ఆయనకు 36.. ఆమెకు19.. కట్ చేస్తే 20ఏళ్లకే తల్లయ్యింది.. చేతులారా కెరీర్ నాశనం చేసుకున్న హీరోయిన్

ఆమె ఇండస్ట్రీలో ఓ క్రేజీ హీరోయిన్.. చిన్న వయసులోనే హీరోయిన్ గా మారింది. తక్కువ సమయంలోనే స్టార్ హీరోల సరసన నటించింది. తెలుగుతో పాటు హిందీలోనూ సినిమాలు చేసింది ఈ ముద్దుగుమ్మ. 19ఏళ్ల వయసులోనే డైరెక్టర్ ను పెళ్లి చేసుకుంది. 20ఏళ్ల వయసులో గర్భవతి అయ్యింది.

ఆయనకు 36.. ఆమెకు19.. కట్ చేస్తే 20ఏళ్లకే తల్లయ్యింది.. చేతులారా కెరీర్ నాశనం చేసుకున్న హీరోయిన్
Tollywood

Updated on: Aug 26, 2025 | 11:41 AM

ఇండస్ట్రీలో చిన్న వయసులోనే హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన భామలు చాలా మంది ఉన్నారు. చైల్డ్ ఆర్టిస్ట్ లుగా కెరీర్ మొదలుపెట్టిన వారు కొంతమంది ఉంటే మరికొంతమంది చిన్న వయసులోనే హీరోయిన్స్‌గా మారిన వారు ఉన్నారు. 16, 17ఏళ్లకు హీరోయిన్స్ గా అయిన వారు ఎంతో మంది ఉన్నారు. ఇక ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న వయ్యారి భామ కూడా చిన్న వయసులోనే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. తక్కువ సమయంలోనే స్టార్ డమ్ సంపాదించుకుంది. హిందీలో అగ్ర హీరోల సరసన నటించిన ఈ ముద్దుగుమ్మ.. కెరీర్ మంచి ఫాంలో ఉండగానే ప్రేమించిన వాడిని పెళ్లి చేసుకుని సినిమాలకు దూరమయ్యింది. పెళ్లాడే సమయానికి ఆమె వయసు కేవలం 19ఏళ్లు మాత్రమే. 20ఏళ్లకు తల్లి అయ్యింది. చేతులారా కెరీర్ నాశనం చేసుకుంది. ఇంతకీ ఆమె భామ తెలుసా.. ?

ఇది కదా సినిమా అంటే.! 8 రోజులు షూటింగ్.. రూ. 52లక్షల బడ్జెట్..!! రూ.2100కోట్లు వసూల్ చేసింది..

ఈ ముద్దుగుమ్మ పేరు భక్తవర్ ఖాన్ అలియాస్ సోనమ్ ఖాన్. మహేష్ బాబు అన్న రమేష్ బాబు నటించిన సామ్రాట్  సినిమాతో హీరోయిన్ గా మారింది. అప్పటికి ఆమె వయసు 14ఏళ్లు మాత్రమే.. ఆ తర్వాత ఏడాదిలోనే బాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చింది. మొదటి సినిమాతోనే అందం, అభినయంతో అందరి దృష్టిని ఆకర్షించింది. భక్తవర్ ఖాన్ ఉన్న ఆమె పేరును యశ్ చోప్రా సోనమ్ ఖాన్ గా మార్చారు. రెండేళ్లలో 20కి పైగా చిత్రాల్లో నటించి మెప్పించింది సోనమ్.. బాలీవుడ్లో ఆమెకు గుర్తింపు తెచ్చిపెట్టిన చిత్రాలు చాలానే ఉన్నాయి. బాలీవుడ్ తోపాటు అడపాదడపా సినిమాలు చేసింది. ఈ క్రమంలోనే 1990లో మెగాస్టార్ చిరంజీవి సరసన కొదమ సింహం సినిమాలో నటించింది. చిరంజీవి మాత్రమే కాదు.. అమితాబ్ బచ్చన్, సన్నీడియోల్, సంజయ్ దత్, గోవింద వంటి స్టార్ హీరోలతో కలిసి నటించింది.

యంగ్ హీరోలను వదిలేసి.. సీనియర్స్‌కు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్న కుర్ర భామ.. చిరంజీవి, నాగార్జున తర్వాత ఇప్పుడు ఆయనతో..

కెరీర్ మంచి ఫాంలో ఉండగానే 19 ఏళ్ల వయసులో తనకంటే 17 ఏళ్లు పెద్దవాడైన డైరెక్టర్ రాజీవ్ రాయ్ ను పెళ్లి చేసుకుంది. 20ఏళ్లకు గర్భవతి అయ్యింది. వీరికి బాబు జన్మించాడు. అయితే తమ కొడుకు ఆటిజం సమస్యతో పుట్టడంతో ట్రీట్మెంట్ కోసం వెళ్లి యూరప్‌లో సెటిల్ అయ్యారు. 2016లో వీరిద్దరు విడాకులు తీసుకున్నారు. ఇక ఇప్పుడిప్పుడే సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చింది సోనమ్ ఖాన్. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే సోనమ్ ఖాన్ తన ఫొటోలతో , వీడియోలతో అభిమానులను టచ్ లో ఉంటుంది.

అందంలో అప్సరస.. అదృష్టం మాత్రం లేదు.. 9 సినిమాలు చేస్తే 8ఫ్లాప్స్

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి