Tollywood : 11 మందితో డేటింగ్.. పెళ్లి కాకుండానే తల్లైన హీరోయిన్.. ఇప్పటికీ ఒంటరిగానే..
సినీరంగంలో అందం, అభినయంతో మెప్పించే తారలు చాలా మంది వ్యక్తిగత జీవితం మాత్రం అంత సాఫీగా ఉండదు. చాలా మంది హీరోయిన్ల జీవితాల్లో ప్రేమ, పెళ్లి అంతగా కలిసిరావు. కొంతమంది పెళ్లి చేసుకోకుండా ఒంటరిగా ఉంటున్నారు. మరికొందరు విడాకులు తీసుకుని తిరిగి సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న హీరోయిన్ అలా కాదు..

సినీరంగంలో ఆమె టాప్ హీరోయిన్. తెలుగుతోపాటు హిందీలో అనేక చిత్రాల్లో నటించి మెప్పించింది. కకానీ కెరీర్ మంచి ఫాంలో ఉన్నప్పుడే ఎదురైన ప్రేమ ఆమె జీవితాన్ని మలుపు తిప్పింది. అప్పట్లోఆమె దాదాపు 11 మందిని ప్రేమించినట్లు వార్తలు వినిపించాయి. కానీ ఏ ప్రేమ కూడా వివాహ దశకు చేరుకోలేదు. తరువాత, ఆమె 24 సంవత్సరాల వయసులో తల్లి అయిన తర్వాత మరింత వార్తల్లో నిలిచింది.. ఆమె మరెవరో కాదు నటి సుష్మితా సేన్. అప్పట్లో ఆమె పేరు కొందరు హీరోలు, వ్యాపారవేత్తలతో ముడిపడి ఉంది. గతంలో ఓ ఇంటర్వ్యూలో సుష్మితా మాట్లాడుతూ.. ‘నా జీవితం తెరిచిన పుస్తకం లాంటిది. మీరు జీవితంలో ఏ నిర్ణయాలు తీసుకున్నా.. ఆ నిర్ణయాలు బాధాకరమైనవి కావచ్చు. కానీ జీవితంలో ప్రతి నిర్ణయం మీకు ఏదో నేర్పుతుంది..’ అంటూ చెప్పుకొచ్చింది.
ఇవి కూడా చదవండి : Actress: ఒకప్పుడు స్కూల్లో టీచర్.. ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ హీరోయిన్.. క్రేజ్ మాములుగా ఉండదు..
అప్పట్లో సుష్మిత పేరు లలిత్ మోడీ, సంజయ్ నారంగ్, రణదీప్ హుడా, ఇంతియాజ్ ఖత్రి, వసీం అక్రమ్, ముదస్సర్ అజీజ్ వంటి 11 మందితో ప్రేమలో పడిందని అప్పట్లో టాక్ నడిచింది. ‘మిస్ యూనివర్స్’ టైటిల్ గెలుచుకున్న సుష్మితా సేన్ వరుస సినిమాలతో ఇండస్ట్రీని ఏలేసింది. సుష్మితా సేన్ OTT ప్లాట్‌ఫామ్‌లో కూడా తనకంటూ ఒక పేరు తెచ్చుకుంది. ‘తాలి’ , ‘ఆర్య’ చిత్రాలతో సుష్మితా సేన్ తన విజయ శిఖరాగ్రానికి చేరుకుంది. విభిన్న కథలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది.
ఇవి కూడా చదవండి : Kamal Haasan : ఆరేళ్ల వయసులోనే సినిమాల్లోకి.. ఒక్కో సినిమాకు రూ.150 కోట్లు.. కమల్ హాసన్ ఆస్తులు ఎంతో తెలుసా.. ?
కానీ ఇప్పటికీ సుష్మితా ఒంటరిగానే ఉండిపోయింది. ఆమె వివాహం చేసుకోవడానికి ఇష్టపడలేదు. ఇద్దరు అమ్మాయిలను దత్తత తీసుకుని వారి బాగోగులు చూసుకుంటుంది. ప్రస్తుతం సుష్మితా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్. నిత్యం ఏదోక పోస్ట్ చేస్తూ సందడి చేస్తుంది. అలాగే ఓటీటీలో పలు వెబ్ సిరీస్ చేస్తుంది.
View this post on Instagram
ఇవి కూడా చదవండి : Venky Movie: వెంకీ సినిమాను మిస్సైన హీరోయిన్ ఎవరో తెలుసా.. ? రవితేజతో జోడి కట్టాల్సిన బ్యూటీ ఎవరంటే..




