AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cinema : హైదరాబాద్‌లో 556 రోజులు ఆడిన సినిమా.. 48 ఏళ్లుగా తగ్గని డిమాండ్.. ఇప్పటికీ చెరగని రికార్డ్..

హైదరాబాద్‌లో ఓ థియేటర్లో దాదాపు 556 రోజులు సత్తా చాటిన ఓ సినిమా గురించి మీకు తెలుసా.. ? దాదాపు 48 ఏళ్ల క్రితం విడుదలైన ఈ మూవీ సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతా కాదు. ఇప్పటికీ ఆ సినిమా రికార్డ్ బద్దలుకొట్టలేకపోయింది మరో చిత్రం. అంతేకాదు సెలబ్రెటీల నుంచి సామాన్యుల వరకు ప్రతి ఒక్కరు ఆ సినిమాకు ఫిదా అయిపోయారు. ఇంతకీ ఏ మూవీ అంటే.

Cinema : హైదరాబాద్‌లో 556 రోజులు ఆడిన సినిమా.. 48 ఏళ్లుగా తగ్గని డిమాండ్.. ఇప్పటికీ చెరగని రికార్డ్..
Maro Charitra
Rajitha Chanti
|

Updated on: May 03, 2026 | 7:23 AM

Share

1978లో విడుదలైన ఒక అద్భుతమైన తెలుగు ప్రేమకథ సినిమా. డైరెక్టర్ కె. బాలచందర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కమల్ హాసన్ , సరిత ప్రధాన పాత్రల్లో నటించారు. కె. బాలచందర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కమల్ హాసన్ మరియు సరిత ప్రధాన పాత్రల్లో నటించారు. అప్పట్లో రంగుల చిత్రాలు వస్తున్నప్పటికీ, ఈ సినిమా నలుపు-తెలుపు (Black & White) లో విడుదలై సంచలన విజయం సాధించింది. ఈ సినిమా పేరు మరో చరిత్రం. దాదాపు 48 ఏళ్లుగా ఈ మూవీ రికార్డ్ బ్రేక్ చేయలేకపోయారు. అప్పట్లో సౌత్ ఇండస్ట్రీలోని బాక్సాఫీస్ వద్ద తుఫాను సృష్టించింది. 1978 మే నెలలో విడుదలైన ఈ చిత్రంలోని సాంగ్స్ సైతం సూపర్ హిట్ అయ్యాయి. ఇది ఒక తమిళ అబ్బాయి, ఒక తెలుగు అమ్మాయి ప్రేమలో పడటం గురించిన కథ. వారిద్దరి కుటుంబాలు ఈ ప్రేమను అంగీకరించవు. వారిని ఒక సంవత్సరం పాటు విడివిడిగా ఉండమని కోరతారు. ఆ సమయంలో వారిద్దరి జీవితాన్ని తీరని విషాదం నెలకొంటుంది.

ఎక్కువ మంది చదివినవి : Sekhar Kammula : ఆ సినిమా తీసి తప్పు చేశాను.. అది ఒక పొరపాటు మాత్రమే.. డైరెక్టర్ శేఖర్ కమ్ముల కామెంట్స్..

తెలుగు, తమిళం భాషలలో విడుదలైన ఈ సినిమా మూడు రాష్ట్రాల్లో దాదాపు సంవత్సరంపాటు ఏకదాటిగా ప్రదర్శించారు. ‘మరో చరిత్ర’కు ముందు, బాలచందర్ దర్శకత్వంలో కమల్ నటించిన అంతులేని కథ అప్పటి ఉమ్మటి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో 100 రోజులు ఆడింది. ఈ సినిమా విజయంతో కమల్‌కు ఎన్నో సినిమా అవకాశాలు వచ్చాయి. ఆయన అన్నింటినీ పక్కనపెట్టి, తన గురువు బాలచందర్ దర్శకత్వంలో తెలుగు చిత్రసీమలో హీరోగా అరంగేట్రం చేయాలనుకున్నారు. ఆ క్రమంలోనే ‘మరో చరిత్ర’ చిత్రం రూపుదిద్దుకుంది. ఈ సినిమా కోసం హీరోయిన్‌ను వెతుకుతున్న కె. బాలచందర్, 161 మంది మహిళలను చూసినా సెలక్ట్ చేయలేకపోయారు. 162వ మహిళగా అభిలాషను స్క్రీన్ టెస్ట్ చేశారు. ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరుకు చెందిన ఆ అమ్మాయి అప్పట్లో 10వ తరగతి చదువుతోంది. బాలచందర్‌కు ఆమె నచ్చింది. ఆమె పేరును సరితగా మార్చారు డైరెక్టర్ బాలచందర్.

ఎక్కువ మంది చదివినవి : Gopichand : జయం సినిమాకు నాకు ఇచ్చిన రెమ్యునరేషన్ అంతే.. ఎలా ఖర్చు చేశానంటే.. గోపిచంద్ కామెంట్స్..

మరో చరిత్ర ఆంధ్రప్రదేశ్‌లోని 18 కేంద్రాలలో 200 రోజులు పూర్తి చేసుకుంది. ఇక్కడ 450 రోజులకు పైగా ఆడింది. అంతేకాదు.. ఈ చిత్రం హైదరాబాద్‌లోని థియేటర్లలో ఏకధాటిగా 556 రోజుల పాటు ప్రదర్శితమై రికార్డు సృష్టించింది. ఈ చిత్రం తెలుగు సినిమా చరిత్రలో అత్యధిక రోజులు ప్రదర్శితమైన చిత్రాలలో ఒకటిగా నిలిచి, అప్పట్లో రికార్డులను తిరగరాసింది.

ఎక్కువ మంది చదివినవి :  Tollywood : రూ.5 వేలకు స్కూల్లో టీచర్.. ఇప్పుడు ఒక్కో సినిమాకు కోట్లలో రెమ్యునరేషన్.. పాన్ ఇండియా గ్లామరస్ హీరోయిన్..

ఎక్కువ మంది చదివినవి : Krishna Vamsi : రమ్య కృష్ణతో ప్రేమ, పెళ్లికి ఆ పాటనే కారణం.. డైరెక్టర్ కృష్ణ వంశీ..

Follow Us
48 ఏళ్లుగా చెరగని రికార్డ్.. హైదరాబాద్‌లో 556 రోజులు ఆడిన సినిమా.
48 ఏళ్లుగా చెరగని రికార్డ్.. హైదరాబాద్‌లో 556 రోజులు ఆడిన సినిమా.
పది బంతుల్లోనే సూర్య వికెట్.. ఎవరీ రామకృష్ణ ఘోష్?
పది బంతుల్లోనే సూర్య వికెట్.. ఎవరీ రామకృష్ణ ఘోష్?
నోటితో కాదు.. కప్పలు ఆహారాన్ని ఎలా మింగుతాయో తెలుసా?
నోటితో కాదు.. కప్పలు ఆహారాన్ని ఎలా మింగుతాయో తెలుసా?
ఇందిరమ్మ ఇళ్ల యాప్‌లో మార్పులు.. ఇక నుంచి కొత్త విధానం..
ఇందిరమ్మ ఇళ్ల యాప్‌లో మార్పులు.. ఇక నుంచి కొత్త విధానం..
వెంకటేశ్ పరిచయం చేసిన హీరోయిన్లంతా తోపులే.. ఒక్కొక్కరికి స్టార్ డ
వెంకటేశ్ పరిచయం చేసిన హీరోయిన్లంతా తోపులే.. ఒక్కొక్కరికి స్టార్ డ
తండ్రయిన 'పుష్ప' విలన్ జాలిరెడ్డి.. కుమారుడి ఫొటోస్ వైరల్
తండ్రయిన 'పుష్ప' విలన్ జాలిరెడ్డి.. కుమారుడి ఫొటోస్ వైరల్
ఐపీఎల్ 2026లో అదుర్స్.. కట్‌చేస్తే.. నేరుగా భారత జట్టులోకి 5గురు
ఐపీఎల్ 2026లో అదుర్స్.. కట్‌చేస్తే.. నేరుగా భారత జట్టులోకి 5గురు
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు జరిగిన శస్త్ర చికిత్స ఏంటో తెలుసా..
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు జరిగిన శస్త్ర చికిత్స ఏంటో తెలుసా..
రన్నింగ్ vs స్విమ్మింగ్.. గుండె ఆరోగ్యానికి ఏది బెస్ట్..?
రన్నింగ్ vs స్విమ్మింగ్.. గుండె ఆరోగ్యానికి ఏది బెస్ట్..?
తగ్గిన చికెన్ ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో కిలో ఎంతంటే..?
తగ్గిన చికెన్ ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో కిలో ఎంతంటే..?