిపించారు. ఈ సినిమాను పలు పార్ట్స్‌గా తెరకెక్కించనున్నారు దర్శకుడు నాగ్ అశ్విన్. అలాగే సినిమాలో కీలక పాత్రలో బాలీవుడ్ అందాల భామ దీపికా పదుకొనె హీరోయిన్ గా నటించింది. అయితే తాజాగా కల్కి సినిమా మేకర్స్ ఓ షాకింగ్ అప్డేట్ ఇచ్చారు. కల్కి సీక్వెల్ లో దీపికా నటించడం లేదు అని అఫీషియల్ గా అనౌన్స్ చేశారు.

ఇవి కూడా చదవండి

ఆరుగురు పిల్లల తండ్రితో ఎఫైర్.. పెళ్లి కాకుండా ఇద్దరు పిల్లలకు తల్లైంది.. ఆమె కూతురు కూడా స్టార్ హీరోయిన్

ఈ మేరకు వైజయంతీ మూవీస్ ఓ ట్వీట్ ను షేర్ చేశారు. “ఇది మా అధికారిక ప్రకటన దీపికా పదుకొనె .. రానున్న కల్కి సీక్వెల్‌లో భాగం కాదు. దీని పై చర్చించిన తర్వాత.. ఈ నిర్ణయం తీసుకున్నాం.. ఆమె కమిట్మెంట్స్ ( రోజుకు ఎనిమిదిగంటలే పని చేస్తా) ఈ సినిమాకు సరిపోవు. దాంతో ఆమెను కొనసాగించలేకపోతున్నాం” అని ట్వీట్ చేశారు. గతంలో సందీప్ రెడ్డి వంగ ప్రభాస్ నటించిన స్పిరిట్ సినిమా కోసం దీపికను సంప్రదించినప్పుడు ఆమె చెప్పిన రూల్స్, పెట్టిన కండిషన్స్ నచ్చకపోవడంతో ఆమెను వద్దు అనుకున్నాడు. ఆ సమయంలో పెద్ద రచ్చే జరిగింది. ఇక ఇప్పుడు కల్కి సినిమా సీక్వెల్ నుంచి దీపికను తప్పిస్తూ కల్కి టీమ్ షాకింగ్ అనౌన్స్ మెంట్ చేసింది.

13 ఏళ్లకు హీరోయిన్.. 19ఏళ్లకే కనబడకుండాపోయింది.. ఇప్పుడు సినిమాలు మానేసి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.