Tollywood: 15 ఏళ్ల వయసులోనే టాప్ హీరోయిన్.. 6 సంవత్సరాల్లో 25 సినిమాలు.. 21 ఏళ్లకే విషాదం..

చిన్న వయసులోనే సినీరంగంలోకి అడుగుపెట్టి ఆ తర్వాత ఊహించని స్థాయిలో స్టార్ స్టేటస్ సంపాదించుకున్న తారలు చాలా మంది ఉన్నారు. కేవలం 15 ఏళ్ల వయసులోనే అగ్ర కథానాయికగా దూసుకుపోయింది. ఆరేళ్లల్లో దాదాపు 25 సినిమాల్లో నటించి మెప్పించింది. కానీ 21 సంవత్సరాల వయసులోనే తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయింది.

Tollywood: 15 ఏళ్ల వయసులోనే టాప్ హీరోయిన్.. 6 సంవత్సరాల్లో 25 సినిమాలు.. 21 ఏళ్లకే విషాదం..
Monisha Unni

Updated on: Sep 01, 2025 | 8:30 AM

సినీరంగంలోకి 15 ఏళ్లకే చక్రం తిప్పింది. తక్కువ సమయంలోనే స్టార్ స్టేటస్ సంపాదించుకుంది. ఆరు సంవత్సరాల్లో దాదాపు 25 సినిమాల్లో నటించి మెప్పించింది. కానీ కెరీర్ పీక్స్ లో దూసుకుపోతుండగానే ఊహించని విషాదం ఆమె జీవితాన్ని ముగించింది. ఈ హీరోయిన్ పేరు మోనిషా ఉన్ని. సీనియర్ నటి శ్రీదేవి, వ్యాపారవేత్త నారాయణ్ ఉన్నిల కుమార్తె. చిన్నప్పటి నుంచే నటనపై ఆసక్తి పెంచుకుంది. 15 సంవత్సరాల వయసులో జాతీయ అవార్డు గెలుచుకోవడం ద్వారా తనదైన ముద్ర వేసింది. కేవలం ఆరు సంవత్సరాలలో 25 చిత్రాలలో నటించింది. అప్పట్లో ఆమెను లేడీ సూపర్ స్టార్ అని పిలిచేవారు. ఇండస్ట్రీలో ఏలుతున్న సమయంలోనే ఊహించని విషాదం ఆమె జీవితాన్ని అర్థాంతరంగ ముగించింది.

ఇవి కూడా చదవండి : Actress : ఎలాంటి డైట్ లేకుండా 35 కిలోల బరువు తగ్గిన హీరోయిన్.. ఫిట్నెస్ సీక్రెట్ ఇదే..

1971లో జన్మించిన మోనిషా ఉన్ని బెంగళూరులోని సెయింట్ చార్లెస్ హై స్కూల్, బిషప్ కాటన్ గర్ల్స్ స్కూల్‌లో పాఠశాల విద్యను పూర్తి చేసింది. ఆమె బెంగళూరులోని మౌంట్ కార్మెల్ కాలేజీలో సైకాలజీలో గ్రాడ్యుయేషన్‌ను కూడా పూర్తి చేసింది.మొదట మలయాళ నవలా రచయిత ఎం.టి. వాసుదేవన్ నాయర్, కుటుంబ స్నేహితుడు, ఆమె తొలి చిత్రంలోనే పెద్ద పాత్ర పోషించారు. ఎం.టి. వాసుదేవన్ నాయర్ రాసిన, హరిహరన్ దర్శకత్వం వహించిన నఖక్షతంగల్ (1986) చిత్రంతో ఆమె అరంగేట్రం చేసింది. 1987లో, 15 సంవత్సరాల వయసులో, మోనిషా ఉన్ని ఉత్తమ నటిగా జాతీయ చలనచిత్ర అవార్డును గెలుచుకుంది.

ఇవి కూడా చదవండి : Actress : ఎలాంటి డైట్ లేకుండా 35 కిలోల బరువు తగ్గిన హీరోయిన్.. ఫిట్నెస్ సీక్రెట్ ఇదే..

తరువాతి ఆరు సంవత్సరాలలో, ఆమె 25 చిత్రాలలో నటించి సినీ ప్రపంచంలో ఒక సంచలనం సృష్టించింది. తక్కువ సమయంలోనే అపారమైన విజయాన్ని సాధించింది. ఆమె తమిళ సినిమాల్లో కూడా సంచలనం సృష్టించింది. 1987లో పూక్కల్ విడుమ్ తుధు సినిమాతో అరంగేట్రం చేసిన తర్వాత, ఆమె 1989లో సత్యరాజ్‌తో కలిసి ద్రవిడన్ చిత్రంలో కూడా నటించింది. కెరీర్ మంచి ఫాంలో ఉండగానే.. 1992లో 21 సంవత్సరాల వయసులో కారు ప్రమాదంలో మరణించింది. మలయాళ చిత్రం చెప్పాదివిద్య చిత్రంలో నటిస్తుండగా.. ఆమె, తన తల్లితో కలిసి ప్రయాణిస్తున్న కారు కేరళలోని ఆర్టీసీ బస్సును ఢీకొట్టింది. వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించేలోపే మరణించింది.

ఇవి కూడా చదవండి : గ్లామర్‏లో అరాచకం.. అందం ఉన్న కలిసిరాని అదృష్టం.. క్రేజ్ పీక్స్..

ఇవి కూడా చదవండి : Serial Actress: ఆఫర్స్ కోసం వెళితే కమిట్మెంట్ అడిగారు.. అలా ఆకలి తీర్చుకున్నా.. సీరియల్ బ్యూటీ ఎమోషనల్..

Follow Us